దేశ రాజధాని ఢిల్లీలోని ఆరు పాఠశాలలకు మరోసారి బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. పశ్చిమ విహార్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కేంబ్రిడ్జ్ పాఠశాల సహా పలు స్కూళ్లకు ఇవాళ బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. దీంతో, అప్రమత్తమైన విద్యాసంస్థల యాజమాన్యం వెంటనే ఢిల్లీ పోలీసులకు సమాచారమిచ్చింది. విద్యార్థులను ఇంటికి పంపించివేసింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, బాంబు స్క్వాడ్ తో అక్కడకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మెయిల్ ఐపీ అడ్రస్ ఎక్కడిదనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఢిల్లీలోని పాఠశాలలకు బెదిరింపులు రావడం వారంలో ఇది రెండోసారి. డిసెంబరు 9న కూడా 40కి పైగా స్కూళ్లకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలోని శ్రీ విరుపాక్షమ్మ తల్లి ఆలయంలో పుష్కరోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణానికి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.మూడు…
- దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.…
- పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం.పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో విషాదం నెలకొంది. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతుండగా…
- ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు.పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ఉధృతమయ్యాయి. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి హర్మూజ్ జలసంధి కేంద్రంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్‌లోని బ్రిడ్జిలు, రవాణా మార్గాలపై అమెరికా వైమానిక దాడులను మరింత తీవ్రతరం…
- నేడు మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన.ప్రధాని మోదీ ఇవాళ మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. హర్యానా, పంజాబ్, చండీగఢ్‌లో ప్రధాని పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో వివిధ రాష్ట్రాల్లో రూ.26,800 కోట్ల ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. ప్రధాని మోదీ తొలి కార్యక్రమం హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 212501