టిడిపి , జనసేన రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం విజయవాడ నోవాటెల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి తరఫున నారా లోకేష్, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు , జనసేన పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. రెండు పార్టీలు కలిసి భవిష్యత్ కార్యాచరణ పై మూడు గంటలు సుదీర్ఘంగా చర్చించారు. టిడిపి జనసేన పార్టీలవైపు సుమారు మూడు కోట్ల మంది ప్రజలు చూస్తున్నారని వారందరిని పలకరిస్తూ రెండు పార్టీలు కలిసి భవిష్యత్ గ్యారెంటీ అనే నినాదంతో ప్రతి ఇంటికి వెళ్లి టిడిపి జనసేన మేనిఫెస్టో, కరపత్రాలను అందిస్తామంటున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తో మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు పేస్ టూ ఫేస్..
Janasena party
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చి కక్షపూరిత రాజకీయాలకు పెద్దపీట వేస్తూ పరిపాలన కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. పుట్టపర్తిలో పురందేశ్వరి అధ్యక్షతన పోలింగ్ బూత్ మరియు శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశం జరిగింది. పురందేశ్వరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు విధానపరమైన లోపాలను ఎత్తిచూపితే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టిడిపి కోవర్టు అంటారా అంటూ ప్రశ్నించారు .రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాల గురించి ప్రశ్నించకూడదా ప్రశ్నిస్తే
ప్రతిపక్షాల గొంతు నొక్కుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అక్రమాలపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశామన్నారు. నిరుపేదల ఇళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం 18 లక్షల ఇళ్లు కేటాయిస్తే ఎన్ని ఇళ్లు నిర్మించారో వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ప్రస్తుతం బిజెపి జనసేన పార్టీ పొత్తులో కొనసాగుతున్నామని స్పష్టం చేశారు.
త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న వేల వరికపూడి శాలా శంకుస్థాపన చేస్తారని చెప్పడం చాలా హస్యాద్పదంగా ఉందని ఆరోపించారు. వరికపూడి సాల ప్రాజెక్ట్ పూర్తి చేసేది జనసేన టిడిపి ప్రభుత్వమే . పల్నాడు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి బటన్ నొక్కడం తప్ప రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. మాచర్ల పట్టణంలో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. 2024 ఎలక్షన్ తర్వాత వైసీపీ పార్టీ భూస్థాపితం ఖాయం అని అరోపించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి పులి హరి మాచర్ల మండల అధ్యక్షుడు జి సాంబశివరావు వెల్దుర్తి అధ్యక్షుడు గంధం మల్లయ్య మరియు లాల్ కృష్ణ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Read Also..
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ ఇంటింటికి ప్రచారంలో భాగంగా ,శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ నుండి నగరం నడిబొడ్డులోని సదా శివ టవర్స్ వేదిక వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలో శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ కోట వినుత మరియు పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు. ఇంటింటికి ప్రచారం అనే నినాదంతో వైయస్సార్సీపి చేసిన అవకతవకల పనులన్నీ ప్రజలకు తెలియజేస్తామని, వైయస్సార్సీపి పార్టీకి చివరి రోజులు గడుస్తున్నాయని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించి జనసేన పార్టీ – తెలుగుదేశం కలయికతో విజయం సాధిస్తామని కోట వినుత తెలిపారు.





Total views : 90705