కాకినాడ రూరల్ టిడిపి కో కో ఆర్డినేటర్ కటకంసెట్టి వెంకట ప్రభాకర్ (బాబీ) ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా ఏర్పాటు చేసిన పంచగా శ్రవణం కార్యక్రమంలో టిడిపి బిజెపి జనసేన ఉమ్మడి రూరల్ శాసనసభ అభ్యర్థి పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేద పండితులు మంత్రోచ్ఛారణ ల మధ్య పూజాది కార్యక్రమాలు నిర్వహించి నాయకులకు కార్యకర్తలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పంతం నానాజీ మాట్లాడుతూ ఈ ఉగాది నుండి రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో టిడిపి జనసేన బిజెపి కూటమి తో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కటకంశెట్టి వెంకట ప్రభాకర్ (బాబీ) మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గం లో పంతం నానాజీ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని, రాష్ట్రం లో కూటమి విజయంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, దేశం లో ప్రధానిగా నరేంద్ర మోడీ విజయం సాధిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, జన సేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Kakinada Rural
టిడిపి జనసేన పొత్తులో భాగంగా రూరల్ నియోజకవర్గం సీటు జనసేన కు కేటాయించడంతో టిడిపి నాయకులు కార్యకర్తలు అసహనానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో టిడిపి జోన్2 ఇంఛార్జి సుజయ కృష్ణ రంగారావు, కాకినాడ రూరల్ వలసపాకల పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి నివాసానికి వచ్చారు. టిడిపి నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. రూరల్ నియోజకవర్గాన్ని అన్నివిధాల అభివృధి పదంలో నడిపించిన పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి నాయకత్వం, బిసి సామాజిక వర్గానికి చెందిన వర్కి నియోజకవర్గం లో ఉన్న గుర్తింపు పట్టు రంగారావు దృష్టికి నాయకులు కార్యకర్తలు తీసుకువచ్చారు. అనంతరం రంగారావు మీడియా తో మాట్లాడుతూ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులకు పార్టీలో ఎప్పుడు సముచిత స్థానం ఉందని, ఇక్కడ క్షేత్ర స్థాయిలో నాయకులు, కార్యకర్తల్లో ఉన్న అపోహలు, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని ఎది ఏమైనా రాబోయే రోజుల్లో అందరి సమిష్టిగా కృషి చేసి జనసేన అభ్యర్థిని అఖండ మెజార్టీ తో గెలిపుంచుకుంటామని తెలిపారు.
కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయంలో వైసిపి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, కాకినాడ జిల్లా వైసిపి అధ్యక్షులు రూరల్ శాసనసభ్యులు కన్నబాబు ని మర్యాద పూర్వకంగా కలిశారు. రూరల్ నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు సునీల్ కి ఘనస్వాగతం పలికి గజమలతో ఘనంగా సత్కరించారు. అనంతరం సునీల్, కన్నబాబు లు మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం లో ప్రతి పెద వారికి ప్రభుత్వ పథకాలు నేరుగా అందేలా వాలంటీర్లు, సచివాలయం వ్యవస్థ తీసుకువచ్చిన ఘనత జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గం నుండి కన్నబాబు కు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా తనకు ప్రజలు మద్దతు ఇవలని కోరారు. ఈ కార్యక్రమంలో రూరల్, కరప మండలాల జెడ్పీటీసీ సభ్యులు నురుకుర్తి రామకృష్ణ, యాళ్ల సుబ్బారావు, ఎం.పి పి గిపిసెట్టి పద్మజ బాబ్జీ, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా, రూరల్, ప్రభుత్వం పెంచిన 3000 రూపాయల పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కాకినాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో ఎం.పి.డి.ఓ కే.స్వప్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు హాజరయ్యారు. ప్రభుత్వం పెంచిన పెన్షన్ లను లబ్ధిదారులకు కన్నబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నుండి పెన్షన్ డబ్బులు నేరుగా ఇంటికే అందేలా ఆలోచించిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 65 సంవత్సరాలు నిండిన వారికే పెన్షన్లు ఇచ్చేవారు. పెద ప్రజల కష్టాలు చూసిన జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్నే వాలంటీర్ వచ్చి లబ్ధిదారులకు అందజేసి దేశం లో చాలా రాష్ట్రాలకు ఆదర్శంగా పాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. దేశం లో ఏ రాష్ట్రం లో ఇవ్వని విధంగా 3000 రూపాయలు పెన్షన్ లు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని, కులం, మతం, ఏ రాజకీయ పార్టీ కి మద్దతు ఇచ్చారు అని చూడకుండా అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తున్న దమ్మున నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఎల్.డి.ఓ పట్టంసెట్టి నారాయణ మూర్తి, ఎం.పి.పి గోపిసెట్టి పద్మజ బాబ్జీ, జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, తిమ్మపురం గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పరిణామాల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిచిపోయిన నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ఈ నెల 27న పున:ప్రారంభం కానుంది. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించడంతో పాదయాత్రను తిరిగి కొనసాగించాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా సెప్టెంబరు 9న పాదయాత్రకు బ్రేక్ ప్రకటించిన కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. అయితే ముందుగా నిర్దేశించుకున్నట్టుగా యువగళం యాత్ర ఇచ్చాపురం వరకు కొనసాగదు. డిసెంబర్ చివరిలో విశాఖపట్నంలోనే ముగియనుంది. దాదాపు రెండున్నర నెలలపాటు విరామం రావడం, మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విశాఖపట్నంలో ముగించాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. 27న పున:ప్రారంభమై రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ పట్టణ, కాకినాడ గ్రామీణ, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కొన్ని నియోజకవర్గాల మీదుగా విశాఖపట్నం చేరుకున్నాక అక్కడ పాదయాత్రను ముగించనున్నారు. ఇందుకు తగ్గట్టు రూట్ మ్యాప్‌ను పార్టీ వర్గాలు రూపొందిస్తున్నాయి. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని లోకేశ్ భావించారు. జనవరి 27న కుప్పంలో మొదలుపెట్టారు. అయితే చంద్రబాబు అరెస్ట్ పర్యవసనాల నేపథ్యంలో దాదాపు రెండున్నర నెలలపాటు అంతరాయం ఏర్పడింది. తాత్కాలిక విరామం ప్రకటించే సమయానికి 208 రోజుల్లో 2,852.4 కిలోమీటర్లు పూర్తయ్యింది. 84 నియోజకవర్గాల గుండా ఈ యాత్ర కొనసాగింది. పెద్ద సంఖ్యలో బహిరంగ సభలతోపాటు యువత, మహిళలు, రైతులు, ముస్లింలు, వివిధ వర్గాలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ లోకేశ్ యాత్రను కొనసాగించారు. ఇదిలావుండగా గతంలో చంద్రబాబు చేపట్టిన ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర కూడా విశాఖపట్నంలోనే ముగిసిందని టీడీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు లోకేశ్ పాదయాత్ర కూడా అక్కడే ముగియనుందని, ఈ మేరకు రూట్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నట్టు చెబుతున్నారు.
Read Also..
Read Also..
యావత్తు ప్రపంచం ఈరోజు కోసం ఎంతో ఆసక్తిగా ఉంది. ముఖ్యంగా క్రికెట్ క్రీడాకారులు పెద్ద పండుగగా అభివర్ణిస్తున్నారు. కాకినాడ రూరల్ జనసేన టిడిపి సంయుక్తంగా ఏర్పాటు చేసిన వనభోజనాల కార్యక్రమంలో ప్రేక్షకుల కోసం పెద్ద పెద్ద స్క్రీలను ఏర్పాటు చేశారు. ఫుడ్ కోర్టులు పెడుతున్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు టీం ఇండియా అభిమానులు ఇక్కడే ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు తీసుకున్నారు. చిన్నా పెద్ద ఆడ మగ తేడా లేకుండా క్రికెట్ చూసేందుకు ఇక్కడ వనభోజనాల్లో అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మాకు కాకుండా జిల్లా ప్రతినిధి నందిని అందిస్తారు.
Read Also..
Read Also..