జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ పొత్తులపై జనసైనికులకు హితోపదేశం చేశారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే పొత్తులు అని పేర్కొన్నారు. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానాలు వద్దు అని స్పష్టం చేశారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. జన హితానికి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి జనసేన పార్టీ ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది. విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పొత్తుల దిశగా ముందుకు వెళుతున్నామన్నారు. ప్రస్తుతం పొత్తులకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్న దశలో జనసేన పార్టీ నేతలు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యానాలు చేయొద్దు. పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలను ప్రచారం చేయవద్దు. ఇటువంటి ప్రకటనల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించినవారవుతారని పవన్ హెచ్చరించారు. పొత్తుకు విఘాతం కలిగించాలని ఎవరు ప్రయత్నించినా వారిని ప్రజలు గమనించకమానరు. ప్రజలు స్థిరత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండడం అవసరమని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
Janasena party
విజయనగరం జిల్లా మెంటాడ గ్రామంలో రానున్న ఎన్నికల దృశ్య మెంటాడ గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించే ముందుగా సంత తోట నుండి పార్టీ కార్యాలయం వరకు భారీ ఊరేగింపుగా వెళ్లి గజపతినగరం జనసేన నాయకురాలు పడాల అరుణ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వినీ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పడాల అరుణ మాట్లాడుతూ ఈ జగన్ అరాచకపాలనకు చరణగీతం పాడవలసిన అవసరం ఎంతైనా ఉందని టిడిపి జనసేన పోత్తులలో భాగంగా జనసేన కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరారు. అనంతరం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని టిడిపి జనసేన పొత్తుల్లో భాగంగా ఉమ్మడి కార్యకర్తలు సఖ్యతతో పనిచేసి ఇరు పార్టీలలో ఎవరికి టికెట్ వచ్చినా విభేదాలు లేకుండా పనిచేయాలని కోరారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారితోపాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులు, వివిధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం సభ్యులు, ముఖ్య నాయకులు, జన సైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తెలుగుదేశం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ..బీసీలకు జగన్మోహన్రెడ్డి వెన్నుపోటు పొడిచి, స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించారని అన్నారు. తాను ప్రభుత్వంపై పొరాడుతుంటే తనపై కుట్రపూరితంగా అక్రమ కేసులు పెట్టారని అన్నారు. టీడీపీ హయంలో బీసీలకు పెద్దపీట వేశామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని అన్నారు. దేశంలోనే మొదటిసారిగా బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాలా అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీ నిర్చయించుకుందని తెలిపారు.
గత 20 రోజులుగా తమకు న్యాయం చెయ్యాలని ఏపీలో అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. జగన్ కు, వారి ఎమ్మెల్యేలకు ఆడవారి ఉసురు తగులుతుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ అన్నారు. అన్ని వర్గాలకు చెందిన కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎస్మా చట్టాన్ని వెంటనే రద్దు చెయ్యాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను ఇబ్బంది పెడితే జనసేన పార్టీ వారికి అండగా నిలుస్తుందన్నారు. అంగన్వాడీల సమస్యలకు పరిష్కారం చూపకుండా ఎమ్మెల్యేలు, ఎంపీల బదిలీల కార్యక్రమంలో నిమగ్నమయ్యారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రేపటి నుంచి మూడ్రోజుల పాటు కాకినాడ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా పవన్ పార్టీ సమీక్షల్లో పాల్గొంటారు. ఏపీలో ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న అంశంపై పవన్ ఈ పర్యటన ద్వారా ఓ స్పష్టత తీసుకువచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనిపై జనసేన సోషల్ మీడియా విభాగం శతఘ్ని ఓ పోస్టు పెట్టింది. కాకినాడలో మూడ్రోజుల పర్యటనలో భాగంగా ఏపీ ప్రయోజనాలే ప్రధానంగా, సామాజిక సాధికారతే లక్ష్యంగా అభ్యర్థుల జాబితాపై జనసేనాని కసరత్తు చేయనున్నారని వెల్లడించింది. పవన్ కల్యాణ్ ఏపీలోని మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారని తెలిపింది. ఎన్నికల్లో పోటీకి 70 స్థానాలపై గురిపెట్టారని వివరించింది. టీడీపీతో కలిసి సామాజిక సాధికారతే లక్ష్యంగా జాబితా రూపొందించనున్నారని శతఘ్ని పేర్కొంది. గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో జనసేన బలంగా ఉందని స్పష్టం చేసింది. ప్రత్యర్థి పార్టీలోని సీనియర్ నేతలు జనసేన వైపు అడుగులు వేస్తున్నారని వెల్లడించింది.
Read Also..
Read Also..
జీవితంలో ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నా.. ఏం జరిగినా జనసేనను మరో పార్టీలో విలీనం చేయనని ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. విశాఖలోని ఎస్.రాజా గ్రౌండ్లో నిర్వహించిన జనసేన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. విశాఖ ఉక్కు అంశం భావోద్వేగంతో కూడిన అంశమని అన్నారు. ఇదే విషయాన్ని కేంద్రంలోని పెద్దలకు సైతం చెప్పినట్లు పవన్ తెలిపారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే ఎలాంటి భావోద్వేగాలకు దారి తీస్తుందో తెలియదన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ పోరాటం.. అన్ని జిల్లాలను ఏకం చేసిన నినాదం అని.. ప్రైవేటీకరణ కాకుండా ప్రయత్నం చేయగలిగామన్నారు. తాను ఎప్పుడూ ఎన్నికల కోసం ఆలోచించలేదని.. ఒక తరం కోసం ఆలోచించినట్లు చెప్పారు. ఈ తరాన్ని కాపాడుకుంటూనే రాబోయే తరం కోసం పని చేస్తానన్నారు. తాను ఓట్ల కోసం రాలేదని.. మార్పు కోసం ఓట్లు కావాలని పవన్ వెల్లడించారు.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం. బాపులపాడు మండలంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి మూల్పురి సాయి కల్యాణి ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు……మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ కేసుల నుంచి పూర్తిస్థాయి బెయిల్ మంజూరైన సందర్బంగా బాపులపాడు మండలం, హనుమాన్ జంక్షన్‌లోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించిన గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు… జనసేన గన్నవరం నియోజకవర్గం సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు… అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించరు.
ఏపీలో విద్యార్థుల సామగ్రి కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే వస్తువుల నాణ్యత సరిగా లేదని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది రూ.1,050 కోట్లతో విద్యార్థులకు బ్యాగులు, షూస్ కొనుగోలు చేశారన్నారు. 42 లక్షల మంది పేద విద్యార్థుల కోసం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారన్నారు. ఈ పథకం కింద మూడేళ్లలో సామగ్రికి 2400 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వెల్లడించారు. టెండర్ ప్రక్రియలో ఐదు కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడ్డాయని తెలిపారు. నిధులు దారి మళ్లినట్లు ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేలిందని వెల్లడించారు. గతేడాది ఫ్లాట్ ప్యానెల్స్ కు సంబంధించి నేటికీ డబ్బులు ఇవ్వలేదన్నారు. నాలుగు వందల కోట్ల రూపాయలతో ఫ్లాట్ ప్యానెల్స్ కొనుగోలు పేరిట మరో కుంభకోణం జరిగిందన్నారు.
విజయనగరం జిల్లా
గజపతినగరం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్తగా నియమితులైన మర్రపు సురేష్. సమన్వయకర్తగా నియమితులైన సందర్భముగా పార్టీ కార్యాలయం లో జనసేన అభినందన సభ ఏర్పటు చేసిన నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలు గజపతినగరం నియోజక వర్గంలో జనసేన పార్టీకీ చేస్తున్న సేవలకు మెచ్చి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గ సమన్వయకర్తగా తనకు బాధ్యతలను అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపిన నియోజకవర్గం మర్రపు సురేష్ మాట్లాడుతు తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తులో భాగంగా ఇటువంటి బేదాభిప్రాయాలు లేకుండా సమిష్టిగా కష్టపడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించే వరకు జనసేన పార్టీ నాయకులు అహర్నిశలు శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు.





Total views : 90541