అసెంబ్లీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా రామగుండం నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు రామగుండం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అరుణ శ్రీ కి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధికి తాను ఎంతో కృషి చేసినట్లు తెలిపారు. రామగుండం మరింత అభివృద్ధి చెందాలంటే తనను గెలిపించాలని కోరారు. ప్రధాన పక్షాలు ప్రజలను మోసం చేస్తూ గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. అంతకుముందు గోదావరిఖని పట్టణంలోని ఫైవ్ ఇంక్లైన్ పార్క్ నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పట్టణంలోని లక్ష్మీ నగర్, కళ్యాణ్ నగర్, అడ్డగుంటపల్లి, గౌతమి నగర్ మీదుగా సాగింది.
Karimnagar
బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ లో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కరీంనగర్లో బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి సంజయ్ పాల్గొన్నారు. ర్యాలీలో బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా పోరాడితే నాపై 30 దొంగ కేసులు పెట్టారన్నారు. మతతత్వవాది అనే ముద్ర వేసే ప్రయత్నం చేశారన్నారు. ధర్మం కోసం పోరాడేది భాజపా. రాజాసింగ్, నేను.. ధర్మం కోసం పోరాడేవాళ్లం. మేం ఎప్పుడూ కాషాయజెండాను వదిలిపెట్టలేదు. ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించాక పార్టీని పరుగులెత్తించానని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 150 రోజుల పాటు ప్రజాసంగ్రామ యాత్ర చేసి కాషాయ జెండాను తెలంగాణ అంతటా రెపరెపలాడించానన్నారు.






Total views : 91012