హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌లను పంపడంతో పాటు ప్రతిపాదిత మార్గాల్లో భూసేకరణపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం 2 వేల 787 కోట్లు కేటాయించారు. 24 వేల 269 కోట్లతో రెండో దశ ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని విస్తరణకు సంబంధించి నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు, రాయదుర్గం-కోకాపేట నియోపొలిస్, ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట, మియాపూర్-పటాన్చెరు, ఎల్బీ నగర్-హయత్ నగర్ మొత్తం 76.4 కిలోమీటర్ల మేర విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌ను రాష్ట్రం కేంద్రానికి పంపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం నిధులు భరించేలా జాయింట్ వెంచర్‌గా ఈ ప్రాజెక్టు చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేశారు.
హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రతిపాదనతో పాటు అవసరమైన అన్ని పత్రాలు, డీపీఆర్‌లను సైతం కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. రెండోదశ ప్రాజెక్టులో 3 కారిడార్లు ఉన్నాయి. ఆర్జీఐఏ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ , జేబీఎస్ నుంచి మేడ్చల్, శామీర్‌పేట మొత్తం 86.1 కి.మీ పొడవును కవర్ చేసే ఈ ఫేజ్ 2 ప్రాజెక్టుకు మొత్తం 19 వేల 579 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఫేజ్ 2 ప్రాజెక్టును కూడా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. రెండో దశ మెట్రో విస్తరణలో కిలో మీటరుకు నిర్మాణ అంచనా వ్యయం 318 కోట్లుగా ఉంది. పరిస్థితుల ప్రకారం ఇందులో కొంత హెచ్చుతగ్గులు ఉంటాయని డీపీఆర్‌లో పేర్కొన్నట్టు అధికారులు చెబుతున్నారు. కాగా ఎలివేటెడ్ మెట్రో, డిజైన్, ఇన్నోవేషన్‌తో హైదరాబాద్‌లో తక్కువ ఖర్చుతో మెట్రో రెండో దశ పనులు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలు రెండో ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌లకు భూసేకరణపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. కేంద్రం నుంచి అనుమతులతోపాటు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వచ్చేలోపు భూసేకరణ పూర్తి చేయాలని నిర్ణయించింది. అందుకోసమే 2 వేల 787 కోట్లు కేటాయించింది. మార్చి-ఏప్రిల్ మాసాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
#metrotrain
ఒరిజినల్ సిటీ అయిన ఓల్డ్ సిటీలో మెట్రో రైల్ ను త్వరగా పట్టాలు ఎక్కించడానికి సంబంధించిన స్థల సేకరణ ప్రక్రియ వేగవంతం అయింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దాదాపు ఏడున్నర కిలోమీటర్ల నిడివి గల ఎంజీబీఎస్ – చంద్రాయణ్ గుట్ట మార్గంలో భూసేకరణ పనులు ముమ్మరమయ్యాయి. భూసేకరణ చట్టానికి లోబడి ఈ ప్రభావిత 11 వందల ఆస్తులకు గాను.. ఇప్పటికే 900 ఆస్తులకు సంబంధించిన రిక్విజిషన్ ని జిల్లా కలెక్టర్ కి సమర్పించామని.. వాటిలో 800 ఆస్తులకు సంబంధించిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ ను దఫదఫాలుగా కలెక్టర్ జారీ చేసారని.. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. నోటిఫై చేసిన ఆస్తులలో 4 వందల ఆస్తులకు ప్రిలిమినరీ డిక్లరేషన్ ను కలెక్టర్ జారీ చేయడం పూర్తయ్యిందన్నారు. 2 వందల ప్రభావిత ఆస్తుల పరిహారానికి సంబంధించిన అవార్డులను ఈ నెలాఖరులోగా ప్రకటించడం పూర్తవుతుందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. తదనంతరం వెంటనే వాటికి పరిహారం చెల్లించి వాటిని కూల్చే పనులు ప్రారంభం అవుతాయని.. తద్వారా మెట్రో రైల్ మార్గ నిర్మాణాన్ని సుగమం చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 90600