తిరుపతి జిల్లా వెంకటగిరి గుంటకట్ట సమీపంలోని కనకదుర్గమ్మ గుడిలో హుండీ చోరి గురైంది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దొంగ హుండీ తాళాలు పగులగొట్టి నగదు దోచుకెళ్లాడు. హుండీలో సుమారు 50 వేల రూపాయల నగదు ఉండొచ్చని అంచనా, అయితే ఈ ఆలయంలో చోరీ జరగడం ఇది వరుసగా మూడోసారి. తాజాగా జరిగిన ఈ దొంగతనం దృశ్యాలు గుడి సిసి కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.
political
నెల్లూరు ప్రజలకు ఎలాంటి ప్రకృతి విపత్తు సంభవించినా రాజకీయాలకతీతంగా సహాయ చర్యలు తీసుకున్నామని మాజీ మంత్రి, ఎమ్మల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. నగరంలోని 13 డివిజన్లో ఎమ్మెల్యే పర్యటించారు. గతంలో వరదలు వచ్చినప్పుడు తాను ప్రతిపక్ష సభ్యుడను అని చూడకుండా సహాయ చర్యలు ముమ్మరంగా చేపట్టానన్నారు. మిచాంగ్ తుఫాను బాధితులకు టీడీపీవారు ఆదుకున్న దాఖాలాలు లేవని ఎద్దేవా చేశారు. టిడిపి కి ఎప్పుడు కూడా దిగజారుడు రాజకీయాలు చేయడం అలవాటేనన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారన్నారు.
మహాలక్ష్మి పథకాన్నిజిల్లాలోని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సూచించారు. జగిత్యాల కొత్త బస్టాండ్ సమీపంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు పథకం పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళలకు ఉచిత ప్రయాణ టికెట్లు అందించారు. ఉచిత బస్సు ప్రయాణంతో వేలాది మంది ఆటో డ్రైవర్ల ఉపాధి గండి పడుతుందని వారికి జీవనభృతి కింద నెలకు 15వేలు ప్రభుత్వం తరుపున ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి విమానాశ్రయ నూతన టర్మినల్ విస్తరణ పనులకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేశారు. వేద మంత్రోత్సారణ మద్య కార్యక్రమం వైభవోపేతంగా కొనసాగిది. రూ.347.15 కోట్లతో టెర్మినల్ బిల్డింగ్ తదితర అభివృద్ధి పనులును ప్రారంభిచారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు గారు కేంద్ర మంత్రి ఎంపీ మార్గాన్ని భరత్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్ లో కేంద్ర మంత్రి జ్యోతి రాధిత్య సింధియా కు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి ఘన స్వాగతం పలికారు.
Read Also..
Read Also..
గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ పెదనందిపాడు మండలం వరగాని మూలమలుపు వద్ద ఓల్డ్ మద్రాస్ రోడ్డు పక్కన ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగలు పగలగొట్టారు. ఈ మూల మలుపు వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ట చేయకముందు రోజుకు ఒక ప్రమాదం జరిగి ఎవరో ఒకరు చనిపోతున్నారని గ్రామస్తులు అందరూ కలిసి విగ్రహం ప్రతిష్టించారు. ఇప్పుడు ఇలా జరగటం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అని, ఇలాంటి ఆకతాయి పనులు చేసిన వారిని పోలీసులు వెంటనే పట్టుకొని తగు శిక్ష విధించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Read Also..
నాగారం మండలం ప్రగతి నగర్ సమీపంలోని రఘురామ రైస్ మిల్లు నుండి వెలువడే పొగ, దుమ్ము, దూళితో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని మా గోడును ఎన్నిసార్లు వెల్లపుచ్చుకున్న పట్టించుకోకుండా మా ప్రాణాలతో చెలగాటమాడుతున్న రైస్ మిల్ యజమాన్యంపై కాలుష్య నివారణ బోర్డు నియమ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మిల్లు నుండి వెలువడే కాలుష్య వ్యర్ధాలు రాకుండా అరికట్టాలని ప్రశ్నించిన మాపై మహిళలని కూడా చూడకుండా చెప్పుతో కొడతానని దుర్భాషలాడి మీకు చేతనైనది చేసుకోమని, బెదిరింపులకు గురి చేస్తున్నారని, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లు నిండు వెలువడే కాలుష్యంతో కంటిచూపు సమస్యలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతూ 30 నుంచి 50 వేల రూపాయలు హాస్పటల్ కు ఖర్చు చేశామని అయినా ఆరోగ్యం కుదట పడడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రఘురామ రైస్ మిల్లు నుండి వెలుపడే కాలుష్యాన్ని నివారించి మాకు న్యాయం చేయాలని గ్రామస్తులు అధికారులను కోరారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. 18 నెలల అసిర్ అహ్మద్ అనే బాలుడు ఆటో కింద పడి మృతి చెందాడు. ఇంటి వద్దకు వాటర్ క్యాన్ వేయటానికి వచ్చిన ఆటో, ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడు అహ్మద్ ను గమనించకుండా ఆటో స్టార్ట్ చేయడంతో ప్రమాదవశాత్తు ఆటో కింద పడి బాలుడు మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు ఆటో కింద పడి మరణించాడని బాలుడి తండ్రి, తాత ఆరోపించారు. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు.
Read Also..
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. రేవంత్ వెంట మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ ఆస్పత్రికి వెళ్లారు. ఆసుపత్రికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ ఆసుపత్రి లోనికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షించారు. ఆయన కోలుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలపై సభలో కేసీఆర్ మాట్లాడాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా ఆసుపత్రి వద్ద బారీ భద్రత ఏర్పాట్లు చేశారు. గురువారం అర్ధరాత్రి ఎర్రవల్లి నివాసంలోని బాత్రూంలో కేసీఆర్ జారిపడటంతో ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. సోమాజిగూడలోని ఆస్పత్రి వైద్యులు ఆయనకు శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. తుంటి మార్పిడి తర్వాత కేసీఆర్ కోలుకుంటున్నారు.
Read Also..
Read Also..
రాష్ట్రీయ రాజ్‌పూత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ దారుణ హత్య కేసులో ఇద్దరు షూటర్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులతో పాటు వారి సహచరుడు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ, రాజస్థాన్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు లో రోహిత్ రాఠోడ్, నితిన్ ఫౌజీ అనే ఇద్దరు షూటర్లను చండీగఢ్‌లో అరెస్టు చేశారు. వీరితో పాటు మరో వ్యక్తి ఉద్ధమ్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ ఈ నెల 5న పట్టపగలు దారుణ హత్యకు గురయ్యారు. రాజస్థాన్ రాజధాని జైపుర్‌లోని శ్యామ్నగర్లో తన నివాసంలో ఉండగా దుండగులు కాల్పులు జరపడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. నిందితుల గురించి సమాచారం అందించిన వారికి రూ. 5 లక్షల రివార్డును కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే పరారీలో ఉన్న నిందితులు తమ ఫోన్లు వినియోగిస్తుండడంతో వారున్న లొకేషన్‌ను గుర్తించారు. అక్కడికి చేరుకుని ఈ కేసులో కీలక నిందితులను అరెస్టు చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి ఆయన వచ్చారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీసుకు వచ్చిన రాజగోపాల్ రెడ్డికి పలువురు నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.