Nalgonda
నేడు నల్గొండ జిల్లాకు రానున్న రోడ్లు, భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లాకు వస్తున్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు. ఉదయం 10.30 కి మర్రి గూడ బై పాస్ నుంచి నల్గొండ లోని మంత్రి నివాసం వరకు భారీ బైక్ ర్యాలీ. నల్గొండ పట్టణంలోని మంత్రి నివాసంలో జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశం, ప్రజలను కలుసుకోనున్న మంత్రి. గత యేడాదిగా కొనసాగుతున్న వరిధాన్యం కొనుగోళ్ల తీరు.. భవిష్యత్ లో అనుసరించాల్సిన విధానం, జిల్లాలోని మున్సిపాలిటీలలో తాగునీటి కల్పన, జిల్లాలో నిరంతర విద్యుత్ సరఫరాలో ఎదరవుతున్న సమస్యలు.. ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు అనుసరించాల్సిన వ్యూహం పై కలెక్టర్ ఆఫీసులో జిల్లా కలెక్టర్ ఇతర విభాగాల అధికారులతో రివ్యూ మీటింగ్. అనంతరం జిల్లా అధికారులతో ఇష్టాగోష్టి.
నల్లగొండ బైపాస్ లో ట్రావెల్స్ బస్సు దగ్ధం. ఘటనలో మంటల్లో ఓ ప్రయాణికుడు దుర్మరణం. పట్టణ సమీపంలోని నార్కెట్‌పల్లి-అద్దంకి హైవేపై.. అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ తో ట్రావెల్స్ బస్సు దగ్ధం. హైదరాబాద్ నుంచి చీరాల వైపు 38 మంది ప్రయాణికులతో బయలుదేరిన ట్రావెల్స్ బస్సు. ఏసీ డెమో నుంచి మంటలు రావడంతో బస్సును నిలిపేసి. ప్రయాణికులను దింపిన డ్రైవర్. నిమిషాల్లోనే దగ్ధమైన ట్రావెల్స్ బస్సు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేపు జరగనున్న కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో 276 మంది అభ్యర్థులు పోటీలో వుండగా వారి భవితవ్యం రేపు తెలనుంది. రేపు ఉదయం 8 గంటలకు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. నల్గొండ జిల్లా కేంద్రం లోని దుప్పల పల్లి గోదాంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయడంతోపాటు, రేపు జరగనున్న కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న నల్గొండ కలెక్టర్ అర్.వి కర్ణన్.
నల్లగొండ జిల్లాలో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 40 మంది అధికారులతో బృందాలుగా రైస్ మిల్లర్స్ , బీఆర్ఎస్ అభ్యర్థి అనుచరుల ఇళ్లల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. నిన్న తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. మిర్యాలగూడలోని పలు రైస్ మిల్లుల యజమానులతోపాటు ఓ కాంట్రాక్టర్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక కాంట్రాక్టర్ ఇంజమూరి శ్రీధర్ ఇంటితోపాటు రైస్ మిల్లు యజమానులు రంగా రంజిత్, రంగా శ్రీధర్, బండారు కుశలయ్య, రేపాల అంతయ్య ఇండ్లు, మిల్లుల్లో గురువారం ఉదయం 4 నుంచి అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. త్రిపురారం మండలం ముకుందాపురంలోని వెంకటసాయి సాల్వెంట్ ఆయిల్ మిల్లులోనూ సోదాలు చేపట్టినట్టు సమాచారం.
కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమిత్ షా తెలంగాణకు రానున్నారు. సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్లో తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ఆ తర్వాత నల్గొండ, వరంగల్, గద్వాల, రాజేంద్రనగర్‌లలో నిర్వహించే సభలలో పాల్గొంటారు. ఈ మేరకు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అమిత్ షా 17న తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. అయితే 18కి వాయిదా పడింది.
నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం మల్లారం బొల్లేపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం లో పాల్గొని గడపగడప తిరుగుతూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లారం బొల్లెపల్లి గ్రామాల నుండి BRS పార్టీకి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం మొత్తం మీద 15 నుండి 20 సీట్లు కూడా రావని అక్కస్సుతో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లకు దింపుడు కాలం దగ్గరికి వచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేయాలని సంకల్పంతో ప్రజలు ఉన్నారని ఉద్యోగ వ్యాపార సంఘాలు రైతులు ప్రజలు తమకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికలలో తనను నకిరేకల్ గడ్డపై అత్యధిక మెజారిటి తో గెలిపించాలని ప్రజలను కోరారు.
Read Also..
Read Also..
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గనికి భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో నామినేషన్ వేయడానికి వచ్చారు మునుగోడు మండలం పులిపలుపుల గ్రామానికి చెందిన కంభంపాటి సత్యనారాయణ. తెలంగాణ వస్తే 92 వెయిల ఉద్యోగాలు ఇస్తానన్న చెప్పిన కేసీఆర్10 సంవత్సరాలు గడిసిన నోటిఫికేషన్ వెయ్యకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. ఇంటికో పింఛన్ ఇస్తున్నానని చెప్తున్న కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఎందుకు చెప్పట్లేడని ప్రశ్నించారు. ఇంటికి క్వాటర్ బీర్లు పంపుతూ తాగుబోతుల తెలంగాణ చేసిండని,కేసీఆర్ కి ఓటు వేస్తే నిరుద్యోగులు బిక్షం ఎత్తుకుని పరిస్థితి వచ్చిందని, రైతులు కూడా బిక్షం ఎత్తుకొక తప్పదన్నారు.తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేసినం కానీ కేసీఆర్ ఇంట్లో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకుండని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ని రాజకీయ నిరుద్యోగి చేయడమే తమ లక్ష్యం పంతమన్నారు. నేలపై పడుకుని సాష్టాంగ నమస్కారం చేస్తూ కేసీఆర్ కు ఓటు వేయొద్దని వేడుకున్నారు.