latest news
తడిసిన ధాన్యాన్ని రంగు మారిందాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ ఎంపీ మాగంటి బాబు డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా మండవల్లి మండలం పెర్కెగూడెం గ్రామంలో మిచాంగ్ తుఫాను కారణంగా వరి పంటను గురువారం టిడిపి నాయకులతో కలిసి పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా రైతాంగం తుఫాను కారణంగా ఎంతో నష్టపోయారని కానీ ప్రభుత్వం ఇప్పటివరకు నష్ట నివారణ చర్యలు చేపట్టకపోవడం దారుణం అన్నారు. ఇప్పటికే వరి రైతుల 40000 పొగాకు రైతులు 1లక్ష, పెట్టుబడులు పెట్టారని కనీసం 10000 దిగుబడి వచ్చే అవకాశం లేదని వివరించారు. పంట పొట్ట దశలో ఉన్నప్పుడు కనీసం నీటినందించక పోవడంతో కొంతమేర దెబ్బతిన్న, తుఫానుతో పూర్తిగా పంట రైతులు నష్టపోయారని వాపోయారు. టిడిపి నిర్మించిన పట్టిసీమ ద్వారా నీటిని తోడుకొని కృష్ణ డెల్టా రైతులకు అందించవలసి ఉన్న అటువైపు దృష్టి సారించలేదని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా నాగార్జునసాగర్ పై రెండు ప్రభుత్వాలు కలిసి నీళ్ల కోసం తోలుబొమ్మలాడారని ఎద్దేవా చేశారు. రైతులను వెంటనే ఆదుకోవాలని లేకపోతే టిడిపి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
Read Also..
తుఫాన్ ప్రభావంతో వేలాదిమంది నిరశ్రయులయ్యారని, రైతుల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాపూరావు తెలిపారు. పదివేల కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తక్షణ సహాయంగా 5000 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తుఫాను బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. ముంపు ప్రాంత వాసులకు కనీసం ఆహారాన్ని కూడా అందించలేకపోయారని ఆరోపించారు. పంటలు నష్టపోయిన రైతులకు పూర్తి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని రెండు గేట్లు ఎత్తివేత. మిచౌంగ్ తుఫాను ప్రభావం తో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరదనీరు. కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం. 407 అడుగులు. ప్రస్తుతం నీటి మట్టం 404.60 అడుగులు. ఇన్ ఫ్లో 8 వేల క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 8 వేల క్యూసెక్కులు.
కృత్రిమ మేధ (AI) రంగంలో ఇటీవలి పురోగతితో, AI న్యూస్ రీడర్లు వార్తలు వినడం యొక్క కొత్త మార్గాన్ని అందిస్తున్నాయి. ఈ AI-ఆధారిత సాధనాలు టెక్స్ట్-టు-స్పీచ్ (TTS) టెక్నాలజీని ఉపయోగించి న్యూస్ ఆర్టికల్స్‌ను చదివి, వినియోగదారులకు వినడానికి సులభమైన మార్గాన్ని అందిస్తాయి.
AI న్యూస్ రీడర్లు వార్తలను వినడం ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలా చేస్తాయి, ఎందుకంటే వినియోగదారులు ఇకపై వార్తాపత్రికలు లేదా వార్తా ఛానెళ్లను చూడవలసిన అవసరం లేదు. ఈ సాధనాలు చేతిలో ఉన్నప్పుడు, వినియోగదారులు వారి ఇళ్లలో, కార్లలో లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు కూడా వార్తలను వినవచ్చు.
AI న్యూస్ రీడర్లు వ్యక్తిగతీకరించిన వార్తా అనుభవాలను కూడా అందిస్తాయి. వినియోగదారులు తమకు ఆసక్తి ఉన్న అంశాలను ఎంచుకోవచ్చు, AI న్యూస్ రీడర్లు ఆ అంశాలకు సంబంధించిన వార్తలను మాత్రమే చదివిస్తాయి.
ఇప్పటికే అనేక AI న్యూస్ రీడర్లు అందుబాటులో ఉన్నాయి, మరిన్ని రూపొందించబడుతున్నాయి. అత్యంత ప్రజాద్రిపొందిన AI న్యూస్ రీడర్లలో కొన్ని ఉన్నాయి:
- Amazon Polly
- Google Cloud Text-to-Speech
- Microsoft Azure Text-to-Speech
AI న్యూస్ రీడర్లు ఇంకా తమ ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, అవి వార్తలను వినడం యొక్క భవిష్యత్తును మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. AI న్యూస్ రీడర్లు వార్తలను వినడం ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలా చేయడమే కాకుండా, వ్యక్తిగతీకరించిన వార్తా అనుభవాలను కూడా అందించగలవు. AI న్యూస్ రీడర్లు వార్తలను వినడం యొక్క మార్గాన్ని మారుస్తున్నాయి, మరియు అవి భవిష్యత్తులో ఇంకా ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది.
ఇన్ఫోసిస్ సంస్థ ఉద్యోగులకు తాజాగా సర్ప్రైజ్ ఇచ్చింది. ఉద్యోగులకు పనితీరు ఆధారంగా 80 శాతం వెరియబుల్ పే చెల్లించనున్నట్టు ప్రకటించింది. ఈ బోనస్‌కు అందరూ అర్హులు కారని పేర్కొంది. కంపెనీ ప్రకటన ప్రకారం లెవెల్ 9 అంతకంటే దిగువ స్థాయి ఉద్యోగులకు సగటున 80 శాతం వేరియబుల్ పే ఇవ్వనుంది. ఈ మేరకు ఉద్యోగులకు సంస్థ ఈమెయిల్ పంపించింది. జులై-సెప్టెంబర్ మధ్య కాలంలో ఉద్యోగుల పనితీరు, సంస్థలో నిర్వహించిన సామార్ధ్యాన్ని బట్టి బోనాస్ వర్తిస్తుందని తెలిపింది. వారానికి 70 పనిగంటలు సూచనతో ఇటీవల సంచలనం స్పృష్టించిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, కొత్తగా వ్యాపారవేత్తగా మారడం కష్టంతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు. సాప్ట్వేర్ ఇంజినీర్,ఫైనాన్షియల్ ఎనలిస్ట్ కావడం సులభమే కానీ పారిశ్రామికవేత్తగా కొనసాగడం కష్టం అన్నారు. దానకి ఎంతో శ్రమ అవసరం అన్నారు.భారత్‌లో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు అన్నారు. అయితే, దేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు అనూకూల వాతావరణం కోసం భారత ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది అభిప్రాయపడ్డారు.
శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులను ఉద్దేశపూర్వకంగానే గవర్నర్లు ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని తమిళనాడు, కేరళ, పంజాబ్ ప్రభుత్వాలు సుప్రీంకోర్ట్ లో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. బిల్లులకు ఆమోదం తెలపకుండా తమిళనాడు గవర్నర్ మూడేళ్లుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. మరోవైపు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ఆయన కార్యాలయంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. బిల్లుల ఆమోదానికి జరుగుతున్న జాప్యానికి కారణాలు వివరించాలని నోటీసుల్లో ఆదేశించింది. కేరళ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ…రాజ్యాంగంలోని ఆర్టికల్ 168 ప్రకారం గవర్నర్లు శాసనసభలో భాగమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోర్టుకు విన్నవించారు. అందుకు సంబంధించిన వివరాలను సుప్రీం ధర్మాసనానికి సమర్పించారు. గత 21 నెలలుగా ఎనిమిది బిల్లులను గవర్నర్ ఆమోదించలేదని తెలిపారు.
మార్కెటింగ్ కమిటీ రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవ చేయాలని ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ కోటేశ్వరరెడ్డి, మిగతా కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వం తమదే అన్నారు. రానున్న రోజుల్లో ప్రతి గ్రామానికి మేలు చేస్తామన్నారు. పార్టీ అభ్యున్నతి కోసం నిత్యం శ్రమించే కార్యకర్తలను తగు రీతిలో పదవులు ఇచ్చి గౌరవిస్తామని మంత్రి కాకాని వివరించారు.
ఏపీ సర్కారు కనిగిరి రిజర్వాయర్ రైతులకు తీపి కబురు అందించింది. ఆయకట్టుకు నీరు విడుదల చేసింది. నెల్లూరు జిల్లా కోవూరు శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నీటిని విడుదల చేశారు. పెన్నాడెల్టాకు 2 లక్షల ఎకరాలకు సాగురు అందిస్తామన్నారు. బుచ్చి, కోవూరు, కొడవలూరు, విడవలూరు మండలాలలోని 26 వేల ఎకరాలకు నీరు అందుతుందన్నారు. జగన్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమన్నారు. ఇటీవలిఐఎబి సమావేశంలో టిడిపి నాయకులు అనవసర రాద్ధాంతం చేశారని ఎమ్మెల్యే విమర్శించారు. రైతుల పట్ల దొంగ ప్రేమ ప్రదర్శించారని ఆరోపించారు. టిడిపి వాళ్లకు ఇన్నాళ్లూ కనబడని ప్రేమ ఎన్నికలు వస్తున్నాయనగా పుట్టికొచ్చిందన్నారు.
తమ పౌరులపై హమాస్ మిలిటెంట్లు చేసిన విచక్షణారాహిత ఊచకోతతో ఇజ్రాయేల్ గాజాను గడగడలాడించేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… హమాస్ ను పూర్తిగా అంతమొందించడమే లక్ష్యంగా గాజాపై విరుచుకుపడుతోంది. హమాస్ పై తాము చేసే దాడులు తమ శత్రుదేశాలు దశాబ్ధాలపాటు గుర్తుంచుకునేలా ఉంటాయని ఆ దేశ అధ్యక్షుడు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆ స్టేట్ మెంట్ కి న్యాయంచేస్తూ ఇజ్రాయేల్ సైన్యం పెర్ఫార్మెన్స్ చేస్తుంది. ప్రస్తుతం భూతల దాడులతో దక్షిణాగాజాపై విరుచుకుపడుతుంది. దీంతో అక్కడి ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. హమాస్ చేతిలో బందీలను విడిపించేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. ఈ సమయంలో కాల్పుల విరమణ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుందని అమెరికా మీడియా చెబుతుంది.
అవును… హమాస్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణకు, బందీల అప్పగింతకు సంబంధించి కీలక ఒప్పందం కుదిరినట్లు “ది వాషింగ్టన్ పోస్టు” కథనం ప్రచురించింది. ఇందులో భాగంగా… తమ వద్ద బందీలుగా ఉన్న అమెరికా పౌరులతో సహా 50 మందిని విడుదల చేసేందుకు హమాస్ అంగీకరించినట్లు పేర్కొంది. దీంతో అవిరామంగా కొనసాగుతున్న యుద్ధానికి ఇజ్రాయెల్ కాస్త విరామం ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
తాజాగా ఆ పత్రిక తన కథనంలో మరిన్ని కీలక విషయాలు వెల్లడించింది. ఇందులో భాగంగా… అమెరికా, ఖతార్ మధ్యవర్తిత్వంలో దోహాలో ఈమేరకు చర్చలు జరిగాయని.. దీంతో ఇజ్రాయేల్ – హమాస్ మధ్య సుమారు ఆరు పేజీల ఒప్పందం కుదిరినట్లు కథనంలో పేర్కొంది.
ఈ ఆరుపేజీల ఒప్పందంలో పౌరులకు ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు ఐదు రోజుల పాటు ఇజ్రాయేల్ కాల్పుల విరమణ అమలు చేసే అవకాశం ఉందని తెలిపింది. ఇదే సమయంలో వాషింగ్టన్ లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ ప్రతినిధి ఈ ఒప్పందంపై మాట్లాడేందుకు నిరాకరించినట్లు పేర్కొంది.
తోసిపుచ్చిన వైట్ హౌస్:అమెరికా పత్రికల కథనాలు అలా ఉంటే… మరోపక్క ఇజ్రాయెల్ – హమాస్ లు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకారం కుదిరినట్లు వస్తున్న వార్తలను వైట్ హౌస్ తోసిపుచ్చింది. ఆ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ… ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదని శ్వేత సౌధం జాతీయ భద్రతా మండలి ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ ఓ ప్రకటనలో తెలిపారు.కాగా… అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై హమాస్ జరిగిన మెరుపు దాడిలో సుమారు 1200 మంది చనిపోగా.. 240 మంది పౌరులను హమాస్ బందీలుగా చేసుకొంది. వీరిలో అమెరికా పౌరులు కూడా ఉన్నారు. దీంతో ఆ బందీలను విడిపించుకునేందుకు గాజాలో భూతల దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయేల్ సైన్యం గాజాను వణికించేస్తుంది.




Total views : 194234