స్పష్టమైన మెజారిటీతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలనపై దృష్టిసారించింది. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో వడివడిగా పాలనాపరమైన అడుగులేస్తోంది. ఈ క్రమంలో సీఎం క్యాంప్ కార్యాలయాన్ని జ్యోతిబా పూలే ప్రజాభవన్ నుంచి ఎంసీఆర్హెచ్ఆర్డీకి మార్చాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ప్రజాభవన్ సీఎం క్యాంప్ కార్యాలయంగా కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం అక్కడ ప్రజాదర్బార్ నిర్వహిస్తుండడంతో సీఎం క్యాంప్ ఆఫీస్‌ను మరో చోటకు మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎంసీఆర్హెచ్ఆర్డీలో గుట్ట మీద ఉన్న బ్లాక్‌లోకి మార్చాలని, ఈ మేరకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. సోమవారం ఎంసీఆర్హెచ్ఆర్డీ, ప్రభుత్వ ఉన్నతాధికారులతో భేటీ అయ్యి సీఎం క్యాంపు ఆఫీస్ తరలింపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఎంసీఆర్హెచ్ఆర్డీని సందర్శించారు. ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్‌ను ఎంసీఆర్హెచ్ఆర్డీకి తరలిస్తే రేవంత్ రెడ్డి నివాసానికి చాలా దగ్గర అవనుంది. సీఎం నివాసం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ప్రాంతంలో ఉంది. ప్రస్తుతం అక్కడి నుంచే ఇతర ప్రాంతాలకు ఆయన వెళ్తున్నారు. ఒకవేళ ఎంసీఆర్హెచ్ఆర్డీకి క్యాంప్ ఆఫీస్‌ను మార్చితే దూరం చాలా వరకు తగ్గనుంది. ఎంసీఆర్హెచ్ఆర్డీలో విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో అక్కడ తగిన వసతులు కూడా ఉన్నాయి. దీంతో అక్కడ ఏర్పాటు చేస్తే అన్ని విధాల సౌకర్యవంతంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.
political
పంచారామ క్షేత్రాలలో ఒకటైన కుమారస్వామి, భీమేశ్వర స్వామి ఆలయానికి టీటీడీ మాజీ చైర్మన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాపిరాజు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక మాసం చివరి సోమవారంలో స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో మూడు సార్లు చైర్మన్ గా పనిచేయడం భగవంతుడిచ్చిన వరంగా భావిస్తున్నానని కనుమూరి బాపిరాజు అన్నారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం లో ఎమ్మెల్యే గడ్డం వినోద్ మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఆరోగ్యశ్రీ పెంపు ద్వారా 10 లక్షల రూపాయల వరకు వైద్య సేవల పథకాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా వంద పడకల హాస్పిటల్ లో రిబ్బన్ కట్ చేశాడు. ప్రమాణ స్వీకారం అనంతరం గడ్డం వినోద్ నియోజవర్గం లో మొదటి పర్యటన సందర్బంగా భారీగా నాయకులు, కార్యకర్తలు శాలువాలతో, పూలమాలాలు వేసి సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజల తన పై విశ్వాసం తో గెల్పించారని.. బెల్లంపల్లి నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమం కోసం అహర్నీశలు కృషి చేస్తా అని తెలిపారు.
గిరిజన నేత, కేంద్ర మాజీ మంత్రి విష్ణు దేవ్ సాయిని ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించింది. రాష్ట్రంలో ఇంతవరకూ అతిపెద్ద నాయకుడిగా ఉన్న మాజీ సీఎం రమణ్ సింగ్‌కు అత్యంత సన్నిహతుడుగా విష్ణు దేవ్ సాయికి పేరుంది. 59 ఏళ్ల విష్ణు దేవ్ 2006లో పార్టీ ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అధ్యక్షుడుగా పని చేశారు. బీజేపీ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడుగా కూడా ఉన్నారు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్ర ఉక్కు శాఖ జూనియర్ మినిస్టర్‌గా పని చేశారు. కాగా, సీఎం ఎంపిక కోసం రాయపూర్‌లో ఆదివారం నాడు బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశమై విష్ణుదేవ్ సాయి పేరును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, సర్బానంద్ సోనోవాల్, పార్టీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ హాజర్యయారు. ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికార కాంగ్రెస్‌ను ఓడించి 54 సీట్లతో సంపూర్ణ మెజారిటీని సాధించింది. నార్త్ ఛత్తీస్‌గఢ్‌లోని కుంకూరి నియోజకవర్గం నుంచి విష్ణుదేవ్ సాయి పోటీ చేసి గెలుపొందారు.
జగన్ పాలనలో ప్రజలు అష్ట కష్టాలు పడి బ్రతుకు పోరాటానికి నానా తిప్పలు పడుతున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పి చంద్రబాబుకు పట్టం కడతారని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఉడి చెరువు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి ఓడి చెరువు నుంచి మద్దకవారిపల్లి వరకు20 కిలోమీటర్ల బైక్ ర్యాలీని నిర్వహించారు. ప్రజా కురుక్షేత్రంలో జగన్ ప్రభుత్వానికి ఓటమి తప్పదని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజలను నట్టేట ముంచి పైశాచిక ఆనందం పొందడంలో జగన్ కు సాటి మరెవరూ లేరని పల్లె విరుచుకుపడ్డారు. జనరంజక పాలనకు చంద్రబాబు రాష్ట్రానికి శరణ్యం అని పల్లె ఆశాభవం వ్యక్తం చేశారు. రాష్ట్రం పురోగమన దిశగా ముందుకు పోవాలంటే భావితరాలు పది కాలాలపాటు చల్లగా ఉండాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబును రాష్ట్ర ప్రజలు గెలిపించాలని పల్లె పిలుపునిచ్చారు. అనంతరం మద్దుగవారిపల్లికి చెందిన 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు వారికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు.
బీఎస్పీ అధినేత్రి మాయావతి తన రాజకీయ వారసుడ్ని ప్రకటించారు. తన రాజకీయ వారసత్వాన్ని మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ కొనసాగిస్తాడని వెల్లడించారు. లక్నోలో ఇవాళ జరిగిన బీఎస్పీ కార్యవర్గ సమావేశంలో మాయావతి ఈ ప్రకటన చేశారు. ఆకాశ్ ఆనంద్ వయసు 28 ఏళ్లు. 2017 యూపీ ఎన్నికలు, 2019 లోక్ సభ ఎన్నికల్లో మాయావతి ప్రచారం సాగిస్తున్న వేల ఆకాశ్ ఆనంద్ కూడా ఆమె వెన్నంటే ఉన్నారు. వారసత్వ రాజకీయాలను నిశితంగా విమర్శించే మాయావతి 2019లో తన సోదరుడు ఆనంద్ కుమార్ ను పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రకటించడం, ఇప్పుడు మేనల్లుడికి పార్టీ పగ్గాలు అప్పగించబోతున్నట్టు పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం చూస్తుంటే విమర్శలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Read Also..
Read Also..
హైదరాబాద్ తర్వాత అదే స్థాయిలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని ఉత్తమ నగరంగా తీసుకెళ్లడానికి కృషి చేస్తా అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు నియోజకవర్గ కేంద్రంలోని కాజీపేట డీజిల్ కాలనీ నుండి హన్మకొండ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యాలయం వరకు విజయయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మథర్ థెరిస్సా విగ్రహానికి, అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ ర్యాలీ లో భారీగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్యెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తన విజయం కోసం ప్రయత్నాలు చేసినా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు రుణపడి ఉంటానని ఎమ్యెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అని, నగర అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు. వరంగల్ నగర అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సిద్ధంగా ఉన్నారని అన్నారు. చాలా రోజుల తర్వాత ప్రజలు కోరుకున్న ప్రజా ప్రభుత్వం వచ్చిందని వరంగల్ పశ్చిమ ఎమ్యెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ టోర్నీకి రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉంటాడనే ప్రచారం జరిగినప్పటికీ తాజాగా బీసీసీఐ సెక్రటరీ జైషా చేసిన కామెంట్లు కొత్త అనుమానాలకు దారితీస్తున్నాయి. ఈ వరల్డ్ కప్ కు కెప్టెన్ ను ప్రకటించలేదని చెప్పారు. కెప్టెన్ ఎవరో చెప్పడానికి ఇంకా సమయం ఉందని జైషా తెలిపారు. టీ20 వరల్డ్ కప్ కెప్టెన్ ఎవరనే విషయం గురించి ప్రకటించడానికి ఇంకా సమయం ఉందని చెప్పారు. టీ20 వరల్డ్ కప్ కంటే ముందు ఐపీఎల్, ఆఫ్ఘనిస్థాన్ తో సిరీస్ ఉన్నాయని తెలిపారు. టీ20 ప్రపంచకప్ కెప్టెన్ ఇప్పటికిప్పుడు ప్రకటించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే పాలకులకు గుణపాఠం తప్పదని ఎన్నికల ఫలితాలు నిరూపించాయన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ విజయం ప్రజా విజయమని ధన బలం కన్నా ప్రజాబలం గొప్పదని నిరూపించారన్నారు. అహంకారంతో తమకు ఎదురులేదని విర్రవీగిన బీఆర్ఎస్ కు తగిన గుణపాఠం జరిగిందని అన్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ఇకపై ప్రజా భవన్ వీటిలో ప్రజా దర్బార్లు నిర్వహిస్తామని తెలిపారు. పాలకులు ప్రజా సేవకులు అనే విషయాన్ని మరువద్దని ఆయన గుర్తు చేశారు. చివరిగా కాంగ్రెస్ విజయానికి సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.
Read Also..
Read Also..
ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుటకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేయుటపై దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో భాగంగా ఆదివారం MCR HRD ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ సందర్శించారు. ఈ నేపథ్యంలో MCR HRD ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ DG డాక్టర్ శశాంక్ గోయల్ పుస్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. సంస్థ కార్యకలాపాల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా శశాంక్ గోయల్ ఆయనకు వివరించారు. అనంతరం ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను తెలుసుకున్నారు. సంస్థలోని వివిధ బ్లాకులను సోలార్ పవర్ వాహనంలో పర్యటించి పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభిృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు.