తెలుగుదేశం పార్టీ రా కదలిరా కార్యక్రమంలో భాగంగా నేడు వెంకటగిరి పట్టణానికి రానున్న టిడిపి అధినేత చంద్రబాబు. ఈ ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా విజయవాడ నుంచి వెంకటగిరి కి రానున్న బాబు. చంద్రబాబు బహిరంగ సభకు సర్వం సిద్ధం చేసిన ఆ పార్టీ శ్రేణులు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి భారీగా తరలిరానున్న, టిడిపి, జనసేన పార్టీ శ్రేణులు.
Janasena
గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం వద్దకు చేరుకున్న టిడిపి, జనసేన ర్యాలీ. సమీపంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ వర్ధంతి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నాని. మెయిన్ రోడ్డుకు ఇరు వైపులా నిలబడి టీడీపీ – వైసీపీ శ్రేణుల నినాదాలు. టీడీపీ, జనసేన శ్రేణుల పైకి దూసుకెల్లే ప్రయత్నం చేసిన వైసీపీ నాయకులు. ప్రతిగా దూసుకొచ్చిన టీడీపీ శ్రేణులు. ఇరు వర్గాల మధ్య తోపులాట. అడ్డుకున్న పొలిసులు. సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకున్న నేతలు. నివురగప్పిన నిప్పులా ఉన్నా గుడివాడ.
టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా గుంటూరు జిల్లాలో తెనాలి సీటును జనసేనాకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతొంది. అయితే తెనాలిలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ వర్గం అందుకు ససేమిరా అంటోంది. తెనాలి సీటు జనసేన కు కేటాయిస్తే తాము రాజీనామాలు చేస్తామంటూ ఆలపాటిని కార్యకర్తలు కలిశారు. అయితే పార్టీ ఏమి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దామని కార్యకర్తలకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ సర్ది చెబుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లడాడుతూ..ఇరు పార్టీల అభిప్రాయాలను తీసుకోని సీటు కేటాయించాలన్నారు.
రాజమండ్రి విమానాశ్రయం వద్ద ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఘన స్వాగతం పలికిన నాయకులు కార్యకర్తలు. గత మూడున్నర ఏళ్ల తర్వాత సౌంత ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉందని మాటల్లో చెప్పలేనంత అనుభూతి అని, నేను జైలులో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అందించిన సహకారం జీవితంలో మరువలేను అని అన్నారు. అభిమానులు, తెదేపా, జనసేన నాయకులు చూపిన ప్రేమ, ఆదరణ నా జీవితంలో మరువలేను సొంత వారు ఎవరో, పరాయి వారు ఎవరో అర్థమవుతోంది మా నానమ్మ చనిపోయినప్పుడు కూడా నేను మా ఊరు రాలేదు అని నేను రాకుండా చాలా ప్రయత్నించారు కోర్టు రక్షణతో వచ్చానని పోలీసులు కూడా చాలా సహకరించారు అర్హత ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు.
ఎప్పటి నుంచో జనసైనికులు ఊహించిందే. టీడీపీ నుంచి ఎక్కువ మంది నేతలు జనసేన పార్టీలో చేేరతారని అంచనా వేశారు. అది పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు స్ట్రాటజీ. తన పార్టీ నేతలనే పొత్తులో ఉన్న పార్టీలోకి పంపి అక్కడ టిక్కెట్లు కేటాయించి గెలిపించుకోవడం చంద్రబాబుకు ఇప్పటి నుంచి కాదు.. ఎప్పటి నుంచో చేస్తున్న పనే. అదే విషయాన్ని అనేక మంది సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను చెప్పారు. అయితే ఇప్పటి వరకూ అలాంటి చేరికలు లేకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇక టీడీపీ నేతలు జనసేనలోకి వరస పెడుతుండటంతో జనసైనికుల అనుమానం నిజంగా మారనుంది. పొత్తు ధర్మంలో భాగంగా జనసేన ఈసారి ఎక్కువ స్థానాలను కోరే అవకాశముంది. చంద్రబాబుకు కూడా ఈ ఎన్నికలు అసవరం కావడంతో పవన్ కల్యాణ్ కు అడిగినన్ని కాకపోయినా.. హర్ట్ కాకుండా మెరుగైన సంఖ్యలోనే చంద్రబాబు సీట్లను ఇచ్చే అవకాశాలున్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా ఉన్న నేతల సీట్లు కూడా పొత్తులో భాగంగా కోల్పోయే అవకాశముంది. ఇది గ్రహించిన నేతలు కొందరు టీడీపీలో ఉంటే సీట్లు రావని, జనసేనలో చేరి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పవన్ కల్యాణ్ కూడా అమాయకంగా వారికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తుండటంతో ఆశ్చర్యపోవడం జనసైనికుల వంతయింది. నిన్న మాగంటి బాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. ఆయన ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి కానీ, కైకలూరు శాసనసభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ టీడీపీలో ఉంటే సీటు రాదేమోనని భావించి మాగంటి బాబు పవన్ పంచన చేరారు. ఆయన జనసేనలో చేరి ఈ రెండు స్థానాల్లో ఒకచోట నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అలాగే బూరగడ్డ వేదవ్యాస్ కూడా అంతే. ఆయన పెడన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. టీడీపీలో సీటు డౌట్ కొట్టడంతో ఆయన పవన్ ను కలిశారన్న ప్రచారం పెద్దయెత్తున జరుగుతుంది. అయితే మర్యాదపూర్వక భేటీ అని చెబుతున్నా చేరిక కోసమే వారు జనసేన కార్యాలయానికి వచ్చారని అంటున్నారు. ఇన్నాళ్లూ ఏం చేశారు?నిజంగా జనసేన మీద ప్రేమ ఉంటే ఇన్ని రోజులు ఏం చేశారన్న ప్రశ్నను సోషల్ మీడియాలో జనసైనికులు వేస్తున్నారు. ఎన్నికల ముందు చేరుతున్నారంటే వీరిని టీడీపీ నేతలుగానే చూడాల్సి ఉంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే పవన్ కల్యాణ్ రాజకీయానికి భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవన్న హెచ్చరికలు జారీ అవుతున్నాయి. అయినా వస్తున్న నేతలను కాదనలేని పరిస్థితి పవన్ కల్యాణ్‌ది. టీడీపీ నుంచి వచ్చిన నేతలకు ఆయన టిక్కెట్లు ఇస్తారా? లేక పక్కన పెడతారా? అన్నది ఇంకా నిర్ణయం కాకపోయినా టీడీపీ నుంచి నేతల వలసలు పెద్దయెత్తున సాగుతాయన్న ప్రచారానికి ఇది అద్దం పడుతుందనే కామెంట్స్ మాత్రం ఎక్కువగా వినపడుతున్నాయి.
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముద్రగడను కిర్లంపూడిలోని తన నివాసంలో కలిశారు. ఇర్రిపాకలో జరిగే మహా కుంభాభిషేకానికి ఆహ్వానం తెలిపేందుకే వచ్చానని జ్యోతుల నెహ్రూ తెలిపారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం నుండి తాను పోటీ చేస్తున్న తరుణంలో తనకు మద్దతు తెలపాలని ముద్రగడను కోరానని నెహ్రూ అన్నారు. అందుకు ముద్రగడ పద్మనాభం వ్యక్తిగతంగా తనకు సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. మరోవైపు జనసేన నాయకులు బుధవారం రాత్రి ముద్రగడ్డను కలవడం, ఈరోజు జ్యోతుల నెహ్రూ ముద్రగడను కలవడంతో ఈ భేటి రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాకినాడ జిల్లా జగ్గంపేట, ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద రాత్రి జనసేన నాయకుల సందడి. జనసేన లేబుల్ తో ఉన్న కార్లు ముద్రగడ ఇంటికి రావడంతో నియోజకవర్గంలో తీవ్ర చర్చ. ముద్రగడను కలిసిన వారిలో బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్, కలవలపల్లి తాతాజీ కాపు జేఏసీ నాయకుడు. మర్యాదపూర్వకంగా ముద్రగాడని కలిశామంటున్న జనసేన నేతలు. ఒకటి రెండు రోజుల్లో జనసేన ముఖ్య నేతలు ముద్రగాడను కలుస్తారని సమాచారం. ఇంకా ఏ పార్టీ చేరుతున్నది క్లారిటీ ఇవ్వని ముద్రగడ కుటుంబం.
కాకినాడ, ముద్రగడ ను కలిసిన జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల క్రితం రాసిన లేఖ అంశాన్ని ముద్రగడ దగ్గర ప్రస్తావించిన బొలిశెట్టి. పవన్ రాసిన లేఖను స్వాగతిస్తున్నానని, కాపు జాతి కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన ముద్రగడ. పవన్ కళ్యాణ్ మా ఇంటికి వస్తే ఆహ్వానిస్తానని బొలిశెట్టి కి చెప్పిన ముద్రగడ. త్వరలో జనసేనలోకి ముద్రగడ చేరే అవకాశము.
విజయవాడ, ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నిర్వహణ పై రెండో రోజు కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష. నిన్న గుర్తింపు పొందిన పార్టీల నుండి వినతుల స్వీకరణ చేపట్టిన సీఈసీ రాజీవ్ కుమార్. విడతలవారీగా కలెక్టర్లు, ఎస్పీలు , ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల సన్నద్దత పై అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఈసీ. నేడు పార్టీలు ఇచ్చిన వినతులు, ఫిర్యాదుల పై, ఎన్నికలకు అధికార యంత్రాంగం ఉన్నతస్దాయి చర్చ జరుపనున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం.
ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు అట్టడుగు వర్గాలకు అందించాలనే తపన కలిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై పార్టీలో చేరామని కదిరి బ్లూమున్ విద్యాసంస్థల అధినేత శివశంకర్ తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ తీర్థం పుచ్చుకున్న కదిరి పట్టణానికి చెందిన బ్లూ మూన్ విద్యాసంస్థల అధినేత శివశంకర్, కాపు సంక్షేమ శాఖ అధ్యక్షులు గవ్వల శ్రీనివాసులు, సైదాపురం చిన్నపరెడ్డి మంగళవారం కదిరి జనసేన పార్టీ ఇంచార్జ్ భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ.. ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన పవన్ కళ్యాణ్ సమాజంలోని నిరుపేదలకు అండగా నిలవాలన్న ఆశయాలకు ఆకర్షితులై మేము కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలనే సంకల్పంతోనే పార్టీలో చేరామని చివరి శ్వాస వరకు పవన్ కళ్యాణ్ తోనే రాజకీయ జీవితం కొనసాగుతుందన్నారు. పార్టీలో సామాన్య కార్యకర్తగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ పేదలకు అండగా కార్యకర్తలకు తోడుగా నిరంతరం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.





Total views : 91059