ఏసీబీ వలలో నిజామాబాద్ మున్సిపల్ ఆఫీస్ లోఅవినీతి తిమింగలం చిక్కింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ నివాసంలో భారీగా నగదు, బంగారం, ఆస్తిపత్రాలు బయటపడ్డాయి. తెల్లవారుజామున నగరంలోని వినాయక నగర్లో అశోక టవర్లోని నరేందర్ ఇంటిపై ఏసీబీ నిర్వహించిన మెరుపు దాడిలో ఈ అక్రమాస్తుల బాగోతం బయటపడింది. ఇంట్లో నోట్ల కట్టలు గుట్ట మాదిరిగా ఉండటం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ డబ్బును అధికారులు కౌంటింగ్ మిషన్ల సహాయంతో లెక్కిస్తున్నారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకోవడం జిల్లా ఏసీబీ చరిత్రలోనే రికార్డు అనే టాక్ వినిపిస్తున్నది.
ఏసీబీ సోదాల్లో నరేందర్ ఇంట్లో 2.93 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నరేందర్, అతని భార్య, అతని తల్లి బ్యాంకు ఖాతాలోనూ భారీగా నగదు ఉన్నట్లు గుర్తించారు. 51 తులాల బంగారంతో పాటు 1.98 కోట్ల రూపాయల విలువ చేసే స్థిరాస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.6.07 కోట్లు ఉంటుందని తెలుస్తున్నది. నరేందర్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. త్వరలో కోర్టులో హాజరు పర్చనున్నారు. అదనపు ఆస్తులను వెలికితీసేందుకు మరిన్ని సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. నరేందర్ అక్రమాస్తుల చిట్టాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ రియాల్టీ షోలో తెలుగు లయన్స్, హిందీ హాక్స్, తమిళ్ టైగర్స్, మావెరిక్స్, కన్నడ పాంతర్స్…ఇలా ఐదు టీమ్స్ పాల్గొననున్నాయి. ఈ…
- చిలకా ప్రొడక్షన్స్ థ్రిల్లర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్..నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన , ఆలోచింపజేసే కథలను చూపడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ మరోసారి తనదైన శైలిలో ఈసారి కూడా…
- తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు అధికారులు,…
- విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
- తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్..తమిళనాట చారిత్రాత్మక విజయంతో రికార్డ్ సృష్టించిన సీఎం విజయ్..తనదైన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తన క్రమశిక్షణ, సమయపాలన అధికారుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయంలో విధులకు హాజరవుతుండటంపై హర్షం వ్యక్తం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 79138