సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. లీక్ రాయుళ్లు ఉన్నారనే పక్కా సమాచారంతో ఆయన దగ్గర పనిచేస్తున్న పోలీసు సెక్యూరిటీ సిబ్బంది మొత్తాన్ని మార్చేయాలని నిర్ణయించింది. కేసీఆర్ వద్ద పనిచేసిన ఏ ఒక్క సెక్యూరిటీ సిబ్బంది, అధికారిని ఉంచొద్దని ఇంటెలిజెన్స్ భావిస్తోంది. సీఎం రేవంత్‌కు సంబంధించిన సమాచారం లీక్ అవుతోందని సెక్యూరిటీ సిబ్బంది, అధికారులను ఇంటెలిజెన్స్ మార్చినట్లు తెలుస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత వివిధ శాఖల చీఫ్‌లను మార్చివేశారు. తాజాగా సెక్యూరిటీ మొత్తాన్ని మార్చాలని సీఎంవోను ఐబీ ఆదేశించింది.
Security
ప్రజాపాలన, అభయహస్తం, ఆరు గ్యారంటీల పథకాలను ప్రజలు ఉపయోగించుకోవాలని ఎంపీపీ బోజ్యానాయక్ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిదిగుండం, నార్ల పూరు గ్రామాల్లో ప్రజా పరిపాలన అభయహస్తం ఆరు గ్యారంటీల పథకాల దరఖాస్తుల స్వీకరణ ఎంపీపీ భోజ్యనాయక్, చర్పంచ్ చిట్టెమ్మ, మాజీ సర్పచులు శారద లోకేశ్, రామన్ గౌడ్, ఎంపీడీఓ చెన్నమ్మ ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీల పథకాలను ప్రజలకు వివరించారు. దరఖాస్తులను ప్రజలకు అందజేసి దరఖాస్తులు నింపే విధానాన్ని పంచాయతీ సెక్రెటరీ గోపాల్ వివరించారు. గ్రామపంచాయతీ దగ్గర ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆరు గ్యారెంటీల పథకాలకు కౌంటర్లు ఏర్పాటు చేసి, మంచినీటి సౌకర్యాన్ని సర్పంచ్, ఎంపీపీ బోజ్యా నాయక్ ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు ఇబ్బంది కలగకుండా దరఖాస్తులను దగ్గరుండి నింపి, తప్పులు దొర్లకుండా ఆయన అధికారులు పరివేక్షించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు 6 గ్యారంటీ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రైళ్లలో ప్రయాణికుల భద్రతపై మరింత శ్రద్ధ వహించాలని, టిక్కెట్ల డైనమిక్ల ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రయాణికుల భద్రతకు కేంద్రం ప్రాధాన్యత ఇవ్వాలని, కొన్నిసార్లు రైలు ఛార్జీలు విమానా టికెట్ల కంటే ఎక్కువగా ఉంటున్నాయని విమర్శించారు. గత కొంతకాలం నుంచి రైళ్లలో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీల భారం పెరుగుతోందని, సువిధ రైళ్లలో కొన్ని సందర్భాల్లో విమాన టికెట్ కంటే ఎక్కువ ఉండటం విచారకరన్నారు. అంతంత ఛార్జీలు ఉంటే అత్యవసర సమయాల్లో సామాన్యులు రైళ్లలో ఎలా ప్రయణించగలదరని ప్రశ్నించారు.
‘ఛార్జీల పెంపును అరికట్టాలి, భద్రతా సమస్యలపై శ్రద్ధ పెట్టాలని, అలాగే, దేశంలో పెరుగుతున్న రైలు ప్రమాదాల సంఖ్య గురించిన ప్రస్తావించిన మమతా బెనర్జీ, తాను రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన ప్రమాదాల నిరోధక పరికరాలు, ఇతర చర్యలను ఎందుకు ఉపయోగించడంలేదని ప్రశ్నించారు. ప్రజలకు భారమయ్యే ఛార్జీలను అదుపు చేయకుండా, పెరుగుతున్న రైలు ప్రమాదాలను నివారించడానికి ఎందుకు ప్రయత్నం చేయడంలేదని సందేహం వ్యక్తం చేశారు.
Read Also..
Read Also..




Total views : 80934