Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Telangana నిజామాబాద్ మున్సిపల్ ఆఫీస్ లోఅవినీతి తిమింగలం

నిజామాబాద్ మున్సిపల్ ఆఫీస్ లోఅవినీతి తిమింగలం

by Satya
నిజామాబాద్ మున్సిపల్ ఆఫీస్ లోఅవినీతి తిమింగలం

ఏసీబీ వలలో నిజామాబాద్ మున్సిపల్ ఆఫీస్ లోఅవినీతి తిమింగలం చిక్కింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ నివాసంలో భారీగా నగదు, బంగారం, ఆస్తిపత్రాలు బయటపడ్డాయి. తెల్లవారుజామున నగరంలోని వినాయక నగర్‌లో అశోక టవర్‌లోని నరేందర్ ఇంటిపై ఏసీబీ నిర్వహించిన మెరుపు దాడిలో ఈ అక్రమాస్తుల బాగోతం బయటపడింది. ఇంట్లో నోట్ల కట్టలు గుట్ట మాదిరిగా ఉండటం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ డబ్బును అధికారులు కౌంటింగ్ మిషన్ల సహాయంతో లెక్కిస్తున్నారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకోవడం జిల్లా ఏసీబీ చరిత్రలోనే రికార్డు అనే టాక్ వినిపిస్తున్నది.
ఏసీబీ సోదాల్లో నరేందర్ ఇంట్లో 2.93 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నరేందర్, అతని భార్య, అతని తల్లి బ్యాంకు ఖాతాలోనూ భారీగా నగదు ఉన్నట్లు గుర్తించారు. 51 తులాల బంగారంతో పాటు 1.98 కోట్ల రూపాయల విలువ చేసే స్థిరాస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.6.07 కోట్లు ఉంటుందని తెలుస్తున్నది. నరేందర్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. త్వరలో కోర్టులో హాజరు పర్చనున్నారు. అదనపు ఆస్తులను వెలికితీసేందుకు మరిన్ని సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. నరేందర్ అక్రమాస్తుల చిట్టాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.
    హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
  • ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
    ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
  • నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
    ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
  • మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.
    బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్‌–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
  • ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.
    ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్‌ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: