నిజామాబాద్ జిల్లా కేంద్రంలో క్రీడాకారుల కోసం ప్రభుత్వం 106 సర్వే నెంబర్ లో 7 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది .2010 లో క్రీడాకారుల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేటాయించడం జరిగింది. క్రీడా ప్రాంగణం కోసం అని విధుల కేటాయింపు కోసం క్రీడాకారులు ప్రభుత్వాల చుట్టూ చెప్పులురిగేలా తిరుగుతూ స్థలాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు .దానిపై కన్నేసిన భూకబ్జాదారులు గత ప్రభుత్వ హయాంలో భూమి ఆక్రమణ కోసం ఫెన్సింగ్ చేయడంతో ఒలంపిక్ అసోసియేషన్ నాయకులు, క్రీడాకారులు, ప్రజాసంఘాలు ఉద్యమం చేయడంతో ఆనాడు క్రీడాస్థలమును భూ కబ్జాదారులు నుంచి కాపాడుకున్నారు.
తిరిగి మరల భూకబ్జాదారులు క్రీడా ప్రాంగణం కోసం కేటాయించిన స్థలముపై కన్నేసి భూ కబ్జాదారులు స్థలమును చదును చేయడాన్ని క్రీడాకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి క్రీడా ప్రాంగణం కోసం నిధులు కేటాయించి ప్రాంగణాన్ని పూర్తి చేయాలని క్రీడాకారులు కోరుతున్నారు. క్రీడాస్థలమును కబ్జా చేయడానికి రాజకీయ నాయకుల అండదండలతో ఎంత పెద్ద వారు వచ్చినా అడ్డగిస్తామని క్రీడాస్థలం కాపాడుకోవడం కోసం ఎన్ని ఉద్యమాలకైనా సిద్ధపడతామని హెచ్చరిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి క్రీడాకారుల కోసం కేటాయించిన స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని క్రీడా ప్రాంగణంను కాపాడాలనికబ్జాదారులను అడ్డుకున్న క్రీడాకారులు వారు డిమాండ్ చేస్తున్నారు .
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 91091