నెల్లూరు జిల్లా, సంగం మండలం తలుపురు పాడు గ్రామంలో దారుణ హత్య చోటుచేసుకుంది. ఆన్సర్ భాషా అనే వ్యక్తి బంగారు నగలు కోసం వృద్ధురాలు మస్తాన్ బీని గొంతు నులిమి హత్య చేశాడు. భర్త మస్తాన్ కి మద్యం తాపించి ఈ దారుణాని ఒడిగట్టాడు. తరువాత ఆన్సర్ ఇంట్లోకి వెళ్లి మస్తాన్ బి నిద్రపోతుండగా ముఖం పైన దిండితో నొక్కి అతి దారుణంగా హత్య చేసి ఇందులోని నగలు మొత్తం ఎత్తుకెళ్లిపోయాడు. సాధారణంగా అనుకున్న కుటుంబ సభ్యులు బంధువులు మస్తాన్ బిని దహన సంస్కారాలు చేసేసారు. అయితే భర్త ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇవాళ అన్సర్ పైన అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆన్సర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వృద్ధురాలిది హత్యగానే నిర్ధారించి విచారణ చేపడుతున్నారు.
Police
బాపట్ల జిల్లాలోని పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు పాఠశాల వాచ్ మెన్. పాఠశాలలో నూతనంగా నిర్మిస్తున్న భవనం రెండో అంతస్తులో అఘాయిత్యానికి పాల్పడినట్లు తోటి విద్యార్థినులు చెబుతున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి రాజశ్రీ ఫిర్యాదు మేరకు ఫోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు పోలీసులు చేస్తున్నారు.
ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ రైటర్ రమణ కుమార్ ఓ కేసు విషయంలో ఓ వ్యక్తి వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పత్తికోళ్ల లంక గ్రామానికి చెందిన రామ్ కుమార్ అనే వ్యక్తిపై ఎక్సైజ్ కేసు నమోదు అయింది. ఈ కేసులో స్టేషన్బైల్ నిమిత్తం స్టేషన్ రైటర్ రమణ 8000 రూపాయలను లంచంగా డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయించారు. ఇదే కేసులో బాధితుడి వద్ద నుండి 1000 రూపాయలను ఫోన్ పే ద్వారా డబ్బులు పొందిన నేపథ్యంలో ఏ ఎస్ ఐ వెంకటేశ్వరరావు పై కూడా కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
Read Also..
బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు ఆధారంగా చేవెళ్ల ఎంపీ, బీఆర్ఎస్ నేత రంజిత్ రెడ్డిపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తమ పార్టీకి చెందిన నేతలు, సర్పంచ్‌లను ఎందుకు కలుస్తున్నావని, ఎందుకు మాట్లాడుతున్నావంటూ అగౌరవంగా మాట్లాడారని, అసభ్యకరంగా మాట్లాడారని విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు జనవరి 17న రంజిత్ రెడ్డి తనకు కాల్ చేశారని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. రంజిత్‌రెడ్డిపై ఐపీసీ సెక్షన్ 504 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదు విషయంలో న్యాయ సలహా తీసుకున్నామని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ సతీష్ తెలిపారు. నాంపల్లిలోని మూడో ఏసీఎంఎం కోర్టును సంప్రదించగా పోలీసులకు కీలక సూచనలు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు ఉన్న సమయంలో జరిగిన ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఇల్లినాయ్ రాష్ట్రంలోని షికాగోలో రెండు ఇళ్లపై కాల్పులు జరిపిన ఓ దుండగుడు ఏడుగురి ప్రాణాలు తీశాడు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడని పోలీసు అధికారులు వెల్లడించారు. దుండగుడి కోసం వేట కొనసాగిస్తున్నామని తెలిపారు. నగరంలో జోలియట్‌లోని వెస్ట్ ఎకర్స్ రోడ్లో ఉన్న 2200 బ్లాక్‌లో ఈ కాల్పుల ఘటన జరిగిందని, నిందితుడిని రోమియో నాన్స్ గా గుర్తించామని, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని వివరించారు. రెండు ఇళ్లపై కాల్పులు జరిపాడని, మొత్తం ఏడుగురు మృత్యువాతపడ్డారని జోలియట్ పోలీసులు వెల్లడించారు.
నిందితుడు నాన్స్ కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలోనే నివసిస్తాడని తెలిపారు. ఎరుపు రంగు టయోటా క్యామ్రీ కారులో పరారైనట్టు భావిస్తున్నామని, అతడి వద్ద ఆయుధం ఉందని, అతడిని ప్రమాదకరంగా పరిగణించాలని అక్కడి పౌరులను జోలియట్ పోలీస్ డిపార్ట్మెంట్ అప్రమత్తం చేసింది. నాన్స్‌కు సంబంధించిన సమాచారం, అతడి జాడకు సంబంధించి ఏమైనా తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కాగా అగ్రరాజ్యం అమెరికా కాల్పుల ఘటనలతో వణికిపోతోంది. గణనీయ సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది మొదటి మూడు వారాల్లోనే 875 తుపాకీ కాల్పుల మరణాలు నమోదయినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న చిన్నయ్య అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు జెప్టోలో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నారని పోలీసులు. అతను రన్నింగ్ ట్రైన్ లో చైన్ స్నాచింగ్ చేస్తాడని గుర్తించామన్నారు. ఐదు చైన్ స్నాచింగ్ కేసుల్లో చిన్నయ్య నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి 14 తులాల నగలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రన్నింగ్ ట్రైన్ లో విండో నుంచి మహిళల మెడలో చైన్స్ స్నాచింగ్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. నిందితుడికి గంజాయి అలవాటు ఉందని తెలిపారు. డ్రగ్స్ కి బానిసై నేరాలు చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.
రంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆరు ట్రావెల్స్ బస్సుల్లో 30 కేజీల గంజాయిని తరలించేందుకు ప్రయత్నిస్తున్న10 మందిని అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో అందరూ యువకులే ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తీసుకువస్తున్నారని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లో గంజాయిని డోర్ డెలివరీ చేసేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
గుంటూరు పట్టణంలో వామపక్ష నేతలు, కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంగన్వాడీల సమస్యలను పరిష్కారించాలని రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వం ఎస్మాని విరమించుకోవాలని, డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులకు, వామపక్ష నేతలకు మధ్య వివాదం చోటుచేసుకుంది. అందోళన చేస్తున్న వారిని పోలీసులు స్టేషన్ కి తరలించారు.
నక్సలైట్లు అమర్చిన 15 కిలోల బాంబును సీఆర్పీఎఫ్ బలగాలు నిర్వీర్యం చేశాయి. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని పొటక్ పల్లి శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. 212 బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్, జిల్లా పోలీసు బలగాలు జాయింట్ ఆపరేషన్ చేసేందుకు తమ క్యాంప్ నుంచి బయలు దేరాయి. అయితే వారిని అంతమొందించడమే లక్ష్యంగా మావోయిస్టులు పొటక్ పల్లి , కిష్టాపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఐఈడీ అమర్చారు. బాంబు అమర్చినట్లు గుర్తించిన సీఆర్పీఎఫ్, జిల్లా పోలీసు బలగాలు వెంటనే ఐఈడీని డిఫ్యూజ్ చేశాయి.
Read Also..
Read Also..
ఆంద్రా-ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో పోలీస్ బలగాలను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు వేర్వేరు జిల్లాలో ఏర్పాటు చేసిన రెండు మందుపాతులను పోలీసులు గుర్తించి వాటిని నిర్వీర్యం చేశారు. సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. భీజాపూర్ జిల్లా చేర్పాల్ -గంగలూరు మార్గ మధ్యంలో పోలీసులను లక్ష్యంగా చేసుకొని అమర్చిన మందుపాతర ను బాంబు డిస్పోజల్ స్క్వాడ్ టీం తో గుర్తించి పోలీసులు నిర్వీర్యం చేశారు. అదేవిధంగా సుకుమా జిల్లా కిస్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పొటక్పల్లి. అటవీ ప్రాంతంలో పోలీసులను లక్ష్యం గా చేసుకొని అమర్చిన మందుపాతర ను కనుగొని నిర్వీర్యం చేసిన పోలీసులు. గాలింపు బలగాలు మావోయిస్టులు ఉచ్చులోంచి తప్పించుకున్నారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
Read Also..