తెలంగాణ లోని స్థానిక ప్రజాప్రతినిధులకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధుల దుస్థితి గురించి రేవంత్ రెడ్డి లేఖలో వివరించారు. జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తనకు స్థానిక ప్రజాప్రతినిధుల ఇబ్బందులు తెలుసన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మీ అవస్థలు మీకు జరిగిన అవమానాలుగుర్తించానన్నారు. నిర్ణయాధికారం లేక, నిధులు రాక మీరు పడిన బాధలు గుర్తున్నాయన్నారు. ఈ ఎన్నికలతో కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుదామని పిలుపునిచ్చారు. జెండాలకు, అజెండాలకు అతీతంగా మీ పల్లె రుణం తీర్చుకునే అవకాశం కాంగ్రెస్ ఇస్తుందని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.
Revanth Reddy
కాళేశ్వరం ప్రాజెక్టు ఇసుక మీద కట్టకుండా రేవంత్‌రెడ్డి నెత్తిమీద కట్టాలా?
కాళేశ్వరం ప్రాజెక్టు ఇసుక మీద కట్టకుండా రేవంత్‌రెడ్డి నెత్తిమీద కట్టాలా?అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. బూతులు మాట్లాడే నాయకులు కావాలా? భవిష్యత్తు అందించే నాయకుడు కావాలో ఆలోచించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్‌లో భారాస అభ్యర్థి శంకర్‌నాయక్‌కు మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమైక్యవాదులు దండయాత్రకు వచ్చిన రోజు మానుకోట ప్రజలు తరిమికొట్టారని గుర్తు చేశారు. మానుకోట దెబ్బతో సమైక్య వాదులు వెనుకకు పరుగెత్తారని.. మళ్లీ వారంతా ఒక్కటై తెలంగాణ మీద దండెత్తడానికి వస్తున్నారన్నారు. వారికి మానుకోట దమ్మేంటో చూపించాలని కోరారు. శంకర్ నాయక్ నోరు కఠినమైనా.. సిద్దిపేట కంటే బాగా అభివృద్ధి చేశారన్నారు.
భాజపాకు వేసే ప్రతి ఓటుతో భారాసకు లాభం కలుగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఓట్ల చీలికతో భారాసకు ప్రయోజనం కల్పించడమే భాజపా ఉద్దేశమని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ సొంతూరు చింతమడకలో గుడి, బడి కట్టింది కాంగ్రెస్ హయాంలోనే. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను కేసీఆర్ మోసం చేశారు. గతంలో ఆయన్ను ఎంపీగా పాలమూరు నుంచి గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని విస్మరించారు. హైదరాబాద్-శ్రీశైలం హైవే వేసింది కాంగ్రెస్. సంగారెడ్డికి అధిక పరిశ్రమలను తెచ్చి ఉపాధి అవకాశాలను కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. దళితులు ఆత్మగౌరవంతో బతకాలని అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చాం. భాజపాకు వేసే ప్రతి ఓటూ మురిగిపోయినట్లే. ఈ ఎన్నికల్లో ఓట్లు చీలడానికి వీల్లేదు. భాజపా, భారాసలో ఎవరి పట్ల కనికరం చూపినా నష్టం తప్పదు…అని రేవంత్‌రెడ్డి విమర్శించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అజెండా ఒక్కటేనని, స్వలాభం కోసమే వాళ్లు పని చేస్తారని యూపీ సీఎం యోగి అదిత్యనాథ్ విమర్శించారు. వేములవాడలో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే కరోనా వ్యాక్సిన్ ఇచ్చేదా? పేదలకు ఉచితంగా కాంగ్రెస్ బియ్యం ఇచ్చేదా?అని ప్రశ్నించారు.ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అంటే కేసీఆర్ కు భయమని ఎద్దేవా చేశారు. యూపీలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటే డబుల్ ఇంజన్ స్పీడుతో ఉపాధి, శాంతిభద్రతలు కల్పించడం అని యోగి అన్నారు. తెలంగాణ పరిస్థితి మారాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలని అన్నారు.
తెలంగాణకు వచ్చినప్పుడల్లా ప్రజల్లో ఆశావాహ దృక్పథాన్ని చూస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ స్వార్థ పార్టీలని విమర్శించారు. తెలంగాణ ప్రజల్లో తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ అవినీతి పాలన వల్ల ప్రజల సామర్థ్యాలు వెలుగులోకి రావటంలేదని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే నాణేనికి రెండు ముఖాలని కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే బీఆర్ఎస్ కు వేసినట్లేనన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే నా లక్ష్యమని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే బీసీ వ్యక్తి సీఎం అవుతారన్నారు. మాదిగల వర్గీకరణకు కొత్తగా కమిటీని ఏర్పాటు చేశామని మోదీ వెల్లడించారు.
ఆదిలాబాద్ సభా వేదికపైకి వచ్చిన అమ్మాయి… కాంగ్రెస్ గ్యారెంటీలు ఆమెతో చదివించిన రాహుల్ గాంధీ
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదిలాబాద్‌లో నిర్వహించిన సభలో ఓ అమ్మాయి వేదిక పైకి రాగా… ఆమెతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను చదివించారు. అమ్మాయి వేదిక పైకి రాగానే హిందీలో చెప్పగలవా? అని రాహుల్ ఆమెను అడిగారు.. దానికి ఆ అమ్మాయి చెప్పగలనని తెలిపింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను హిందీలో చెప్పాలని సూచించారు. వరలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2500 ఇస్తామని, గ్యాస్ సిలిండర్ రూ.500కే ఇస్తామని, మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తామని ఆ అమ్మాయితో రాహుల్ గాంధీ చెప్పించారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడారు. తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కేవలం గ్యారెంటీ మాత్రమే కాదని, కాంగ్రెస్ గెలిచాక వీటిని చట్టాలలా చేస్తామని చెప్పారు. ప్రజల ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి కేబినెట్ సమావేశంలోనే వీటిని చట్టాలుగా మారుస్తామన్నారు.
ఎల్.బి నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ కు మద్దతుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ..
పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు తాకనివ్వద్దు. మధుయాష్కీ నాకు సోదరుడితో సమానం. ఆయన్ను ఎల్బీనగర్ లో 30వేల మెజారిటీతో గెలిపించండి. మూసీని ప్రక్షాళన చేసే బాధ్యత కాంగ్రెస్ ది. ముంపు ప్రాంతాల సమస్యను పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ ది. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం లో మధు అన్న ప్రత్యేక పాత్ర పోషిస్తారు. నన్ను ఆదరించి ఎంపీగా గెలిపించినట్లే మధు అన్నను గెలిపించండి. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసేదాంట్లో మధుయాష్కీ సంతకం ఉండబోతోంది. ఎల్బీనగర్ లో నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలను సుధీర్ రెడ్డి నట్టేట ముంచిండు. అభివృద్ధి ముసుగులో అమ్ముడు పోయిండు. మూసికి చైర్మన్ అయిన సుధీర్ రెడ్డిని ఈ ఎన్నికల్లో మూసీలో తొక్కాలి అని విజ్ఞప్తినిచ్చారు.
సకల జనుల విజయ సంకల్ప సభా హైదరాబాద్ పాతబస్తీలో గౌళిపుర డివిజన్ బీజేపీ లీడర్ జితేందర్ ఆధ్వర్యం లో సుధ టాకీస్ ఎదురుగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం లో చార్మినార్ నియోజక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధి మేఘ రాణి , బహదూర్ పుర బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధి , చంద్రయాన్ గుట్ట బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కౌడి మహేందర్ ల తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నరు. ఈ కార్య్రమానికి ముఖ్య అతిధి గా అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ విశ్వ శర్మ రావటం విశేషం ఆయనకు స్వాగతం పలికి శాలువా వేసి సన్మానించారు అయన సభా ను ఉద్దేశించి మాట్లాడుతూ తెరాసా , కాంగ్రెస్ మరియు mim అన్ని ఒక్కటే విరు పాతబస్తీ లో అభివృద్ధి పేరుతో దోచుకున్నారు ఈ సారి ఎన్నికలో మాకు అధికారం ఇవ్వండి అభివృద్ధి ఏమిటి అనేది చూపిస్తాను అభివృధి కేవలం బీజేపీ వల్లనే సాధ్యం అవుతుంది తెరాసా పాతబస్తీకి మెట్రో ఇవ్వలేదు వారు మాత్రం ఎదగారు ముస్లిం మహిళలకు తలక్ పేరుతో చేస్తున్న దానిని రద్దు చేసింది బీజేపీ నరేంద్ర మోదిగారు, కాశ్మీర్ లో 370 నీ రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం భారత దేశం ప్రగతి పదం లో నడుస్తున్నది దానికి కారణం బీజేపీ ప్రభుత్వం అస్సాం లో 700 మదరసాలు క్లోజ్ చేసి వాటిని స్కూల్స్ గా మార్చటం జరిగింది దాని వల్ల ఇక ముందు ముస్లిం పిల్లలు డాక్టర్లు , ఇంజినీర్ కావటానికి అవకాశాలు మిన్నగా ఉన్నాయి , ఉద్యోగాలు కల్పించింది బీజేపీ మాత్రమే అని అన్నారు.
మిమ్మల్ని చూస్తోంటే ఈసారి ఖచ్చితంగా గజ్వేల్ గడ్డపై జెండా ఎగరబోతుందన్న నమ్మకం కలుగుతోంది.రెండుసార్లు కేసీఆర్ ను ఎమ్మెల్యేను చేస్తే… మల్లన్న సాగర్ లో మిమ్మల్ని నిండా ముంచిండు.
కొండపోచమ్మలో మిమ్మల్ని తోసిండు, రంగనాయక్ సాగర్ లో ముంచిండు.రైతుల వడ్లు కొనని కేసీఆర్… ఆయన ఫామ్ హౌస్ లో పండిన వడ్లను కావేరి సీడ్స్ కు క్వింటా రూ.4500లకు అమ్ముకుండు..
కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఏమైనా బంగారం పండుతుందా?కేసీఆర్ ను మీరు పాతాళానికి తొక్కాలనుకుంటే.. కామారెడ్డికి పారిపోయిండు. కామారెడ్డికే కాదు.. కన్యాకుమారికి పారిపోయిన ప్రజలు నిన్ను ఓడించి తీరతారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ లో ఏర్పాటు చేసిన ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. జై తెలంగాణ అంటే తుపాకీతో కాలుస్తా అని రేవంత్ రెడ్డి అన్నారన్నారు. రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నాడని కాంగ్రెస్ నేతలే చెప్పారన్నారు. ఎమ్మెల్యేలను కొనేందుకు పోయి రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడన్నారు. చిప్పకూడు తిన్నా రేవంత్ రెడ్డికి సిగ్గు రాలేదన్నారు. కాంగ్రెస్ లో సీఎం పదవి కోసం 15 మంది పోటీ పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు రావన్నారు. రేవంత్ రెడ్డి పెద్ద భూకబ్జాదారుడన్నారు.





Total views : 91145