విజయవాడ, బుద్ధ వెంకన్న, టిడిపి ఉత్తరాంధ్ర ఇంఛార్జ్. కొడాలి నాని గుడివాడ పిచ్చికుక్క. కొడాలి నానికి రేబీస్ ఇంజెక్షన్లు చేయించాలి అని చాలా సార్లు చెప్పాను. జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు గుడివాడలో సభ పెడుతున్నారు. ఊరంతా తిరుగుతానని అంటున్నాడు కొడాలి నాని.. ఏం చేస్తాడో అని ఇంజెక్షన్లు కొన్నాను. నా సొంత డబ్బులతో 5 రేబీస్ ఇంజెక్షన్లు కొని గుడివాడ పార్శిల్ చేస్తున్నా. జనాల సేఫ్టీ కోసం ఇంజెక్షన్లు కొన్నాను. కొడాలి నాని రెండు కాళ్ళూ విరగొట్టి పొయ్యిలో పెడతా చంద్రబాబు ను తిడితే. కొడాలి నానికి ఇంజెక్షన్లు చేయించాలని గుడివాడ ప్రజలకు విజ్ఞప్తి. తెలంగాణ ఉద్యమ సారధి నేను. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ దీక్షలు పూనింది నేను. కేశినేని నాని ఆఫీసు బోర్డులపై బుద్ధ వెంకన్న కామెంట్లు కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ పేటెంట్ రైట్స్ నావి, చంద్రబాబు వి. కనకదుర్గ ఫ్లైఓవర్ మేమే పెట్టామని బోర్డులు పెట్టుకుంటే అదంతా అభూతకల్పన. మరో నలుగురైదుగురికి రేబిస్ ఇంజెక్షన్లు పంపాలి. డబ్బులు టైట్ గా ఉన్నాయి చూసుకుని పంపిస్తా. ఉషశ్రీ, శంకరనాయక్, కాపు రామచంద్రారెడ్డి, పార్థసారథి లాంటి బలహీన వర్గాలనే టార్గెట్ చేస్తున్నారు. బలహీన వర్గాలు చంద్రబాబు కు కొమ్ము కాస్తున్నారని టార్గెట్. బిసి బస్సు యాత్రలో మొత్తం రెడ్లే. I am BC… చంద్రబాబు కు బిసిలు కమిట్మెంట్ గా ఉంటారు.
Tdp
విజయవాడ, కేశినేని భవన్ రూపురేఖలు పూర్తిగా మార్పు. నిన్నటివరకూ చంద్రబాబు, కెసినేని నాని, కేశినేని శ్వేత ఫ్లెక్సీ లతో పసుపుమయంగా ఉన్న ఎంపీ ఆఫీస్. పూర్తిగా పసుపు ఫ్లెక్సీలు తొలగింపు. పార్టీలతో సంబంధం లేకుండా ఐ లవ్ విజయవాడ టైటిల్ తో ఫ్లెక్సీలు ఏర్పాటు. బెజవాడ లో నిర్మించిన మూడు ఫ్లై ఓవర్ ల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీ ల ఏర్పాటు. ఎన్టీఆర్ ఫోటో తో పాటు కేశినేని నాని, శ్వేత ఫోటోలు మాత్రమే ఉండేలా ఫ్లెక్సీల ఏర్పాటు.
విజయనగరం జిల్లా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన. బొబ్బిలి వేదికగా బహిరంగ సభ. తెలుగు తమ్ముళ్లలో నూతనుత్తేజం కనిపిస్తోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈరోజు జిల్లాకు రానున్నారు. బొబ్బిలిలోని రాజా కాలేజి మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఆ పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. తెలుగు తమ్ముళ్లను భారీగా తరలించేందుకు పార్టీ నాయకులు సన్నాహాలు చేశారు. ఇప్పటికే గ్రామ స్థాయిలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికల వాతావరణం దగ్గరపడడంతో ప్రచారం ముమ్మరం చేయనున్నారు. ఇందులో భాగంగానే ‘రా… కదిలి రా’ అనే కార్యక్రమంలో భాగంగా అధినేత చంద్రబాబు మరోసారి జిల్లాకు వస్తున్నారు. ఇటీవలే భోగాపురం మండలం పోలిపల్లిలో నిర్వహించిన యువగళం విజయోత్సవ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ఎన్నికల శంఖారావం పూరించారు. ఈసారి బొబ్బిలి వేదికగా విజయనగరం – పార్వతీపురం మన్యం జిల్లాల కేడర్‌కు బాబు దిశానిర్థేశం చేయనున్నారు. బొబ్బిలి కేంద్రం ఈ రెండు జిల్లాలకు సమాంతర దూరంలోనూ, పార్టీకి కాస్త బలమైన నియోజకవర్గంగాను గుర్తించిన పార్టీ ఇక్కడ సభ నిర్వహించేందుకు నిర్ణయించినట్టుగా టిడిపి నాయకులు చెబుతున్నారు. బాబు వరుస పర్యటనలతో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో జోష్ కనిపిస్తోంది. విజయనగరం, బొబ్బిలి, రాజాం, చీపురుపల్లి నియోజకవర్గాల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గజపతినగరం, నెల్లిమర్ల, ఎస్.కోట నియోజకవర్గాల టికెట్ల పై కూడా కసరత్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లోని ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. బహిరంగ సభకు వస్తున్న నేపథ్యంలో బాబు దృష్టిలో పడేందుకు కూడా తహతహలాడుతున్నారు. గత నెల 20న పోలిపల్లి బహిరంగ సభ మాదిరిగానే దారిపొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నేడు జరగనున్న బహిరంగ సభల్లో కేడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేయడం, వైసిపిలోనూ, ప్రభుత్వంలోనూ లోపాలను, వైసిపి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను, అమలుకాని హామీలను ఎత్తి చూపడమే బాబు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
బుధవారం ఉదయం 10.15గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టులో బయలుదేరి, 11గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బొబ్బిలి రాజా కాలేజీ మైదానానికి 11.40గంటలకు చేరుకుంటారు. 12గంటలకు సభ ప్రారంభమై 1.30గంటలకు ముగుస్తుంది. అనంతరం 2.30గంటలకు తిరుగు ప్రయాణమవుతారు. మిగిలిన గంట వ్యవధిలో పార్టీ కీలక నాయకులు, కార్యకర్తలతో జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. బహిరంగ సభ ఏర్పాట్లును మంగళవారం టిడిపి నాయకులు కిమిడి కళా వెంకటరావు, మాజీ మంత్రి సుజరుకృష్ణరంగారావు, నియోజకవర్గ ఇన్చార్జి బేబినాయన, కూన రవికుమార్ తదితరులు పరిశీలించారు..
విజయవాడ, ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నిర్వహణ పై రెండో రోజు కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష. నిన్న గుర్తింపు పొందిన పార్టీల నుండి వినతుల స్వీకరణ చేపట్టిన సీఈసీ రాజీవ్ కుమార్. విడతలవారీగా కలెక్టర్లు, ఎస్పీలు , ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల సన్నద్దత పై అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఈసీ. నేడు పార్టీలు ఇచ్చిన వినతులు, ఫిర్యాదుల పై, ఎన్నికలకు అధికార యంత్రాంగం ఉన్నతస్దాయి చర్చ జరుపనున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం.
అన్నమయ్య జిల్లా, సివిఆర్ న్యూస్ ఛానల్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన పలువురు నేతలు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోనీ పలువురు ప్రముఖులు తమ కార్యాలయాలలో 2024 సివిఅర్ న్యూస్ ఛానెల్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించి సివిఆర్ న్యూస్ వీక్షకులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుంటూ, నిజాలను నిర్భయంగా ప్రసారం చేస్తూ ప్రజల ఆధారభిమానాలు పొందుతూ ఇలాగే కొనసాగాలి అన్నారు. ఈ కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో విరజిల్లాలని వారు ఆకాంక్షించారు. ఆవిష్కరించిన ప్రముఖులు టిటిడి పాలక మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు, వైసిపి విభాగం మైనార్టీ జిల్లా అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్, వైకాపా సీనియర్ నాయకులు,మాజీ ఎంపిపి పోలు సుబ్బారెడ్డి, ప్రతిభా జూనియర్ కళాశాల కరస్పాండెంట్ అరమాటి శివగంగి రెడ్డి,తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు బోనమాల ఖాదర్ వలీ, అన్నమయ్య కన్స్ట్రక్షన్ అరమాటి జంగం రెడ్డి.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఫిర్యాదు నేపథ్యంలో, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పై హైదరాబాదులో కేసు నమోదైంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ గురించి అసత్య వ్యాఖ్యలు చేశారంటూ మల్లు రవి బేగం బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారాయణస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్ మరణానికి కారణం సోనియా గాంధీ, చంద్రబాబేనని నారాయణస్వామి ఇటీవల షర్మిల కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను మల్లు రవి తప్పుబట్టారు. ఉమ్మడి ఏపీ సీఎంగా వ్యవహరించిన వైఎస్సార్ కు సోనియా ఎంతో ప్రాధాన్యతనిచ్చారని పేర్కొన్నారు. వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైనప్పుడు సోనియా ప్రత్యేకంగా విమానాలు పంపించి వెతికించారని తెలిపారు.
ప్రతికూల వాతావరణం వల్లే హెలికాప్టర్ ప్రమాదం జరిగిందన్న విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గ్రహించాలని మల్లు రవి హితవు పలికారు. నారాయణస్వామి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
Read Also..
అమరావతి, నేడు కేంద్ర ఎన్నికల సంఘ ప్రతినిధులను కలవనున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్. ఎన్నికలలో వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను వాడకూడదని ఫిర్యాదు. ఇప్పటికే టీడీపీ, జనసేన సానుభూతిపరుల ఓట్ల తొలగింపు పై ఫిర్యాదు చేసిన ప్రతిపక్షాలు. ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా టీడీపీకి లేఖ రాసిన ఈసి. మరి కొన్ని ఫిర్యాదులు పరిష్కరణ దశలో ఉన్నాయని వెల్లడి. ఉమ్మడిగా ఫిర్యాదు చేయనున్న పవన్, చంద్రబాబు. వాలంటీర్లు అసలు ఉద్యోగులే కాదని చెబుతున్న వైసీపీ. సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులని వెల్లడి. ఎన్నికలలో ప్రభుత్వ ఉద్యోగులను వాడకూడదని ఎలా చెబుతారని అంటున్న వైసీపీ. ఉదయం చంద్రబాబు పవన్ భేటీ తర్వాత ఈసీ ని కలిసే అవకాశం. ఈసీకి ఫిర్యాదు చేయాల్సిన అంశాలపై ముందుగా చర్చించునున్న ఇరువురు నేతలు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈసీ తో సమావేశం.
విజయవాడ, ఎమ్మెల్యే రామ మోహన్, ఆయన సతీమణి కృష్ణా జిల్లా జెడ్పి మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ తో భేటీ అయిన కేశినేని శ్వేత. రాజీనామా కారణాలు, తండ్రి కేశినేని నాని కి సంబందించిన అంశాలపై చర్చ. సుమారు అరగంట నుంచి ముగ్గురూ భేటీ. విజయవాడ 11 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ గా ఉన్న శ్వేత. కాసేపట్లో తన పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత టీడీపీకి రాజీనామా. ఎంపీ కేశినేని నాని వ్యవహారంలో ముందుగా రాజీనామా చేస్తున్న ఆయన కుమార్తె శ్వేత. గత మున్సిపల్ ఎన్నికల్లో శ్వేత కు మేయర్ పదవి విషయంలో మొదలైన కేశినేని నాని అసంతృప్తి. టీడీపీ గెలిస్తే శ్వేత కు మేయర్ పదవి ఇవ్వాలని పట్టుబట్టిన ఎంపీ నాని. శ్వేత కు మేయర్ పదవి ఇవ్వొద్దని వ్యతిరేకించిన మరో వర్గం. అప్పటినుంచి అధిష్టానం, వ్యతిరేక వర్గంపై విమర్శలు మొదలు పెట్టిన ఎంపీ నాని. రెండు రోజుల క్రితం తాను రాజీనామా చేస్తానని ప్రకటించిన ఎంపీ. ముందుగా తన కూతురు శ్వేత చేత రాజీనామా చేయిస్తున్న నాని.
విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 11వ డివిజన్ కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. కేశినేని నాని నిర్ణయంతో ఈరోజు కార్పొరేటర్ పదవికి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. ఈరోజు ఉదయం 8:30 గంటలకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యాలయానికి వెళ్లి గడిచిన కార్పొరేషన్ ఎన్నికల్లో తనకు సహకరించినందుకు ధన్యవాదాలు చెబుతారు. 9 గంటలకు అక్కడ కార్పొరేషన్ పరిధిలో తనకు సహకరించిన వారికి ధన్యవాదాలు చెబుతారు. 10:30 గంటలకు విజయవాడ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి మేయర్ మున్సిపల్ కమిషనర్‌ను కలిసి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా ఇచ్చి ఆమోదింప చేయాలని కోరుతారు.
టిడిపి అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆచంటలో నిర్వహిస్తున్న తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా కార్యక్రమానికి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుండి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పొత్తూరి రామరాజు కొవ్వలి యతీరాజ రామమోహన్ నాయుడు ఆధ్వర్యంలో టిడిపి కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా టిడిపి ఇన్చార్జ్ పొత్తూరి రామరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలందరూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని అందుకు ఆచంటలో నిర్వహించే తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా కార్యక్రమం వేదిక అవుతుందని ఆయన అన్నారు. టిడిపి సీనియర్ నేత కొవ్వలి యతిరాజు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా కార్యక్రమానికి వెళ్లేందుకు నరసాపురం నియోజకవర్గంలోని ఆయా గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవుతారని తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.