అంగన్వాడీ కార్యకర్తలు, సహాయక సిబ్బందిపై ఏపీ ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం నియంత పోకడలకు పరాకాష్ఠ అని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిరసనలు చేయడం కూడా నేరమా? అని ప్రశ్నించారు. ఎస్మా ప్రయోగం, జీతంలో కోత నియంత పోకడలకు ప్రబల నిదర్శనం అని పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం జీవో నెం.2ను వెనక్కి తీసుకోవాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. అంతిమంగా నెగ్గేది అంగన్‌వాడీలేనని అన్నారు. ఏపీలో అంగన్వాడీల ఉద్యమానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
nara lokesh
చేసిన పాపాలు పోవాలని, సన్మార్గంలో నడిచేలా దీవించాలని భక్తులంతా శ్రీకాళహస్తీశ్వర స్వామిని వేడుకుంటారు. అధికారమదం తలకెక్కిన వైకాపా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాత్రం శ్రీకాళహస్తి సన్నిధిలోనే పాపాలకు పాల్పడుతున్నాడు. స్వామి, అమ్మవార్లకే అపచారం తలపెడుతున్నాడు. పురాతన శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకి నైవేద్యాలు తయారుచేసే గది, మృత్యుంజయ పూజలు నిర్వహించే ప్రదేశంలో వేల ఏళ్ల నాటి చారిత్రక కట్టడాలను కూల్చేయిస్తున్నాడు. పురావస్తు, దేవాదాయ శాఖ నిబంధనలు పట్టించుకోకుండా, వీఐపీల ఆశీర్వాదాల కోసం శ్రీకాళహస్తి ఆలయంలో తవ్వకాలు చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. చారిత్రక, పురావస్తు, ఆధ్యాత్మిక సంపద ధ్వంసం చేయడం నిబంధనలకు విరుద్ధమే కాదు, పాపం. శ్రీకాళహస్తి ఆలయంలో తవ్వకాలకు కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానని టిడిపి పార్టీ నాయకులు సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.
రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందించిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్‌ను జనవరి 11 వరకు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సర్టిఫికెట్ ఆధారంగా చిత్రాన్ని విడుదల చేయరాదంటూ రామదూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌లకు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్‌పై విచారణను జనవరి 11కు వాయిదా వేసింది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠను దెబ్బతీసేలా రూపొందించిన ఈ సినిమా ప్రదర్శనకు కేంద్ర సెన్సార్ బోర్డు అనుమతించడాన్ని సవాలు చేస్తూ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు. న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు.
Read Also..
Read Also..
రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. డిసెంబర్ 28న విచారణ చేపడతామని తెలిపింది. సినిమా విడుదల చేయకుండా చిత్ర నిర్మాతను ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు. వ్యూహం ట్రైలర్ విడుదల సమయంలో దర్శకుడు తనకు జగన్ అంటే ఇష్టమని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నచ్చరని చెప్పారని లోకేశ్ పిటిషన్ లో పేర్కొన్నారు. సీఎం జగన్ తెర వెనుక ఉండి ఈ సినిమా తీయించారన్నారు. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాంతీయ కార్యాలయం, రివైజింగ్ కమిటి, రామదూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్ కుమార్, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను పిటిషన్ లో ప్రతివాదులుగా చేర్చారు.
వైసిపి పాలనకు చరమగీతం పాడేందుకే తెలుగుదేశం – జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయని గుంటూరు జిల్లా టిడిపి నాయకులు తెలిపారు. నారా లోకేష్ పాదయాత్ర విజయవంతమైందని ఆలపాటి రాజా తెలిపారు. టిడిపికి పోస్ట్ మార్టం చేయాలని మంత్రి అంబటి మాట్లాడుతున్నారని.. పోస్ట్ మార్టం చేయాల్సింది వైసిపీకేనని విమర్శించారు. వైసిపి ఎమ్మెల్యేల నియోజకవర్గాలు మార్చినప్పుడే వారి ఓటమి ఖరారయిందన్నారు. తుఫాన్ వల్ల సర్వం కోల్పోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. క్షేత్రస్థాయిలో జగన్ పంట పొలాలను పరిశీలించకుండా పరదాల చాటున వచ్చి రైతుల్ని పలకరించకుండానే వెళ్లిపోయారని మండిపడ్డారు. మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి.. మహిళలను దారుణంగా మోసగించారన్నారు. నాడు – నేడు విద్యారంగంలో సంస్కరణలంటూ ప్రచారం చేస్తున్నారని… కానీ ఆరు లక్షల మంది విద్యకు దూరమయ్యారని ఆలపాటి ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత కొద్దిరోజులుగా అంగన్ వాడీలు నిరసనలు చేస్తున్నా పట్టించుకోక పోవడం దారుణమని ఆలపాటి రాజ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also..
ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. అనూహ్యంగా తెర మీదకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్షమయ్యారు. గన్నవరంలో ప్రత్యేక జెట్ లో నారా లోకేష్ తో పాటుగా దిగిన ప్రశాంత్ కిషోర్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు వెనుక కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికల వేళ చంద్రబాబుతో సమావేశం కావటం ఆసక్తి కరంగా మారుతోంది.
ప్రశాంత్ కిషోర్ 2014లో ప్రధాని మోదీ విజయంలో ప్రధాన భూమిక పోషించారు. ఆ తరువాత ఢిల్లీలో ఆప్, పంజాబ్ లో కాంగ్రెస్, ఏపీలో జగన్ విజయం వెనుక కీలకంగా వ్యవహరించారు. 2019 ఎన్నికల ముందే జగన్ నాడు ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం చేసుకున్నారు. జగన్ గెలుపు తరువాత ప్రశాంత్ కిషోర్ దూరంగా ఉన్నాఆయన టీం వైసీపీ కోసం పని చేస్తోంది. ఇదే సమయంలో ఐ ప్యాక్ లో పీకే సహచరులుగా ఉన్న రాబిన్ శర్మ ప్రస్తుతం టీడీపీకి రుషి రాజ్ సింగ్ వైసీపీ కోసం పని చేస్తున్నారు. ఈ సమయంలో కొంత కాలంగా ప్రశాంత్ కిషోర్ కోసం టీడీపీ ప్రయత్నిస్తోందనే వార్తలు వచ్చాయి.
ప్రశాంత్ కిషోర్ ప్రస్తుత ఏపీ రాజకీయాల పైన కొద్ది రోజుల క్రితం కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ 2019 ఎన్నికల్లో ఇచ్చిన సంక్షేమ హామీల వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు, జనసేనతో పొత్తుతో వెళ్లటంతో పాటుగా సంక్షేమ మేనిఫెస్టో పైన కసరత్తు చేస్తున్నారు. ఈ సమయంలో ప్రశాంత్ కిషోర్ టీం ఏపీలో చేసిన సర్వే నివేదికలను చంద్రబాబుకు అందించినట్లు సమాచారం. టీడీపీ ఎక్కడ బలహీనంగా ఉందీ ఏ రకంగా ముందుకు వెళ్లాలనే దాని పైన సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎన్నికలు పూర్తయ్యే వరకూ టీడీపీకి పీకే సూచనలు, సలహాలు కొనసాగుతాయని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, పీకే ఎంట్రీతో టీడీపీ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తుందా జగన్ ఎలా ఎదుర్కొంటారు. మొత్తంగా ఏపీ రాజకీయం ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల తరువాత ఇక తాను రాజకీయ వ్యూహకర్తగా పని చేయనని ప్రకటించారు. బీహార్ లో సొంత పార్టీ ఏర్పాటు చేసి పాదయాత్ర చేస్తున్నారు. కొద్ది రోజులు క్రితం ప్రశాంత్ కిషోర్ తో ఢిల్లీలో భేటీ అయ్యారు. తమ పార్టీకి వ్యూహకర్తగా పని చేయకపోయినా రాజకీయ సలహాదారుగా వ్యవహరించాలని కోరారు. ఒకసారి చంద్రబాబుతో సమావేశానికి రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తాడేపల్లి చేరుకున్నారు. ప్రశాంత్ కిషోర్ గతంలో జగన్ కోసం పని చేసి ఉండటంతో జగన్ బలాలు, బలహీనతలు, వ్యూహాల పైన పూర్తి అవగాహన ఉందని టీడీపీ నేతలు నమ్ముతున్నారు. దీంతో, ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ టీడీపీ కోసం పని చేస్తే జగన్ ను ఓడించటంలో సహకరిస్తుందని విశ్వసిస్తున్నారు.
జగన్ మాటలు వింటుంటే జబర్దస్త్ షో లో బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడు – లోకేష్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోమారు తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. జగన్ మాటలను దగ్గరగా చూస్తే జబర్దస్ షోలోని బిల్డప్ బాబాయి గుర్తొస్తారని పేర్కొన్నారు. ఆయన మాటలు కోటలు దాటుతాయని, పనులు మాత్రం గడపదాటవన్నారు. జగన్ తన సొంత ఇలాకా కడప జిల్లాలో మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తిచేస్తానని చెప్పి తొలి శిలాఫలకం వేసి నాలుగేళ్లు అయిందని గుర్తు చేశారు. రూ. 15 వేల కోట్లతో ఉక్కు పరిశ్రమ నిర్మించి 25 వేల మందికి ఉద్యోగం ఇస్తానని నాడు కోతలు కోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసిపి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టిన దాడులు నిర్వహించిన పారిపోమని టిడిపి ఓట్లను తొలగించడం, ఓట్లు వేయకుండా అడ్డుకోవాలని ప్రయత్నించడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు. పల్నాటి ప్రజలు టిడిపి పార్టీని ఆదరించారని ప్రజలు కష్టాల్లో ఉన్నారని వారికి టిడిపి పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఇంకొక మూడు నెలలు ఓపిక పట్టండని నష్టపడ్డ ప్రజలకు, ప్రతి టిడిపి కార్యకర్తకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటామని అన్నారు. ఓటమి భయం వైసిపి పార్టీని వెంటాడుతుందని వ్యవస్థలను వెంటబెట్టుకుని అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో టిడిపి జనసేన సంకీర్ణ ప్రభుత్వం రావడం ఖాయమని ప్రజలు, కార్యకర్తలు భయపడవద్దని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేసిన కూడా లోకేష్ పాదయాత్ర బ్రహ్మాండంగా జరిగిందని అది జీర్ణించుకోలేని వైసిపి ప్రభుత్వం వారు పాదయాత్ర మొదలు పెట్టిన దగ్గర నుండి ఎద్దేవా చేస్తూనే ఉన్నారని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు తమ ఓటు హక్కుతో వైసిపి ప్రభుత్వంకు ఓటమిని 70mm లో సినిమా చూపిస్తారని ఆయన అన్నారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ మహమ్మద్ నజీర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న విజయనగరం జిల్లాలో జరిగినటువంటి విజయోత్సవ సభ ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశలకు ఒక నవశకంగా మారినటువంటి పరిస్థితులను చూసాం. రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ సమావేశాలకు రానటువంటి విధంగా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ప్రాంతం నుండి అశేష ప్రజానికం విజయనగరం వైపు రావడంతో జన సముద్రం గా మారినటువంటి పరిస్థితులు కనిపించాయని మహమ్మద్ నసీర్ తెలిపారు. తెలుగుదేశం వీర సైనికులు, జనసేన జన సైనికులు కదిలి వచ్చారని అందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబునాయుడు గారు మరోపక్క జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ గారు పాల్గొన్నారు. యువగలం రథసారథి అయిన నారా లోకేష్ గారు చేపట్టినటువంటి దాదాపు 226 రోజుల సుదీర్ఘ పాదయాత్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 97 నియోజకవర్గాలు దాదాపు 2100 గ్రామాలను ఆయన సందర్శించారు. ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద ప్రజలు పడుతున్న ఇబ్బందులు కనుక్కొని వారికి భరోసా కల్పించేటువంటి కార్యక్రమం చేశారని ఆయన అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం తను నిస్వార్ధంగా ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని బలపరిచేటువంటి కార్యక్రమం ఎందుకు చేశారని వివరించినటువంటి తీరు అద్భుతం అన్నారు. సభకు వచ్చిన జన సంద్రాన్ని చూసి వైసీపీ మంత్రులకు, జగన్ మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు పుడుతుందని అన్నారు. మంత్రి రోజా పవిత్రమైనటువంటి గుడిలో లోకేష్ గారి మీద వ్యంగంగా మాట్లాడడం సరికాదన్నారు. రోజా గారికి రోజులు దగ్గరపడ్డాయి ఆమె మంత్రిగా ప్రజలకు ఏం సేవ చేసిందో ఒక్కసారి చెప్పాలని అన్నారు. అలాగే వెల్లంపల్లి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. ఈరోజు లోకేష్, పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో ఏ విధమైనటువంటి స్పందన వస్తోందో ప్రజలందరూ ఆలోచించాలని, పరదాలు కట్టుకుని తిరిగేటటువంటి దౌర్భాగ్య స్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయారని తెలిపారు. ప్రజల్లో గుండె ధైర్యం కలిగిస్తూ ముందుకు సాగేటువంటి నాయకత్వం నారా లోకేష్ గారిది అందుకని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, జనసేన సైనికులు గాని మన అందరి నాయకుల సమక్షంలో రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ మహమ్మద్ నసీర్ తెలియజేశారు.
తాడేపల్లి తలుపులు బద్ధలు కొట్టేవరకు తన యుద్ధం ఆగదన్నారు టీడీపీ జాతీయ ప్రధాని కార్యదర్శి నారా లోకేష్. యువగళం-నవశకం సభలో మాట్లాడుతూ ప్రజలు పాదయాత్ర చేస్తే పోరాటం అవుతుందని రాక్షస పాలనలో పోరాటం చేస్తే విప్లవమవుతుందని ఆయన అభివర్ణించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ దెబ్బతీశారని మూడు నెలల్లో ప్రజాస్వామ్యం పవర్ ఎంటో చూపిస్తామన్నారు.





Total views : 90307