తెలంగాణలో నేటి నుండి అసెంబ్లీ , శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రధాన సమస్యలపై ఎజెండాను అధికార పక్షం సిద్దం చేసుకుంది. విపక్షాలు కూడా తమ అస్త్ర శస్త్రాలతో రెడీ అయ్యారు. ఈ సమావేశాలకు కేసీఆర్..ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన మార్పుపై పట్టుబట్టేందుకు బీఆర్ఎస్ వర్గాలు సిద్దమైనట్లు తెలుస్తోంది. తెలంగాణలో అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమంటూ ఆ పార్టీ అగ్రనేతలు తెలంగాణ ఎమ్మెల్యేలకు సూచించారు. అధికార పార్టీ హామీలైన ఆరుగ్యారెంటీల అమలును విమర్శనాస్త్రంగా సంధించనున్నది. తెలంగాణలో అధికారంలోకి రావడానికి అవసరమైన వ్యూహంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. విపక్షాలను తిప్పికొట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ అంతా రెడీ అయ్యింది. ముందస్తు సమావేశం నిర్వహించి వ్యూహరచన చేసుకుంది. ప్రతిపక్షాలు గుక్కతిప్పుకోకుండా సమాధానాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అధికారులు, పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేసింది. సభ సజావుగా సాగడానికి అవసరమైన యంత్రాంగాన్ని అంతా సమాయత్తం చేసింది. అసెంబ్లీ పరిసరాల్లో భారీ బందోబస్తుకు ఏర్పాట్లు చేసింది. ఎక్కడికక్కడే విపక్షాల వ్యూహాలను చిత్తు చేసే దిశగా పార్టీ యాంత్రాంగాన్ని సైతం సిద్ధం చేసుకుంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం కేంద్రంగా ఆదివాసీలు తమ గళాన్ని వినిపించారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి (ఏహెచ్‌పీఎస్) తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆదివాసీ పోరుకేక’ భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని వివిధ ఏజెన్సీ ప్రాంతాల నుండి వేలాది మంది ఆదివాసీలు…
- ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్ రావు.తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభ పెడతానంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు.…
- అమీర్‌పేట్ మైత్రీవనంలో అగ్నిప్రమాదంమైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది మంటలను…
- సచివాలయంలో తెలంగాణ ఉద్యమకారులపై కీలక భేటీ..!తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అసలైన ఉద్యమకారుల గుర్తింపు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కేకే అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై విస్తృతంగా చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందన్న…
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమరావతిలో జరుగుతున్న కీలక కేబినెట్ సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్, అస్వస్థత కారణంగా సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న ఆయన నేరుగా మంగళగిరిలోని క్యాంప్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 92770