ఘట్కేసర్ మండలం మాజీ ఎంపీపీ యాట కుమార్ కుటుంబానికి దర్గా దయాకర్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వ హయాంలో యాట కుమార్ ఘట్కేసర్ మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గతంలో టీడీపీ సీనియర్ నాయకుడైన తోటకూర జంగయ్య యాదవ్ తో కలిసి పార్టీ కార్యక్రమానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో యాట కుమార్ మృతి చెందాడు. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా కుమార్ భార్య(రేణుక) కూడా మృతి చెందింది. యాట కుమార్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులను ఇద్దర్నీ కోల్పోయిన పిల్లల బాధ్యత ఇప్పటివరకు బంధువులు చూసుకుంటున్నారు.
Tdp
రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్‌లో నిప్పులు పోశారని, ఈ రెండింటిని చూస్తే ఎంతో బాధ కలుగుతోందని ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే హైదరాబాద్‌కు ధీటుగా అమరావతిని అభివృద్ధి చేయగలరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు లాంటి దూరదృష్టి ఉన్న నాయకుడికి ఈసారి పట్టాభిషేకం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఏపీకి రెండోసారి సీఎం అయ్యి ఉంటే రాజధాని అమరావతిని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దేవారని అన్నారు.
వైయస్సార్సీపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దాదాపు నాలుగున్నర సంవత్సరంలో పేదలు, రైతులు ఇలా ఒకరిని కాకుండా ఎవరిది పడితే వారిది అక్రమంగా భూములు లాక్కొని తమ బినామీలకు సొంతం చేశారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ఆరోపించారు టిడిపి శ్రీకాళహస్తి ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని అన్ని మండలాలలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తమ అనుచరులతో బినామీల రూపంలో కోట్లకు పడగలెత్తారని, పేద రైతుల డీకేటీ పట్టాలు ఉన్న వాటిని రైతులను బెదిరించి భయభ్రాంతులకు గురిచేసి తమ అనుచరుల పేరుమీద అక్రమంగా రాయించుకుంటున్నారని ఆరోపించారు. ఒక్క రేణిగుంట మండలంలోనే దాదాపు 500 కోట్లకు పైగా భూకబ్జాకు పాల్పడ్డారని ఆధారాలతో సహా తమ వద్ద ఉన్నాయని అన్నారు. ఇందులో అధికారులకు అందరికీ పాత్ర ఉందని దీనిపై ప్రజలు ముందుకు వచ్చి పోరాడితే కానీ న్యాయం జరగదని, మీడియాను సైతం భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని మండి పడ్డారు.
వైసీపీ ప్రభుత్వ అరాచక, విధ్వంసక పాలన నుండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించడమే తెలుగుదేశం జనసేన పార్టీల లక్ష్యమని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు తెదేపా ఇంచార్జ్ వనమాడి కొండబాబు, జనసేన ఇంచార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. తెలుగుదేశం – జనసేన ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురువారం ముఖ్య నాయకులతో తెలుగుదేశం, జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎజెండా, పార్టీ కార్యక్రమాలు, ఓటర్ వెరిఫికేషన్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అరాచక పాలనపై పోరాటం చేస్తున్న చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు బనాయించి జైల్ లో నిర్బంధించిన తరువాత పవన్ కళ్యాణ్ తో ములాఖత్ లో చంద్రబాబు ను కలిసి వైసిపి ప్రభుత్వం అరాచక పాలనపై తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి పోరాటం చేయడం జరుగుతుందని ప్రకటించారని, వైసీపీ ప్రభుత్వ అరాచక, అవినీతి, అసమర్ధత పాలనపై ఉమ్మడి కార్యచరణతో పోరాటం చేయడం జరుగుతుందని, దానిలో భాగంగా 17 వ తేదీ నుండి తెదేపా జనసేన కలిసి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ నెల 18,19 తేదీలలో రాష్ట్రంలో అద్వానంగా తయారైన రోడ్లు దుస్థితిపై టీడీపీ, జనసేన ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ ముత్తా శశిధర్ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల నుండి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించడమే లక్ష్యంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ, జనసేన ఉమ్మడిగా ఎన్నికలకు వెళతామని ప్రకటించారని, నాటి నుండి టీడీపీ, జనసేన కలిసి సమన్వయoతో కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించడం జరిగిందని, ఆ విధంగా ఉమ్మడి ఎజెండాను ప్రజలలోకి తీసుకువెళ్లడం జరుగుతుందని, టీడీపీ, జనసేన నాయకులు కార్యకర్తలు సమన్వయoతో ఉమ్మడి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
Read Also..
టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య నివేదికపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు చర్మవ్యాధులను కూడా ప్రాణాంతక వ్యాధులుగా చెప్పే ప్రయత్నం చేశారని విమర్శించారు. బయటికి వచ్చి చికిత్స చేయించుకోండి అని కోర్టు మానవతా దృక్పథంతో ఆదేశాలు ఇస్తే బయటికి రాగానే 14 గంటలకు పైగా ప్రయాణం చేశారని వెల్లడించారు. అడుగడుగునా కార్యకర్తలు వచ్చే వరకు వేచి ఉంటూ, లేకపోతే కార్యకర్తలు ముందే వచ్చేలా ఏర్పాటు చేసుకుని సాయంత్రం బయల్దేరితే మరునాటి ఉదయం ఇంటికి చేరుకున్నారని విమర్శించారు. రాజమండ్రి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లాల్సి ఉన్నా, వారి డాక్టర్లు హైదరాబాదులోనే ఉన్నా చంద్రబాబు ఇక్కడికి వచ్చి, ఇట్నుంచి హైదరాబాద్ వెళ్లారని సజ్జల వివరించారు. ఇలాంటివి చూసినప్పుడు సహజంగానే ఏదో ఒకటి అంటారు. ఏదైనా అంటే మాత్రం బుద్ధుడు అంతటివాడ్ని పట్టుకుని మాటలు అంటారా అని కోపాలు వస్తాయి. సరే హైదరాబాద్ వెళ్లారు. కానీ అక్కడ చేసిందేమిటి? కంటికి శస్త్రచికిత్స చేయించుకునేందుకు బెయిల్ పొంది రాజకీయ భేటీలు నిర్వహించారు. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ వచ్చుంటే ఆయన ఏం చేసినా మేం అడగం. ఇప్పుడు కంటికి శస్త్రచికిత్స చేయకపోతే కళ్లు పోతాయని, చర్మవ్యాధులకు చికిత్స చేయకపోతే గుండె ఆగిపోతుందన్నట్టు నానా యాగీ చేసి బెయిల్ తెచ్చుకున్నారు అంటూ సజ్జల విమర్శలు చేశారు. అరెస్ట్ కాకముందు సభల్లో వయసు తనకో సమస్య కాదన్న చంద్రబాబు అరెస్టయ్యాక వయసు, వ్యాధులను ప్రస్తావించడాన్ని ఏమనాలని సజ్జల ప్రశ్నించారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ చేపట్టారు. కొద్దిసేపటి కిందట వాదనలు పూర్తయ్యాయి. స్కిల్ కేసులో సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఎన్నికల ముంగిట చంద్రబాబును కక్షపూరితంగా అరెస్ట్ చేశారని లూథ్రా వాదించారు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కోర్టుకు వివరించారు. చంద్రబాబును ఇరికించడం కోసమే ఫోరెన్సిక్ రిపోర్టు తయారు చేశారని లూథ్రా ఆరోపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో ఉంచింది.
రాష్ట్రాభివృద్ధిని ధ్వంసం చేసి, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన సైకో జగన్ పాలన అంతమే తమ అంతిమ లక్ష్యం అని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి, జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. టిడిపి, జనసేన పార్టీల సమన్వ కమిటీ సమావేశం ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా బడేటి చంటి, రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి రాష్ట్రంలోని రాక్షస పాలన అంతం చేయాలన్నారు. విజన్ ఉన్న నాయకుడు రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పని చేసే చంద్రబాబు నాయుడు, విప్లవాత్మకమైన ఆలోచనతో ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ ల కలయిక అధికార పార్టీ వైసిపి నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. ఏలూరు నియోజకవర్గంలో టిడిపి జనసేన కలిసి సమిష్టిగా పని చేస్తాయని. రానున్న ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గంలో టిడిపి జనసేన జెండాలు ఎగరవేస్తామని అన్నారు.
Read Also..
ఏలూరు జిల్లా చింతలపూడి ఎం హోటల్లో జనసేన టిడిపి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల ముఖ్య నాయకులు, నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి వచ్చిన జనసేన టిడిపి నాయకులు ఒకరికొకరు పరిచయం చేసుకొని, రెండు పార్టీల అధినేతల నుండి వచ్చే ప్రధాన అంశాలను ప్రజలలోకి తీసుకువెళ్లి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవడానికి కృషి చేస్తామని నాయకులు అన్నారు. ఈ సందర్భంగా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ 11 ను రెండు పార్టీలు కలిసికట్టుగా ప్రజలలో తీసుకువెళ్లి రాబోయే 2024 ఎన్నికల్లో ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకువస్తామని అన్నారు. జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మేకా.ఈశ్వరయ్య మాట్లాడుతూ చింతలపూడి ఎస్సి నియోజకవర్గం, కానీ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు కూడా చింతలపూడి నియోజకవర్గానికి ఇవ్వకుండా వైయస్సార్ ప్రభుత్వం చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందకుండా చేసిందని రాబోయే ఎన్నికల్లో జనసేన టిడిపి కలసి పనిచేసి ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మాగంటి బాబు, చింతలపూడి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు కోళ్ల. నాగేశ్వరరావు, చింతలపూడి టిడిపి మాజీ కన్వీనర్ జగ్గవరపు. ముత్తారెడ్డి, చింతలపూడి జనసేన మండల పార్టీ అధ్యక్షుడు చీదరాల. మధుబాబు తదితరులు పాల్గొన్నారు.
పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని జగన్మోహన్ రెడ్డి, ధర్మారెడ్డి కలిసి తమ వ్యాపార దోపిడీ కేంద్రంగా మార్చారని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. ఈవో ధర్మారెడ్డిని ఇటీవలే సీఎం జగన్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ధర్మారెడ్డిగా మార్చాడని ఆరోపించారు. ఢిల్లీలో ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్‌లో పనిచేస్తున్న ధర్మారెడ్డిని జగన్ రెడ్డి ఏరికోరి రాష్ట్రానికి తీసుకొచ్చాడని, అసలు అతనికి టీటీడీ అధికారిగా పనిచేసే అర్హత ఉందా అని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆనం వెంకట రమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘గతంలో వైఎస్ఆర్ సీఎం అయ్యాక ధర్మారెడ్డిని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నియమించారని అప్పటి నుంచి ఆయన మరణించే వరకు కొనసాగారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ మరణం అనంతరం ధర్మారెడ్డి తిరిగి డిఫెన్స్ సర్వీసులకు వెళ్లిపోయాడని గుర్తు చేశారు. ఇదే ధర్మారెడ్డి తిరిగి జగన్ ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంపై వాలిపోయాడని విమర్శించారు. ఢిల్లీలో ఉన్న ధర్మారెడ్డిని డిప్యుటేషన్ పై ఏపీకి పంపాలని జగన్ మోడీకి లేఖ రాయడం ఓకే చెప్పడం చకచకా జరిగిపోయిందని ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు.
టీడీపీ మాజీమంత్రి నారాయణపై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మరోసారి సెటైర్లు వేశారు. నెల్లూరులో వైసీపీ చేసిన అభివృద్ధి పనులను తానే చేసినట్లు భ్రమపడుతూ చెప్పుకుంటున్నారని విమర్శించారు. నెల్లూరు 16 వ డివిజన్ లో ఆయన పర్యటించారు. 60 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సిసి రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నాలుగున్నర ఏళ్లలో ప్రజలకు ఏనాడు కనపడని నారాయణ నేడు ప్రజలంతా తననే కోరుకుంటున్నారని చెప్పడం హాస్యాస్పదమన్నారు. నారాయణ వెంటే ఉండే ఆయన మేనేజర్ కూడా ఆయన కోసం పని చేస్తాడో పక్కవారి కోసం పనిచేస్తాడో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నదని అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, టిడ్కో ఇళ్ళ నిర్మాణంలో భారీ దోపిడీకి పాల్పడింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నారాయణకు దమ్ముంటే చర్చకు రావాలని అప్పుడు ప్రజలే ఏది నిజమో ఏది అబద్దమో తేల్చుతారన్నారు. ప్రజలు ఆలోచించి రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలన్నారు.





Total views : 90763