Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra PradeshPrakasam మున్సిపల్ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన ర్యాలీ..

మున్సిపల్ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన ర్యాలీ..

by
outsourcing employees

మార్కాపురం లోని మున్సిపల్ కాంట్రాక్టు మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికై కార్మిక సంఘాల యూనియన్ల ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ కార్యాలయం వద్ద నుండి మున్సిపల్ కార్యాలయం వరకు కార్మికుల నిరసన ర్యాలీ నిర్వహించారు. మున్సిపాలిటీ ఔట్సోర్సింగ్లో పని చేస్తున్న పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ విభాగ ఉద్యోగ, కార్మికులను పర్మినెంట్ చేయాలని, ఉద్యోగ, కార్మికులను పర్మినెంట్ చేసేంతవరకు ధరలకనుగుణంగా కనీస వేతనాలు 26 వేల రూపాయలు ఇవ్వాలని, పర్మినెంట్ పారిశుద్ధ్య,ఇంజనీరింగ్ కార్మికుల జిపిఎఫ్ ఖాతాలు సాంకేతిక సమస్యలు అంటూ ప్రభుత్వం వాయిదా వేయకుండా సత్వరం తెరవాలని, పర్మినెంట్ కార్మికులకు 2021 నుంచి పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ల ఎంకాస్మెంట్ కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని, జీవో నెంబర్ 30 సవరించి, నాటి కార్మిక శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా స్కిల్ట్ సెమిస్కిల్ట్, హైస్కిల్డ్ వేతనాలు చెల్లించాలని… సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్లలు విధుల్లో మరణిస్తే 30 లక్షల రూపాయలు, ప్రమాదాల బారిన పడితే 10 లక్షల రూపాయలు చెల్లించాలని, 11వ పిఆర్సి ప్రకారం 20 వేల రూపాయలు వేతనం మరియు కరువు భత్యం ఇవ్వాలి, వాటి బకాయిలు అందించాలని… వృద్ధాప్య పెన్షన్లు అమ్మబడి తదితరమైనవి) తిరిగి యధాతధంగా వర్తింపజేయాలని, డివిజన్ కార్యాలయాల వద్ద కార్మికుల మస్తర్ తీసుకోవాలి. కనీస వసతులు ఏర్పాటు చేయాలని, పర్మినెంట్ కార్మికుల హెల్త్ కార్డులు చెల్లుబాటయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. పై డిమాండ్స్ వర్తింపజేయని పక్షంలో ఈనెల 20వ తేదీన సమ్మె చేపడుతున్నట్టు సమ్మె నోటీసును మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు. 18. రిటైర్డ్ అయిన మరణించినటువంటి కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు గీతం వలె పసుకుందా 19. పండుగ జాతీయ సెలవు దినాలు అమలు చేయాలి. 20. మున్సిపల్ కాలనీలు ఏర్పాటు చేయాలి. 21. 62 సంవత్సరాలు నిండి రిటైర్మెంట్ అయిన ఔట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులకు గ్రాడ్యుది చెల్లించాలి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: