అసోంలో బీజేపీ ప్రభుత్వం, రాహుల్ గాంధీ మధ్య వాడీవేడి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రంగంలోకి దిగారు. అసోంలో రాహుల్ గాంధీ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. అసోంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా రాహుల్ కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, అనేక భద్రతా లోపాలు వెలుగుచూశాయని ఖర్గే వివరించారు. ఆ మేరకు అనేక ఘటనలను తన లేఖలో ప్రస్తావించారు. ముఖ్యంగా, జనవరి 22న నాగావ్ జిల్లాలో రాహుల్ గాంధీ కాన్వాయ్ ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారని, వారు రాహుల్ గాంధీకి అత్యంత సమీపానికి వచ్చారని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ఓ జాతీయ స్థాయి నేత కాన్వాయ్ లోకి ఇతరులు చొరబడి సమీపానికి రావడం అత్యంత అభద్రతో కూడిన పరిస్థితి అని వివరించారు. ఇంత జరుగుతున్నా అసోం పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తూ ఉన్నారని, కొన్నిసార్లు పోలీసులే దగ్గరుండి బీజేపీ కార్యకర్తలను రాహుల్ కాన్వాయ్ లోకి పంపించారని ఖర్గే ఆరోపించారు. ఇప్పటివరకు అసోం పోలీసులు ఎవరినీ అరెస్ట్ చేయకపోవడం శోచనీయం అని పేర్కొన్నారు. రాహుల్ యాత్ర ముందుకు సాగేకొద్దీ ముప్పు అధికమవుతోందని, ఇకనైనా మీరు జోక్యం చేసుకోవాలని అమిత్ షాను కోరారు. రాహుల్ యాత్రకు తగిన భద్రత కల్పించేలా అసోం ముఖ్యమంత్రి, డీజీపీలకు దిశానిర్దేశం చేయాలని ఖర్గే తన లేఖలో విజ్ఞప్తి చేశారు.
Rahul Gandhi
ఏపీ నుండి బీజేపీకి ఒక్క ఎంపీని ప్రజలు గెలిపించలేదన్నారు APCC అధ్యక్షురాలు షర్మిల. కానీ ప్రభుత్వం మొత్తం బీజేపీ గుప్పెట్లో ఉందని ఆరోపణలు చేశారు. ఏపీ ఎంపీలు బిజెపికి బానిసలైపోయారన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం బీజేపీకి అమ్ముడు పోయిందంటూ మండిపడ్డారు. ప్రజలకు కాంగ్రెస్ శ్రేణులు చెప్పాల్సింది ఇదేన్నారు. మీరు ఓట్లు వేసింది ఒకరికి.. కానీ ఇప్పుడు ఏలుతుంది ఇంకొకరు అన్నారు. ఈ ప్రభుత్వం ఒక్క వాగ్ధానం కూడా నిలబెట్టుకోలేదన్నారు. వైసీపీ, టీడీపీలు…. బీజేపీకి ఊడికం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీని బతికించటం కాదు.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వద్దామన్నారు. రాహుల్ గాందీ మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతామని చెప్పారు.
భారత్ న్యాయ్ యాత్రలో భాగంగా అసోంలో పర్యటించిన పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ స్పాన్సర్డ్ గూండాలు దాడి చేశారని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అసోంలో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ బతద్రువ సత్ర ఆలయానికి వెళ్లాలని భావించారని.. అయితే అధికారులు అడ్డుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి పత్రికా ప్రకటనను విడుదల చేశారు. భారత్ న్యాయ్ యాత్రలో భాగంగా అస్సాంలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీపై స్థానిక బీజేపీ స్పాన్సర్డ్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాహుల్ యాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం, గుడి సందర్శనకు అనుమతి ఇవ్వకపోవడం శోచనీయం అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ధోరణి మంచిది కాదని… రాహుల్ భద్రత విషయంలో అసోం రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో ఆయన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్న కుట్రలు ఫలించవని గుర్తుంచుకోవాలన్నారు. మరింత మనోధైర్యంతో రాహుల్ ముందుకు సాగుతారన్నారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు అండగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ దేశ ప్రజల మద్ధతు ఆయనకు ఎప్పుడూ ఉందన్నారు. తెలంగాణ సమాజం కూడా రాహుల్ గాంధీకి అండగా ఉందని.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలకు అండగా నిలవాలని, పేదలకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో రాహుల్ గాంధీ తలపెట్టిన యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
భారత్ జోడో యాత్రతో పాదయాత్ర చేసిన కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తాజాగా మరో యాత్రకు సిద్ధమవుతున్నారు. భారత్ న్యాయ్ యాత్ర పేరుతో ‘మణిపూర్ నుంచి ముంబై’ యాత్ర చేపట్టనున్నారు. ఈమేరకు బుధవారం కాంగ్రెస్ పార్టీ ఈ యాత్ర షెడ్యూల్ ను విడుదల చేసింది. జోడో యాత్రక కొనసాగింపుగా చేపడుతున్న ఈ యాత్రను రాహుల్ గాంధీ బస్సులో చేస్తారని వెల్లడించింది. ఈ యాత్రలో భాగంగా మొత్తం 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాలను రాహుల్ గాంధీ కవర్ చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతారని కాంగ్రెస్ పేర్కొంది. తూర్పు నుంచి పశ్చిమానికి యాత్ర చేపట్టాలన్న ప్రతిపాదనలపై పార్టీ సీడబ్ల్యూసీ మీటింగ్ లో చర్చించి ఈ యాత్రకు రూపకల్పన చేసినట్లు తెలిపింది. ఈ యాత్రలో సుమారు 6,200 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ బస్సు యాత్ర చేపడతారని వివరించింది.
Read Also..
Read Also..
తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాదులోని ఎల్బి స్టేడియంలో ఘనంగా జరిగింది. కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల అభిమానులు కాంగ్రెస్ శ్రేణులు భారీగా రావడంతో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో కోలాహాల వాతావరణం నెలకొంది.
Read Also…
Read Also…
తెలంగాణలో రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కొలవుదీరనుంది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో వెల్లడిచింది. అయితే తెలంగాణలో మెుదటి ఉద్యోగం ఓ దివ్యాంగురాలికి ఇవ్వనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం నీకే ఇస్తామని ఈ ఏడాది అక్టోబరులో ఓ దివ్యాంగురాలికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభయ హస్తం అందించారు.
పీజీ పూర్తి చేసినా కూడా అటు ప్రైవేటులో, ఇటు ప్రభుత్వంలో ఎక్కడా ఉద్యోగం రాలేదని హైదరాబాద్ నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజినీ అనే అమ్మాయి రేవంత్ రెడ్డిని కలిసి తన ఆవేదనను వ్యక్తం చేసింది. రజినీ బాధను సావధానంగా విన్న రేవంత్ రెడ్డి.. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని.. ఆ సభకుసోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వస్తారని చెప్పుకొచ్చారు. అదే రోజున, వాళ్ల ముందే కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఉద్యోగం నీకే ఇస్తుందని రజనికీ హామీ ఇచ్చారు. ఇది తన గ్యారంటీ అని రేవంత్ స్పష్టం చేయటంతో పాటు స్వయంగా కాంగ్రెస్ గ్యారంటీ కార్డును రజినీ పేరుతో రాసి ఇచ్చారు.
రేపు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆమెకు తొలి ఇద్యోగం ఉచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు రేపు జరిగే ప్రమాణ స్వీకారకార్యక్రమానికి రజినీకి ఆహ్వానం పంపించారు. రేపు ప్రమాణ స్వీకారం అనంతరం ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిసింది.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా సిద్ధాంతపరమైన యుద్ధం కొనసాగిస్తామని ట్వీట్ చేశారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. దొరలకు, ప్రజలకు మధ్య జరిగిన యుద్ధంలో చివరికి ప్రజలే విజయం సాధించారని వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నట్టు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలిపారు. ప్రజలు తమ ఆకాంక్షలు నెరవేర్చుకునే దిశగా తమ ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బాధ్యతను గుర్తు చేశారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర ద్వారా తమలో స్ఫూర్తిని నింపారన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు తెలంగాణతో ఉన్నది రాజకీయ అనుబంధం కాదు… కుటుంబ పరమైన అనుబంధంమన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారం చేసిందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అన్నారు. పార్టీ గెలవడంలో కార్యకర్తల పాత్ర ఎంతో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా సాగుతున్న నేపథ్యంలో ఠాక్రే మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మంచి విజయం అందించారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ప్రచారం కలిసి వచ్చిందన్నారు.
ప్రజలు తమ ఆకాంక్షలు నెరవేర్చుకునే దిశగా తమ ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బాధ్యతను గుర్తు చేశారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర ద్వారా తమలో స్ఫూర్తిని నింపారన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు తెలంగాణతో ఉన్నది రాజకీయ అనుబంధం కాదు కుటుంబ పరమైన అనుబంధంమన్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ (60) ను సాధించిన నేపథ్యంలో, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ గాంధీభవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మాణిక్ రావ్ ఠాక్రేలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సెటైర్ వేశారు. హైదరాబాద్ రావడం బిర్యాని, పాన్ తిని ఢిల్లీకి వెళ్లడం తప్ప రాహుల్ చేస్తున్నదేమీ లేదన్నారు. ప్రతిసారి ఇలాగే తెలంగాణ ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్లిపోవాలని ఆమె సూచించారు. గాంధీ కుటుంబానికి అవసరమైనప్పుడల్లా తెలంగాణ అండగా నిలిచిన విషయాన్ని ఆమె బోధన్ ప్రచార ర్యాలీలో గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రతిసారీ తెలంగాణను మోసం చేశారని ఆరోపించారు. వందలాది మంది యువత బలి దానాలకు కాంగ్రెస్ పార్టీ కారణమన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్నాళ్లూ శాంతి భద్రతల సమస్య ఉండేదన్నారు కర్ఫ్యూలు, మతకల్లోలాలు ఉండేవని కవిత విమర్శించారు.





Total views : 90422