తుఫాను సందర్భంగా ప్రస్తుతo తీరప్రాంతంలో నెలకొన్ని ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సముద్ర తీరంలో వనభోజన కార్యక్రమాలు వంటివి చేయకూడదు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం సముద్రంలోకి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. సముద్ర స్నానాలు పేరు చెప్పి సముద్రంలో దిగడం కూడా ప్రమాదకరం కాబట్టి అటువంటివి కూడా అనుమతించబడవు. సముద్రతీర ప్రాంతాల్లో ఇటువంటి వాటిని అనుమతించవద్దని జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే అన్ని శాఖల వారికి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. అదేవిధంగా ఈ ఉత్తర్వులను అమలు పరచవలసిందిగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులందరినీ ఆదేశించడమైనదని జిల్లా ఎస్పీ శ్రీ S. శ్రీధర్ గారు తెలిపారు.
srikakulam district news
రాష్ర్టంలో జగన్ ఆధ్వర్యంలో సిగ్గుమాలిన యాత్ర జరుగుతోంది. దళితులను , బిసిలను అవమానించే యాత్ర జరుగుతుంది. జగన్ అరాచకాలు , దోపిడీ, అత్యాచారం ప్రశ్నిస్తే , అలా ప్రశ్నించిన మహిళా నేతలపై అసబ్యకరంగా పొస్ట్ లు పెట్టించారు. ఆడబిడ్డలపై అసభ్య పొస్టులు పెట్టిన వారిపై నొ యాక్షన్. ఎమ్మెల్యే అదిరెడ్డి భవాని , గౌతు శిరీష , పంచుమర్తి అనురాధ లు పొలీసులకు పిర్యాధు చేస్తే పట్టించుకునే వారు లేరు. బిసి మహిళలను అవమానించి , రోతపుట్టించే రాతలు రాయించి , నా బిసిలు అని మాట్లాడటానికి సిగ్గుందా..? పేరుకే బిసి మంత్రులు , పెత్తనం అంతా రెడ్లదే..? జిల్లాలను సామంత రాజులుగా రెడ్లు పంచుకున్నారు. బొత్స , ధర్మాన , సీదిరి , తమ్మినేని రెడ్ల బూట్లు నాకడానికి తాపత్రయ పడుతున్నారు. వైసిపి ప్రేరేపితంగా హత్యగావింపబడ్డవారు 74 మంది బిసిలు, 28 మంది దళితులు ఉన్నారు. రజక , యాదవ , నాయిబ్రాహ్మన , మత్స్యకార , గీత కార్పోరేషన్ల ద్వారా సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించాం. మత్స్యకార పిల్లలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసాం. టిటిడి చైర్మెన్లుగా బిసిలకు పెద్ద పీట వేసింది టిడిపినే. వైసిపి రెడ్డిలకు మాత్రమే టిటిడి చైర్మెన్ చేసింది. అన్ని పధకాలలో అవినీతి చేసి వేసిన ఎంగిలి మెతుకలు అశపడాలా.? బిసి పధకాలు ముప్పై రద్దు చేసారు. ధర్మాన , బొత్స , తమ్మినేని నిజమైన బిసిలు కాదు. ఉత్తరాంధ్ర మంత్రులంతా బూర్జువా మంత్రులు. 12 యూనివర్సిటీలలో తొమ్మిది మంది విసిలు రెడ్లేనా? బిసి నాయకులపై తప్పుడు కెసులు పెట్టారు. బిసిలకు వెన్ను దన్నుగా ఉన్నారనే చంద్రబాబు పై కుట్ర చేసారు. బిసిలు బాగుపడితే జగన్ కు కడుపు మంట. బిసిల అత్మాభిమానం తాకట్టు పెడుతున్న వారిని బవిష్యత్ క్షమించదు. బిసిలకు అండగా ఉన్నారనే బాబు పై అక్రమ కేసులు పెట్టారు.
అధికార పార్టీ వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర శ్రీకాకుళం జల్లా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. సాధారణంగా ఇలాంటి సమావేశాలు, సభలు ఊరికి బయట ఖాళీ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకుంటారు. దానికి విరుద్ధంగా నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారుల్ని, సర్కిల్‌ను బ్లాక్ చేసేసి మరీ వేదికను ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలోని తుడ్డలిలో వైసీపీ చేపట్టిన సామాజిక బస్సు యాత్ర అరాచకమే సృష్టించిందని చెప్పవచ్చు. ప్రధాన రహదారిపై స్టేజి వేయటంతో పాలకొండ-రాయఘడ మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రెండువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
శ్రీకాకుళం జిల్లా జీ సిగడం మండలం సంతవురిటి గ్రామంలో వెలుగు చూసిన ఘటన అదే గ్రామానికి చెందిన సీతాలక్ష్మి తన అత్తమామల ఆస్తులను కొన్నేళ్లుగా సాగు చేస్తున్నారు అదే కుటుంబానికి చెందిన కొంతమంది ఎమ్మార్వో ని మచ్చిగా చేసుకొని విలునామా చేసుకొని 1B అడంగల్ తయారుచేసుకున్నారని ఆ భూములకు సంబంధించి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయని బాధితులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీరు (ఎస్.ఈ) మూర్తి వ్యవహార శైలి పై పంచాయతీరాజ్ ఇంజనీర్లు, కార్యాలయ సిబ్బంది నిరసన తెలిపారు. ఎస్ఈ కార్యాలయం ముందు రాత్రి బయటాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ ఉద్యోగుల జేఏసీ నాయకుడు కేసిహెచ్ మహంతి మాట్లాడుతూ… ప్రభుత్వ ప్రాధాన్య భవనాల నిర్మాణ విషయంలో తమపై తీవ్ర ఒత్తిడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడో 2019 నాటి వ్యయంతో ఇప్పుడు నిర్మాణాలు నిర్మించాలంటే ఎలా జరుగుతుందంటూ ప్రశ్నించారు. ఇప్పుడు భవన నిర్మాణ సామాగ్రి రేట్లు విపరీతంగా పెరిగాయి, కూలీ రేట్లు పెరిగాయి, అయినా వాటిని పెంచకుండా నిర్మాణాలు కొనసాగించాలని తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. జగన్ ఇల్లు నిర్మాణాలు, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు సకాలంలో నిర్మించకపోతే మీపై చర్యలు తీసుకుంటామని అధికారులు, జిల్లా కలెక్టర్ మమ్మల్ని వేధించడం తగదంటూ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా తమ బాధలను వినాలని జిల్లా పరిషత్ ఆఫీసు వద్దకు వస్తే ఎస్ఈ దొరకటం లేదని ఆరోపించారు. వారానికి ఒకరోజు కార్యాలయానికి రాని ఎస్ఈ వైఖరితో తాము ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. ఇప్పటికే ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేశారని, ఇంకా అందరిపై కూడా వేటు వేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టేందుకు కార్యచరణ రూపొందిస్తున్నామని తెలిపారు..