మళ్లీ మణిపూర్ భగ్గుమంటోంది. మరోసారి హింసాత్మక మంటల్లో కాలిపోతోంది. ఇక్కడ ఆందోళనకారులు ఆగ్రహంతో ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ వ్యక్తిగత నివాసంపై దాడి చేశారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను కూడా ప్రయోగించాల్సి వచ్చింది. ఘటన సమయంలో సీఎం బీరేన్ సింగ్ ఆ ఇంట్లో లేరని సంబంధిత వర్గాలు తెలిపాయి. సీఎం తన కార్యాలయంలో ఉన్నారని, పూర్తిగా క్షేమంగా ఉన్నారని తెలిసింది. రాజధాని ఇంఫాల్‌లో మణిపూర్ ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన తరుణంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ముగ్గురి హత్య తర్వాత చెలరేగిన నిరసనల దృష్ట్యా ఆరు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అంతకుముందు, ఇంఫాల్‌లోని ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లపై నిరసనకారులు దాడి చేశారు. ఆ తర్వాత నిరసన హింసాత్మకంగా మారింది. మణిపూర్ లో హింసపై అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ శాంతి భద్రతల పునరుద్ధరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మణిపూర్‌లో మోహరించిన అన్ని భద్రతా బలగాలను పరిస్థితిని కంట్రోల్ చేయమని సూచించింది
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ రియాల్టీ షోలో తెలుగు లయన్స్, హిందీ హాక్స్, తమిళ్ టైగర్స్, మావెరిక్స్, కన్నడ పాంతర్స్…ఇలా ఐదు టీమ్స్ పాల్గొననున్నాయి. ఈ…
- చిలకా ప్రొడక్షన్స్ థ్రిల్లర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్..నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన , ఆలోచింపజేసే కథలను చూపడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ మరోసారి తనదైన శైలిలో ఈసారి కూడా…
- తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు అధికారులు,…
- విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
- తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్..తమిళనాట చారిత్రాత్మక విజయంతో రికార్డ్ సృష్టించిన సీఎం విజయ్..తనదైన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తన క్రమశిక్షణ, సమయపాలన అధికారుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయంలో విధులకు హాజరవుతుండటంపై హర్షం వ్యక్తం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 79232