పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం బట్రుపాలెం గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. పొలాల మధ్య చిరుతపులి తిరుగుతుండడంతో. అటవీశాఖ అధికారులకు బట్రుపాలెం గ్రామస్థులు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు చిరుత సంచారంపై నిఘా పేట్టారు. ఇక గ్రామంలో చిరుత సంచరించడంతో బట్రుపాలెం గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలోని ప్రజలను జాగ్రత్తగా ఉండాలని, అటవీశాఖ అధికారులు సూచించారు.
palnadu
ఏపీలో చదువుకున్న విద్యార్థులను సీఎం జగన్ దారుణంగా మోసం చేశారని, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఎన్నికల ముందు చెప్పారని, జాబ్ క్యాలెండర్ సంగతి ఏమో కాని ప్రతి ఏడాది సాక్షి క్యాలెండర్ మాత్రం విడుదల చేస్తున్నారన్నారు. తెలుగు యువత పల్నాడు జిల్లా అధ్యక్షుడు కుమ్మెత కోటిరెడ్డి. పల్నాడు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో కోటిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పల్నాడు జిల్లా టీడీపీ పార్టీ , విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తే వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము అని దొంగ ప్రకటన విడుదల చేస్తారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని వాళ్లు ఈరోజు సీఎం జగన్ ని ఒక ద్రోహిగా చూస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిరుద్యోగ సమస్యలో దేశంలోనే నంబర్ వన్ గా మారిందన్నారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలనే చాలా తొలగించారన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు చూసైనా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేసారు.
Read Also..
పల్నాడు జిల్లా, చిలకలూరిపేట నియోజకవర్గం, నాదెండ్ల మండలం, తూబాడు, బుక్కాపురం గ్రామాలలో తుఫాన్ ప్రభావంతో పంట పొలాలను నష్టపోయిన రైతులను మంత్రి రజిని పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి రజిని మాట్లాడుతూ మించాగ్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని జగనన్న ప్రభుత్వంలో రైతును రాజుగా చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. పంట నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జగనన్న ప్రభుత్వంలో రైతుకు అన్ని విధాలుగా జగనన్న అండగా ఉంటారని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. కోనంకి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని సమీప బంధువులు విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపారు. మృతులను సాంబశివరావు, భార్య ఆదిలక్ష్మి, కుమారుడు నరేష్ గా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. హత్యలకు సంబంధించి ముప్పాళ్ల పీఎస్లో సాంబశిరావు కోడలు మాధురి, నిందితులు లొంగిపోయినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వివరించారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రవిశంకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గత ఏడాది ఏప్రిల్ లో నడికుడి రైల్వే స్టేషన్ లో మహిళపై దాడి చేసి రేప్ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఓప్పిచ్చెర్లకి చెందిన సుబ్బారావు, గురజాలకి చెందిన మాదిరాజు ప్రసాద్ ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర లోని తన అత్త గారి ఇంటి నుండి మధ్యప్రదేశ్ ఈస్ట్ నిమార్ జిల్లాలోని తన పుట్టింటికి వెళుతూ దారి తప్పి నడికుడి రైల్వే స్టేషన్ లో దిగిన మహిళపై నిందుతులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రజలకు పాలన మరింత చేరువ చేస్తూ పాలనా వికేంద్రీకరణ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పల్నాడు జిల్లా ఏర్పాటు…
- పిడుగురాళ్ల మండలం కామేపల్లిలో రూ. 500కోట్లతో 47.53 ఎకరాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు
- నాడు – నేడు క్రింద 32 పీహెచ్ సీల ఆధునికీకరణ.. కొత్తగా 7 పీహెచ్ సీ భవనాల నిర్మాణం….
- పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు రూ.200 కోట్లతో గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ఏర్పాటు
- ఇండో-ఇజ్రాయెల్ టెక్నాలజీతో సాగులో సరికొత్త విధానాలు, సాంకేతికతను తీసుకొస్తూ రూ. 10.69కోట్ల అంచనా వ్యయంతో 26 ఎకరాల విస్తీర్ణంలో నెకరికల్లులో ఉద్యానవన ఉత్పత్తి కేంద్రం
- 100 ఏళ్ల తర్వాత చేపట్టిన రీసర్వేలో భాగంగా జగనన్న భూహక్కు మరియు జగనన్న భూ రక్ష కార్యక్రమం ద్వారా 107 గ్రామాల్లో 5,35,866 ఎకరాల్లో రీసర్వే పూర్తి చేసి 2,72,000 హద్దు రాళ్ళు ఏర్పాటు, 88,542 మంది లబ్ధిదారులకు భూహక్కు పత్రాల జారీ..
- జిల్లా వ్యాప్తంగా 97 సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం..
జిల్లా వ్యాప్తంగా 32,624 మంది లబ్ధిదారులకు 90,864 ఎకరాల భూమి యాజమాన్య హక్కు పత్రాలు సీఎం చేతుల మీదుగా జారీ, నిషేధిత జాబితా నుండి చుక్కల భూములు మరియు సెక్షన్ 22 ఏ క్రింద నమోదైన భూముల తొలగింపు, పేదలకు అసైన్డ్, ఇనామ్, లంక భూములు, భూ కొనుగోలు పథకం క్రింది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేసిన భూములకు వర్తింపు
రోడ్లు, భవనాల శాఖ ద్వారా రూ. 278.28 కోట్ల వ్యయంతో పెదకూరపాడు వద్ద బ్రిడ్జి నిర్మాణంతో పాటు 6 రహదారుల పనులు.. - రూ.412.36 కోట్ల వ్యయంతో మాచర్ల – దాచేపల్లి (జాతీయ రహదారి నం. 167డి), నాగార్జున సాగర్- దావులపల్లి (జాతీయ రహదారి నం, 565), వాడరేవు – పిడుగురాళ్ల (జాతీయ రహదారి నం. 167 A), కొండమోడు – పేరేచర్ల (జాతీయ రహదారి నం. 167 AG) పరిధిలో 220.61. కి. మీ నిడివితో 4 జాతీయ రహదారుల నిర్మాణం.
ఈ 54 నెలల కాలంలో జిల్లా వ్యాప్తంగా సంక్షేమ పథకాల రూపంలో రూ.8,812 కోట్ల ప్రత్యక్ష
నగదు లబ్ధి(డీబీటీ) అందించటమే కాకుండా నాన్ డిబీటీ క్రింద రూ. 3,087 కోట్ల లబ్ధి
అందించిన జగనన్న ప్రభుత్వం.. మొత్తంగా డీబీటీ, నాన్ డిబీటీల ద్వారా 36,12,980 మంది
లబ్ధిదారులకు అందించిన మొత్తం లబ్ధి అక్షరాల రూ. 11,900 కోట్లు,,
కార్య రూపం దాల్చిన పల్నాడు ప్రజల 60 ఏళ్ళ కల – నేడు వరికపూడిసెల ఎత్తిపోతల పథకం ప్రారంభం
పల్నాటి సీమ రూపురేఖలను సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తూ నేడు (15.11.2023) పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపూడిశెల ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభం..
పల్నాడు, ప్రకాశం జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ, “వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ పథకం” క్రింద… రూ. 340.26 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి కీలక అటవీ, పర్యావరణతో పాటు అన్ని అనుమతులు సాధించి నేడు (15.11.2023) పనులకు శ్రీకారం చుట్టనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రూ. 340.26 కోట్ల వ్యయంతో వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు. బొదిలవీడు, గంగలకుంట, కండ్లకుంట గ్రామాల పరిధిలో 24,900 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 20 వేల మంది జనాభాకు తాగునీరు అందించనున్న జగనన్న ప్రభుత్వం రాష్ట్రంలో పూర్తిగా పైపులైన్ల ద్వారా నీరందించే తొలి ప్రాజెక్ట్ వరికెపూడిశెల 4 పంపుల ద్వారా 281 క్యూసెక్కుల నీటి సరఫరా.. • 1.57 టీఎంసీల నీటిని ఎత్తిపోసి 7 గ్రామాల్లోని 24.900 ఎకరాలకు సాగు నీరు.. 20,000 మంది జనాభాకు తాగునీరు. ఇప్పటికే అటవీ ప్రాంతంలో పంప్ హౌస్ నిర్మాణానికి నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్, అటవీ, పర్యావరణ విభాగాల నుండి కీలకమైన అనుమతులతో ఇక పనులకు శ్రీకారం వరికపూడిశెల ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నది జలాలను మళ్లించి వెనుకబడిన మెట్ట ప్రాంతాల ప్రజల కష్టాలు తీర్చనున్న జగనన్న ప్రభుత్వం వన్యప్రాణి సంరక్షణ అనుమతులు సాధించిన తేదీ 19 మే 2023 అటవీ అనుమతులు సాధించిన తేదీ 06 నవంబర్ 2023 ఈ అనుమతులతో అన్ని అడ్డంకులు తొలగి పనుల ప్రారంభానికి సిద్దమైన ప్రాజెక్టు వెనుకబడిన పల్నాటి సీమ అభివృద్ధికి జగనన్న ప్రభుత్వం చేపట్టిన చారిత్రాత్మక కార్యక్రమాలు ప్రజలకు పాలన నురింత చేరువ చేస్తూ పాలనా వికేంద్రీకరణ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పల్నాడు జిల్లా ఏర్పాటు…
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నాసిరకమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. రాగిపిండి తదితర పదార్థాలు ఎక్స్పైరీ డేట్ ముగిసినా వాటినే వాడుతున్నారు. స్థానికులు సైతం ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీనిపై సీవీఆర్ న్యూస్ కథనం అందించింది. దీనిపై స్పందించిన జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు కేసానుపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు.శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపామన్నారు ఫుడ్ ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు. రిపోర్టును జిల్లా ఉన్నతాధికారులకి అందచేస్తామని, తదుపరి చర్యలు కలెక్టర్ తీసుకుంటారని తెలిపారు.





Total views : 81000