నేడు వరంగల్ కు పవన్ కళ్యాణ్ రానున్నారు. హనుమకొండ బిజెపి అభ్యర్థి రావు పద్మ, వరంగల్ తూర్పు బిజెపి అభ్యర్థి ప్రదీప్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. జనసేన అధినేత వరంగల్ హంటర్ రోడ్ లోని సిఎస్ఆర్ గార్డెన్ వద్ద బిజెపి శ్రేణులు భారీగా సభ ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో పాల్గొననున్న బిజెపి, జనసేన, పవన్ కళ్యాణ్ అభిమానులు.
Pavan kalyan
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపటి నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి. 119 నియోజకవర్గాలకు గాను బీజేపీ 111, జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇటీవల ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు పవన్ పాల్గొన్నారు. ఇప్పుడు బీజేపీ, జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. రేపు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 25న తాండూరులో జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్, 26న కూకట్ పల్లిలో జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే సభలలోనూ పవన్ పాల్గొననున్నారు.
ఏలూరు జిల్లా చింతలపూడి ఎం హోటల్లో జనసేన టిడిపి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల ముఖ్య నాయకులు, నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి వచ్చిన జనసేన టిడిపి నాయకులు ఒకరికొకరు పరిచయం చేసుకొని, రెండు పార్టీల అధినేతల నుండి వచ్చే ప్రధాన అంశాలను ప్రజలలోకి తీసుకువెళ్లి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవడానికి కృషి చేస్తామని నాయకులు అన్నారు. ఈ సందర్భంగా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ 11 ను రెండు పార్టీలు కలిసికట్టుగా ప్రజలలో తీసుకువెళ్లి రాబోయే 2024 ఎన్నికల్లో ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకువస్తామని అన్నారు. జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మేకా.ఈశ్వరయ్య మాట్లాడుతూ చింతలపూడి ఎస్సి నియోజకవర్గం, కానీ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు కూడా చింతలపూడి నియోజకవర్గానికి ఇవ్వకుండా వైయస్సార్ ప్రభుత్వం చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందకుండా చేసిందని రాబోయే ఎన్నికల్లో జనసేన టిడిపి కలసి పనిచేసి ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మాగంటి బాబు, చింతలపూడి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు కోళ్ల. నాగేశ్వరరావు, చింతలపూడి టిడిపి మాజీ కన్వీనర్ జగ్గవరపు. ముత్తారెడ్డి, చింతలపూడి జనసేన మండల పార్టీ అధ్యక్షుడు చీదరాల. మధుబాబు తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లాలో అతిపెద్ద భూ యజమానిగా ఇండోసోల్ కంపెనీ నిలిచిందని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వైసీపీ నాయకులు 8,348 ఎకరాల భూమిని ఇండోసోల్ కంపెనీకి అన్న సంతర్పణగా చేశారని చేసిన ఆరోపణలను ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఖండించారు. పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్వి అసత్య ఆరోపణలు అని అభివర్ణించారు. పరిశ్రమలశాఖలో అభివృద్ధిని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాదెండ్ల మనోహర్ ముందు పరిశ్రమల శాఖపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మరోవైపు నాదెండ్ల మనోహర్‌కు వెన్నుపోటు వారసత్వంగా వచ్చింది. అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. నాదెండ్ల భాస్కర్ రావు అన్న నందమూరి తారక రామారావుకు వెన్నుపోటు పొడిస్తే పవన్ కల్యాణ్‌కు నాదెండ్ల మనోహర్ వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు. నాదెండ్ల మనోహర్‌కు అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం అలవాటుగా మారిందని అన్ని అంశాలపై అవగాహన తెచ్చుకుని మాట్లాడితే బాగుంటుందని లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు.
Read Also..
Read Also..
వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆకాంక్షించారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారని కాబట్టి ప్రజలు కూడా వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పెనకనమెట్ట గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంఖుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. వైఎస్ జగన్ నిరంతరం పేదల కోసం పరితపిస్తున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట వ్యాప్తంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమలు జరగుతున్నాయని చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహిళలను మోసం చేశాడని ఆరోపించారు. బంగారు రుణాలు మాఫీ అంటూ చేతులెత్తేశాడు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనలో పవన్ కల్యాణ్ పాత్ర కూడా ఉందని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను అన్ని అమలు చేశారు. అభివృద్ధి ఫలాలు ప్రతి గ్రామానికి అందిస్తున్నట్లు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఏ రాష్ట్రాల్లో కూడా అమ్మ ఒడి లాంటి పథకం లేదని చెప్పుకొచ్చారు. పేదల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం జగన్ రాష్ట్రానికి కావాలి. మళ్లీ ఆయనే సీఎం కావాలి అని ప్రజలంతా కోరుకుంటున్నారని మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. 2024లో పేదలకు-పెత్తందారులకు ఎన్నికలు జరుగుతున్నాయని పేదల తరపున పోటీ చేసి గెలిచే వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబును భుజానికి ఎత్తుకున్నాగెలిచేది వైఎస్ జగనే అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. తెలంగాణ గ్రామీణ ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్నారన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. తెలంగాణలో మాదిగలను మోసం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కులాలకు అతీతంగా … పేదరికాన్ని కొలమానంగా తీసుకొని రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చి తప్పు చేశారన్నారు. రెండు పార్టీలకు కలిపి ఐదు సీట్లకు మించిరావన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం లో డొక్కా సీతమ్మ మొబైల్ క్యాంటీన్ ద్వారా నిత్యం పేదల ఆకలి తీరుస్తున్నామని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళి కృష్ణ అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా డొక్కా సీతమ్మ క్యాంటీన్ లు ఏర్పాటు చేస్తామని చెప్పారని ఆ స్ఫూర్తి తో పేదల ఆకలి తీర్చిందుకు పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు నుండి ప్రారంభించిన ఈ మొబైల్ క్యాంటీన్ నిత్యం నరసాపురం బస్టాండ్ సెంటర్ లో ప్రయాణికులు, ఆటో,రిక్షా కార్మికులకు భోజనం సమకూరుస్తుమన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఇదిగా నడపడానికి అనేక మంది యువత సహకరిస్తున్నారని అన్నారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ స్ఫూర్తి తో వందలాది మంది ఆకలి తీరుస్తున్నమన్నారు.
Read Also..
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడిలో రెండో రోజు పల్లె నిద్ర కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు, వైఎపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో భాగంగా గుడిపూడిలో ఇంటింటి ప్రచారం చేశారు. స్ధానికులు, ముఖ్య నేతలతో సహపంక్తి భోజనాలు చేసారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు మరోసారి విరుచుకుపడ్డారు, పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ సీఎం, సీఎం అని అంటుంటే పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు సీఎం, చంద్రబాబు సీఎం అంటున్నారన్నారు, పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు తెలియవని, అతను రాజకీయాలకు పనికిరాడని అతను నమ్మి వెళితే కుక్కతోక పట్టుకొని గోదారి వీధినట్టేనని అంబటి విమర్శించారు, సంక్షేమ కార్యక్రమాలు అమలు కోసం జగన్ మళ్లి సీఎం కావలన్నారు.
పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామంలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పై అంబటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా వాళ్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. పవన్ కళ్యాణ్ సూట్ కేసులు తీసుకొని చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనుకుంటాడన్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో బిజెపికి ,ఏపీ లో తెలుగుదేశం పార్టీ కి సపోర్ట్ చేస్తారన్నారు . అక్కడ అలా ఇక్కడ ఇలా ఏమిటో ఎవరికి అర్థం కాదు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాడో తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు అంబటి.
టిడిపి జనసేన ఆత్మీయ సమ్మేళనాలు జిల్లాల వారీగా మూడు రోజులు పాటు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆత్మీయ సమ్మేళనం కాకినాడలో జరిగింది. తెలుగుదేశం పార్టీ తరపున ప్రతినిధిగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండు పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్తామని జగన్ కు తగిన బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా రవీంద్ర పేర్కొన్నారు. జగన్ అనే వైరస్ కు జనసేన, టిడిపి సరైన వ్యాక్సిన్ అని చెబుతున్న రవీంద్ర తో మా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్.





Total views : 91083