రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కాపుల సంక్షేమన్ని పూర్తిగా అటకేక్కించింది అని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లో 1.50 కోట్లతో ఆధునీకరించిన తెలగ కల్యాణ మండపం ను మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప తో కలసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే నిమ్మల మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ కు కేటాయించ వలసిన నిధులు కేటాయించలేదని విదేశీ విద్యను పూర్తిగా అటకెక్కించారని వచ్చే టిడిపి జనసేన రావడం అధికారులకు వచ్చిన వెంటనే అభివృద్ధికి నిధులు కేటాయించడంతోపాటు కాపుల విదేశీ విద్య పునరుద్దిస్తామని ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాకముందు కాపు కార్పొరేషన్ కు సంవత్సరానికి రెండూవేల కోట్లు కేటాయిస్తానని ఒక్క రూపాయి విడుదల చేయలేదన్నారు. అలాగే ఐదు శాతం రిజర్వేషన్ జీవోను దుయ్యబట్టారు రానున్న టిడిపి జనసేన సంకీర్ణ ప్రభుత్వంలో కాపుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ వెనుకబడిన కులాల వారికి ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్ లో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ టిడిపి ప్రభుత్వం జీవో విడుదల చేసిన వైసీపీ ప్రభుత్వం అమలు చేయలేదని కాపులు అందరూ రిజర్వేషన్ కోసం ఐక్యంగా పోరాడాలని కోరారు.
Tdp
తిరుపతిలో స్థానిక 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు రెడ్డి టిడిపి పార్టీకి రాజీనామా చేసి, వైఎస్సార్ సీపీలో చేరగా.. తిరుపతి ఎమ్మెల్యే హోదాలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీ రాములురెడ్డి ఆదివారం ఉదయం ముత్యాల రెడ్డి పల్లి నుంచి భారీ ర్యాలీతో పద్మావతి పురంలోని భూమన నివాసానికి చేరుకుని వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడారు…మన జీవితాల్లో వెలుగులు నింపుతున్న జగనన్నకే మద్దతు ఇద్దాం అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకే ఓట్లు వేసి, జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం అని పిలుపునిచ్చారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాష్ట్రంలో పేద ప్రజలకు చేసిందేమీ లేదని, అయినా, అధికారం కోసం చంద్రబాబు అండ్ కో మళ్లీ ఓట్లు అడిగేందుకు మీ ముందుకొస్తారు, తస్మాత్ జాగ్రత్త అని ప్రజలను హెచ్చరించారు. జగనన్న చేయూత తోనే తిరుపతి అభివృద్ధిలో దేశంలోనే ఆదర్శవంతంగా నిలిచిందని, పేదల సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం కట్టుబడి ఉందని పార్టీలో చేరిన వారందరూ పార్టీ కోసం కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. రాబోవు రోజుల్లో జరిగే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ని మరలా ముఖ్యమంత్రి చేసుకోవాలని, జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
Read Also..
వైసీపీ అక్రమాలపై టిడిపి నాయకులు తిరుపతి కలెక్టర్ ను కలిశారు.
భూకబ్జాలు, అక్రమ మైన్స్, దొంగ ఓట్ల వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి టిడిపి నాయకులు
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీసుకెళ్లారు.వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులకు… ప్రభుత్వ అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఫిర్యాదు చేశారు.కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వైసీపీ నేతలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. వైసిపి నేతల అక్రమాలపై ఆందోళనలు చేస్తున్న టిడిపి నేతలపై అక్రమ కేసులను పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తిరుపతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వేల దొంగ ఓటర్లను సృష్టించడమే కాకుండా….చనిపోయిన వారి ఓట్లను తీసివేయకుండా కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్ 15 రోజుల్లో స్పందించకుంటే… న్యాయస్థానాన్ని ఆశ్రయించి…వైసిపి నేతలు అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయిని ప్రజలు ముందు పెడతామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గుంతలమయం అయిన రోడ్లు గురించి డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా జగన్ ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజలకి తెలిసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా ఆధ్వర్యంలో జనసేన – టీడీపీ నాయకులు శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ, దక్షణ కైలాసగిరి కాలనీ, తొట్టంబేడు మండలం కొత్త కండ్రిగ గ్రామాల్లో పర్యటించి గుంతలమయం అయిన రోడ్డులో పడవలు వదిలి నిరసన వ్యక్తం చేశారు. గుంతల రోడ్ల చిత్రాలు , వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 4.5 సం.|| తట్టెడు మట్టి వెయ్యలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడుతాడా , కొత్త రోడ్లు వెయ్యలేదు ,కనీసం గుంతలకి మట్టి కూడా వెయ్యలేని దయనీయ పరిస్థితిలో రాష్ట్రం ఉంది. గుంతలమయం అయిన రోడ్డు లో ప్రజల ప్రయాణం తీవ్ర ఇబ్బందిగా వాహన దారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. 5 నెలల్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని రోడ్లు బాగు చేసి, అవసరం అయిన దగ్గర కొత్త రోడ్లు వేస్తామని ప్రజలకి హామీ ఇచ్చారు.
వైసీపీ అక్రమాలపై టిడిపి నాయకులు తిరుపతి కలెక్టర్ ను కలిశారు. భూకబ్జాలు, అక్రమ మైన్స్, దొంగ ఓట్ల వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి టిడిపి నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీసుకెళ్లారు. వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రభుత్వ అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఫిర్యాదు చేశారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వైసీపీ నేతలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. వైసిపి నేతల అక్రమాలపై ఆందోళనలు చేస్తున్న టిడిపి నేతలపై అక్రమ కేసులను పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తిరుపతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వేల దొంగ ఓటర్లను సృష్టించడమే కాకుండా చనిపోయిన వారి ఓట్లను తీసివేయకుండా కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్ 15 రోజుల్లో స్పందించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించి వైసిపి నేతలు అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయిని ప్రజలు ముందు పెడతామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.
Read Also..
Read Also..
రామగుండం నియోజకవర్గంలో తనను ఓడించేందుకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు విజయవాడ కేంద్రంగా నాపై కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రా లోని టీడీపీ కి చెందిన రాష్ట్ర నాయకుడు నాగ శ్రావణ్ కిలారు కొత్తగా సోషల్ మీడియా, ఫేస్ బుక్ లు ఏర్పాటు చేసి మార్ఫింగ్ లు చేస్తూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. వీటన్నిటిని మైంటైన్ చేస్తున్న ఇక్కడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అకౌంట్ నుండి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయని ఎమ్మెల్యే అన్నారు. వీటికి సంబంధించి పూర్తి ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంశయనం పాటించాలని సూచించారు.
సీఎం జగన్ అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మద్యం అమ్మకాలు, నిషేధంపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలను అచ్చెన్నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం తాగి 35 లక్షల మంది చనిపోయారు. చంద్రబాబు హయాంలో మద్యంపై కేవలం 50 వేల కోట్లు ఆదాయం వచ్చింది. జగన్ హయాంలో లక్షా 50 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. ధరలు పెంచడం వల్ల మద్యం అమ్మకాలు తగ్గుతాయని చెప్పారు కానీ ఎక్కడ తగ్గలేదు. మద్యనిషేధం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఊరూవాడా నాసిరకం మద్యం తెచ్చి ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారు.’’ అని ధ్వజమెత్తారు.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గుంతలమయం అయిన రోడ్లు గురించి డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా జగన్ ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజలకి తెలిసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా ఆధ్వర్యంలో జనసేన – టీడీపీ నాయకులు శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ, దక్షణ కైలాసగిరి కాలనీ, తొట్టంబేడు మండలం కొత్త కండ్రిగ గ్రామాల్లో పర్యటించి గుంతలమయం అయిన రోడ్డులో పడవలు వదిలి నిరసన వ్యక్తం చేశారు. గుంతల రోడ్ల చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 4.5 సం.|| తట్టెడు మట్టి వెయ్యలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడుతాడా, కొత్త రోడ్లు వెయ్యలేదు, కనీసం గుంతలకి మట్టి కూడా వెయ్యలేని దయనీయ పరిస్థితిలో రాష్ట్రం ఉంది. గుంతలమయం అయిన రోడ్డు లో ప్రజల ప్రయాణం తీవ్ర ఇబ్బందిగా వాహన దారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. 5 నెలల్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని రోడ్లు బాగు చేసి, అవసరం అయిన దగ్గర కొత్త రోడ్లు వేస్తామని ప్రజలకి హామీ ఇచ్చారు.
శ్రీకాకుళం జిల్లా… ఇచ్ఛాపురం… నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై టిడిపి జనసేన ఉమ్మడి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అద్వానంగా ఉన్న రాజపురం- కమలాయిపుట్టుగ రహదారి వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్ల దుస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మీడియాతో మాట్లాడారు. టిడిపి ప్రభుత్వ హాయంలో ఇచ్చాపురం నియోజకవర్గంలో సుమారు 85 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం చేశామని, వైసిపి ప్రభుత్వం రహదారుల దుస్థితిని గాలికి వదిలేసిందని అన్నారు. తమ ఉమ్మడి నిరసన కార్యక్రమాలను డిజిటల్ క్యాంపైనింగ్ ద్వారా మరింత విస్తృతంగా, ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. అధ్వానంగా ఉన్న రహదారులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని జనసేన నాయకులు దాసరి రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన నేతలు పాల్గొన్నారు…
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 21 డివిజన్ లో ఉన్న రోడ్లపై మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు నిత్యం రద్దీగా ఉండే బిఆర్టిఎస్ రోడ్ లోని పలుచోట్ల రోడ్లను మరమ్మత్తు చేయాలని డిమాండ్ చేశారు నిత్యం ఈ రోడ్లో ప్రయాణించే వాహనాలు రోడ్డు ప్రమాదాలు గురై ఎందరో ప్రజలు ప్రాణాలు బలి తీసుకుంటున్నారని తెలిపారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే విష్ణు ఇప్పటికైనా కళ్ళు తెరిచి రోడ్లను మర మత్తులు చేసేంతవరకు మా పోరాటం ఆగదని తెలిపారు
ఈ కార్యక్రమంలో టిడిపి నుంచి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు జనసేన నుంచి పోలిశెట్టి రవి సెంట్రల్ కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు





Total views : 90795