నేడు బాధ్యతలు స్వీకరించనున్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. సెక్రటేరియట్ లో తన ఛాంబర్ లో రోడ్లు, భవనాల శాఖ మంత్రి గా బాధ్యతలను స్వీకరించనున్న కోమటి రెడ్డి. ఉదయం 9 గంటల నుంచి సచివాలయంలోని 5 వ అంతస్తులోని 5F 11,12,13 Rooms పూజ,మరియు అధికారికంగా బాధ్యతల స్వీకరణ ఉంటుంది. అనంతరం కొన్ని ముఖ్య ఫైల్స్ పై సంతకాలు చేస్తారు.
latest news
శ్రీశైలం దేవస్థానంలో 38 మంది సిబ్బందికి అంతర్గత బదిలీలు. ఈవోగా బాధ్యత చేపట్టిన తర్వాత మొదటిసారి 38 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఈవో పెద్దిరాజు. ఈ బదిలీలలో 6 మంది ఏఈవో స్థాయి అధికారులు. పరిపాలన సౌలభ్యం కోసం బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఈవో పెద్దిరాజు. పర్యవేక్షకుడు మల్లికార్జునరెడ్డికి ఏఈఓగా పదోన్నతి కల్పిస్తూ విధులు కేటాయింపు. 24 గంటల్లో వారికి కేటాయించిన విధుల్లో రిపోర్టు చేయాలని ఈవో ఆదేశాలు. ఈరోజు,రెపట్లో మరికొంతమంది ఉద్యోగులను బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వులు మేరకు గిద్దలూరు ci దేవ ప్రభాకర్ కంభం సీఐ రాజేష్ గిద్దలూరు టౌన్ లోని అర్బన్ కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు టౌన్ అర్బన్ కాలనీలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా 16 బైకులు రెండు ఆటోల కు సరైన లైసెన్సు పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు ఈ కార్యక్రమంలో కంభం మండలం సిఐ గిద్దలూరు మండలం సిఐ దేవ ప్రభాకర్ మరియు ఆరు మండలాల ఎస్సై లు పాల్గొన్నారు. అర్బన్ కాలనీ లోని వాసులకు సీఐ దేవ ప్రభాకర్ పలు అంశాలపై సూచనలు ఇచ్చారు.
గుంటూరు జిల్లా, పెదనందిపాడు రైతు చెప్పిన సమస్యలు విన్న చంద్రబాబు. తుఫాన్ కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, రైతులు కనీసం అధికారులు పట్టించుకోలేదని రైతుల ఆరోపణ. తుఫాన్ విషయంలో ప్రభుత్వం వైఫల్యం ఉంది. గుంటూరు, కృష్ణా జిల్లాలో తుఫాన్ వస్తుంటాయి. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా కు నీరు ఇచ్చాము. పట్టిసీమ సక్రమంగా వినియోగిస్తే నీటి ఇబ్బందులు ఉండవు. నీటి ఇబ్బందులు లేకుండా చేయాలని పట్టిసీమ నిర్మించాం. నాగార్జున సాగర్ కుడి కాల్వ కి నీరు ఇచ్చేందుకు ప్రణాళిక చేశాం. పట్టిసీమ పంపులు వేయడం కూడా ఈ ప్రభుత్వం మర్చిపోయింది. నల్లమడ డ్రైయిన్ కి 170 కోట్లు మంజూరు చేశాం.
పొలం గురించి తెలియని వ్యక్తికి పంటల గురించి ఏమి తెలుస్తుంది. ఈ ప్రభుత్వం వలన లక్షల్లో రైతులు అప్పుల పాలయ్యారు. రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వడానికి సీఎం కి మనసు రాలేదు. పంట నష్టం గురించి కేంద్రాన్ని కూడా సీఎం జగన్ అడిగే పరిస్థితి లేడు. నాలుగు రోజులైనా ఏ పంటలు..ఎంత నష్ట పోయారో చెప్పే ధైర్యం చెప్పలేదు. ఎంత పంట నష్ట పరిహారం ఇస్తానో కూడా సీఎం జగన్ చెప్పలేదు. రైతులు గట్టిగా అడిగితే కేసులు పెడతారు. రైతు కష్టంలో వున్నప్పుడు దుర్మాగమైన పరిస్థితి తెచ్చారు. పంటలకు భీమా చేసి ఉంటే నష్టం పరిహారం ఇచ్చే అవకాశం ఉండేది. తాను ప్రస్తుతం ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న. రైతుకు ధైర్యం చెప్పేందుకు వచ్చా అని వెల్లడించారు. ముఖ్యమంత్రి సహాయ చేయకఊతే 3 నెలలో వైకాపాను బంగాళాఖాతంలో కలుపుదాం. ముఖ్యమంత్రికి అల్టిమేట్ ఇస్తున్న. పంటల నష్టం పై కేంద్రానికి కూడా లేఖ రాస్తాను. రాష్టంలో ఎంత పంట నష్టపోయారో ఆన్ లైన్ లో ఉంచాలి. నష్ట పరిహారం వైకాపా దొంగలకు ఇస్తే.. సంగతి తెలుస్తాం. నిజమైన రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలి. రైతు ద్రోహి జగన్ మోహన్ రెడ్డి. త్వరలో మీ ముందుకు వచ్చి ఏమి చేయబోతున్నామో వివారిస్తా అని చంద్రబాబు వెల్లడించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా , కార్తీక మాసం సందర్భంగా, పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి రోజా.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉన్నానంటే స్వామివారిని దర్శించుకున్నకే వచ్చాయని, స్వామివారి కృప పండితులైన బ్రాహ్మణులు ఆశీర్వచనం వల్లే కలిగాయని, జగనన్న ఇంకొక 30 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసే భాగ్యం కలుగజేయాలని స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి రోజా అన్నారు.
అయోధ్యలోని రామ మందిరం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ ఆలయం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అయోధ్య రామాలయం గర్భగుడి ఫొటోలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేసింది. మరో నెల రోజుల్లో ఆలయం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కాగా, జనవరిలో రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 16 నుంచి ఈ క్రతువు చేపట్టనున్నారు. జనవరి 22న మూల విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. అంతేకాదు, 130 దేశాల ప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
అనంతపురం జిల్లా గుంతకల్ మండలం నక్కం దొడ్డి దగ్గర ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఇద్దరిలో ఒకరిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి గుత్తి దగ్గర ధర్మాపురంకు చెందిన వాడని అతని పేరు వినోద్ (26 సంవత్సరాలు)గా గుర్తించారు. వీరు కసాపురం కి వస్తుండగా నక్కం దొడ్డి దగ్గర బైక్ అదుపుతప్పి కిందపడడం తో వినోద్ అక్కడిక్కకడే మృతి చెందాడు.
శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించిన నాయకులు. ఈ పాత్రికేయుల సమావేశంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటు నమోదు కార్యక్రమంలో పాల్గొన్న బిఎల్వోలు ఆవకతవకలతో ఓటు నమోదు కార్యక్రమం నిర్వహించారని మృతి చెందిన వ్యక్తులు, వలస వెళ్లిన వ్యక్తుల ఓట్లను రద్దు చేయకుండా ఓటు నమోదు కార్యక్రమం నిర్వహించాలని దీనిపై సమగ్ర సమాచారం ఇవ్వాలని పలుమార్లు ఆర్డిఓ, కలెక్టర్ ను సంప్రదించిన వారి వద్ద ఎటువంటి స్పందన లేదని, జనవరి 5 తేది కాకుండా ముందస్తుగానే నూతనంగా నమోదు చేసిన ఓటర్ జాబితాను ఆయా పార్టీలకి ఇవ్వాలని కలెక్టర్ డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తిలోని అధికారపార్టీ నాయకులు 30 కోట్లు అయ్యే శివం టు శివం రోడ్డు పనులను 47 కోట్ల నుంచి 53 కోట్ల వరకు టెండర్‌ను పెంచి అందులో కొంత సొమ్ముని దోచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారని తమకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వచ్చిందన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం త్వరలోనే నిర్వహిస్తున్న శివమ్ టు శివం రోడ్డు పనులు టెండర్ కు అన్ని పార్టీలను పిలిచి బహిరంగ పిలవాలని శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో కి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో రాజకీయపార్టీల, ప్రజాసంఘాల నాయకులపై కార్యకర్తలపై ఇటీవల పెడుతున్న పోలీసు కేసులలోని వాస్తవాల నిజనిర్ధారణ కోసం ఒక త్రిసభ్య సంఘాన్ని ఏర్పాటు చేస్తూ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ నిర్ణయం తీసుకున్నది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యవర్గ సమావేశం తిరుపతిలో శనివారం సంస్థ అధ్యక్షులు , ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి. భవానీ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఇటీవల రాష్ట్రంలో ప్రతిపక్ష, రాజకీయ పక్షాల, ప్రజాసంఘాల కార్యకర్తలపై పోలీసులు ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెడుతున్న సంఘటనలపై సి.ఎఫ్.డి. ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే
రాజకీయ భిన్నాభిప్రాయాలను, రాజకీయ విమర్శలను సహించలేని ఒక అసహన వాతావరణం రాష్ట్రంలో పెరిగిపోవడంపై సి.ఎఫ్.డి. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పలు పట్టణాల్లో పోలీసు యాక్ట్ సెక్షన్ 30 నిబంధనలను నిరవధికంగా పొడిగించడం, రాజకీయ పార్టీల ప్రజా సమీకరణలను అడ్డుకోవడం, ఆందోళనల నేపథ్యంలో వివిధ పార్టీల, సంఘాల నేతలను ముందస్తు గృహ నిర్బంధాలు చేయడం, అక్రమంగా నిర్బంధించడం ఒక సర్వసాధారణ వ్యవహారంగా మారడం పై సి.ఎఫ్.డి. అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలీసు వ్యవస్థను అధికార పార్టీ దుర్వినియోగం చేస్తోందని, అందులో భాగంగానే వందలాది మంది ప్రతిపక్షాల కార్యకర్తలపై ఎలాంటి ఆధారాలు లేకుండా క్రిమినల్ కేసులు పెట్టడం ఒక ధోరణిగా తయారయ్యిందని కూడా సి.ఎఫ్.డి. అభిప్రాయపడింది. రాష్ట్రంలో చట్టబద్ధపాలన, నిష్పాక్షిక స్వేచ్ఛాయుత , పారదర్శక ఎన్నికలు జరగడానికి వీలుగా తమవంతు కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే పోలీసు అక్రమకేసుల విషయంపై తాము దృష్టి సారించామని సి.ఎఫ్.డి. కార్యవర్గం స్పష్టం చేసింది. గత కొద్ది నెలలుగా రాష్ట్రంలో ప్రతిపక్ష, రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాల నాయకులు , కార్యకర్తలపై పోలీసులు నమోదు చేసిన కేసుల స్వరూప స్వభావాలను పరిశీలించడానికి విభిన్న జీవనరంగాలలో సుప్రసిద్ధులైన పెద్దలతో ఒక త్రిసభ్య కమిటీ ని ఏర్పాటు చేస్తూ సి.ఎఫ్.డి. సమావేశం నిర్ణయం తీసుకున్నది. కమిటీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డిజిపి గా పనిచేసిన సీనియర్ ఐ.పి.ఎస్.అధికారి ఎం.వి. భాస్కరరావు, ఆంధ్రప్రదేశ్ పూర్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనగాని సత్యప్రసాద్, హిందూ దినపత్రిక విజయవాడ ఎడిషన్ పూర్వ రెసిడెంట్ ఎడిటర్ వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉంటారు అని తెలిపింది. ఈ కమిటీ స్వయం నిర్ణయాధికారం కలిగి నిష్పాక్షికంగా పనిచేస్తుందని, కమిటీసభ్యులు రాష్ట్రంలో పర్యటించి విభిన్న వర్గాలతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతారు అని, కేసులలోని వాస్తవాలను తెలుసుకుంటారని సి.ఎఫ్.డి. తెలిపింది.
త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 13 వ తేదీన విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని సి.ఎఫ్.డి. కార్యవర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నది. సంబంధిత పక్షాలు, బాధితులు పాల్గొని తమ అభిప్రాయాలను త్రిసభ్య కమిటీ కి తెలియపరచవచ్చునని సి.ఎఫ్.డి. ఆ ప్రకటనలో వెల్లడించింది. ఎన్నికలు త్వరలో రానున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ కార్యకలాపాలను, ప్రచారాలను స్వేచ్ఛగా నిర్వహించుకునే విధంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని సి.ఎఫ్.డి. విజ్ఞప్తి చేసింది. కార్యవర్గ సమావేశంలో సంస్థ ప్రధాన కార్యదర్శి రాష్ట్రఎన్నికల పూర్వప్రధానాధికారి డా.నిమ్మగడ్డ రమేష్ కుమార్, సహాయకార్యదర్శి వి.లక్ష్మణరెడ్డి, కోశాధికారి ఇ .ఫల్గుణ కుమార్ , కార్యవర్గసభ్యులు పూర్వ చీఫ్ సెక్రటరీ ఎల్.వి. సుబ్రహ్మణ్యం , పూర్వ డిజిపి ఎం.వి. కృష్ణారావు , ప్రత్యక్షంగా పాల్గొనగా మిగిలిన సభ్యులు జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
రాజకీయాల్లో సంస్కారం లేని హిణుడు, అబద్దాల పుట్ట, ఆనం వెంకటరమణారెడ్డని, తన నిరాధారమైన ఆరోపణలతో భూమన కుటుంబాన్ని అవహేళన చేస్తే, తగిన బుద్ధి చెబుతామని వైయస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు అజయ్ కుమార్ హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆనం ఆరోపణలను తీవ్రంగా ఖoడించారు వైసిపి నాయకులు. తిరుపతి అభివృద్ధిని అడ్డుకునే భాగంగానే ఆనం వెంకటరమణారెడ్డి అనవసర ఆరోపణలు చేస్తున్నారని, తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ రెడ్డి పేరు చెప్పినప్పటి నుంచి తమను ఎదుర్కోకుండా ఇలా నిరాధారమైన ఆరోపణలు చేయడం మంచిది కాదని, టిడిఆర్ బాండ్ల వ్యవహారంలో బహిరంగ చర్చకు మేము సిద్ధమని.. మీరు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు అజయ్ కుమార్. ఆనం వెంకటరమణారెడ్డి పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు అజయ్ కుమార్. దమ్ముంటే చర్చకు తిరుపతికి రావాలని సవాల్ విసిరారు. ఇలా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని కచ్చితంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.





Total views : 199274