తిరుమల శ్రీవారిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సురేష్ గోపి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం అర్చన సేవలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసారు. ఈ సందర్భంగా సురేష్ గోపి మీడియాతో మాట్లాడుతూ.12 సంవత్సరాల తర్వాత తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నానన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉందని తెలియజేశారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి సురేష్ గోపి. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కేరళ రాష్ట్రంలో పర్యటక రంగం తిరిగి పుంజుకుంటోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో వరదల నుంచి ప్రజలు సురక్షితంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించానన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..సన్‌రైజర్స్ హైదరాబాద్ చేసిన చేజ్ చాలా బాగా పేస్‌తో సాగింది. ఇది వారి బ్యాటర్లు సాధారణంగా ఇష్టపడే ఫ్లాట్ పిచ్ కాదు; ఇది రెండు-పేస్ ఉన్న, కొంచెం నెమ్మదిగా ప్రవర్తించిన వికెట్ కావడంతో ఎక్కువ ఓర్పు మరియు నియంత్రణ అవసరమైంది. హెడ్…
- చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..దేశంలోనే సరికొత్త రికార్డుకు వేదికైంది కేరళ. ఎప్పుడూ వినూత్న పథకాలు, సామాజిక నిర్ణయాలతో వార్తల్లో నిలిచే కేరళ రాష్ట్రం.. ఇప్పుడు వృద్ధుల కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తూ…
- తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్తతెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన గరిష్ట వయోపరిమితిని మరో పదేళ్ల పాటు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఇందుకు సంబంధించి జీవో…
- రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి… ఇది సాధారణ గ్రామం కాదు. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి వనవాసం చేసిన పవిత్ర భూమిగా భక్తులు విశ్వసించే ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ కొలువుదీరిన సీతా…
- అమెరికా కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం..అమెరికా కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం.. కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానిక ఇస్లామిక్ సెంటర్ దగ్గర ఇద్దరు టీనేజర్లు జరిపిన కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు సహా ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనను విద్వేషపూరిత దాడి కోణంలో పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 80700