కార్తీక మాసం శుక్రవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ పున్నమి ఘాట్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ దుర్గ భవాని దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో శ్రీశైల దేవస్థాన ధర్మ ప్రచార పరిషత్ హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీశైల దేవస్థానం ఆస్థాన వేద పండితులచే శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం మరియు కోటి దీపోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. కోటి దీపోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కోటి దీపోత్సవం లో పాల్గొనేందుకు విజయవాడకు చెందిన పలువురు భక్తులు భారీగా తరలివచ్చారు.
vijayawada
దుర్గగుడి చైర్మన్ పై సాయంత్రం 5 గంటల సమయంలో దాడి జరిగింది. ఇటీవల కర్నాటి చైర్మన్ నాన్న చనిపోయారు ఆయన సమాధి వద్ద ప్రతిరోజు సాయంత్రం దీపం పెట్టేందుకు వెళుతున్నారు, సమాధి క్లిన్ చేసినందుకు దైవసహయం అనే వ్యక్తికి 200 రూపాయలు డబ్బులు ఇచ్చాడు. కృష్ణకి డబ్బులు తక్కువ ఇచ్చినందుకు దాడి చేశాడు. మద్యం మత్తులో గుంజా కృష్ణ దాడి చేశారు అని పోలీసులు వెల్లడించారు. దాడి చేసిన కృష్ణ పోలీసుల అదుపులో ఉన్నాడు. స్మశానంలోనే ఈ దాడి చేసిన వ్యక్తి నివాసం ఉంటున్నాడు.
తెలంగాణ – ఆంధ్రాలో మోస్ట్ వాంటెడ్ అంతరాష్ట్ర దొంగ సయ్యద్ అల్తాఫ్ అలియాస్ అప్పు ను ఎన్టీఆర్ జిల్లా నందిగామ పోలీసులు పట్టుకున్నారు.
అతని వద్ద నుంచి 20 లక్షల రూపాయలు విలువచేసే బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. అల్తాఫ్ చీరాల పట్టణానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ప్రస్తుతం కోదాడలో నివాసం ఉంటున్నాడు. ఇతనిపై ఇప్పటికై 70 దొంగతనం కేసులు ఉన్నాయని ఏసిపి జనార్ధన్ నాయుడు తెలిపారు. తాళాలను వేసిన ఇళ్లను గమనించి రాత్రిపూట దొంగతనం చేయడం ఇతని నైజమన్నారు. ఇతనికి సహాయం చేసే కంచికచర్ల చెందిన మరో దొంగ మణికంఠను కూడా అదుపులోకీ తీసుకున్నామని తెలిపారు. నందిగామ, విజయవాడ, జగ్గయ్యపేట, ఖమ్మం, కోదాడ పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా వరుస దొంగతనాలు చేస్తున్నాడని ఏసిపి తెలిపారు. ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసి టెక్నికల్ ఆధారాల ద్వారా దొంగను చాకచక్యంగా పట్టుకున్నామన్నారు. జల్సాలకు అలవాటు పడి సులువైన మార్గాల్లో డబ్బు సంపాదించాలనే ధ్యేయంతోనే దొంగతనాలు చేస్తున్నాడని ఎసిపి జనార్ధన్ నాయుడు తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం లో ఏసీబీ ట్రాప్, ఫారెస్ట్ ఆఫీస్ లో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఏ.రామకృష్ణ ఇంటిపై ఏసీబీ దాడులు జరిగాయి, రెడ్డిగూడెం మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన రైతు గండిపూడి రాంబాబు అనే వ్యక్తి రామకృష్ణ కి 23వేలు లంచం ఇస్తుండగా ట్రాప్ చేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు ఫారెస్ట్ కార్యాలయం దగ్గర్లో రామకృష్ణ అద్దెకు ఉండే గదిలో తనిఖీలు చేస్తున్న ఏసీబీ బృందం.
విజయవాడ కనకదుర్గమ్మ ను పంచాహారతుల దర్శనం చేసుకున్న తెలంగాణ సీఎస్
అనంతరం వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రాలు, చిత్రపటం అందించిన వేదపండితులు అమ్మవారి సహస్రదీపాలంకరణ సేవలో పాల్గొని , కార్తీక మాస సందర్భంగా సహస్ర దీపాలకు పూజలు చేసి ఇంద్రకీలాద్రి దర్శనం అనంతరం హైదరాబాదు కు రోడ్డు మార్గంలో వెళ్ళిన తెలంగాణ సీఎస్…
బాపులపాడు మండలం పిరికీడు అండర్పాస్ వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో గంజాయి తరలిస్తున్న ముఠా ను పోలీసులు. రెండు ద్విచక్ర వాహనాలలో (స్కూటీ) గంజాయిని అక్రమంగా తరలిస్తున్న సమయంలో పట్టుబడ్డ స్మగ్లర్లు. పట్టుబడిన వారిలో విజయవాడకు చెందిన ముగ్గురు యువకులు, ధార కొండకు చెందిన యువతి గా గుర్తింపు. వీరి వద్ద నుండి సుమారు నాలుగు కేజీల గంజాయిని, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న హనుమాన్ జంక్షన్ ఎస్సై ఏ డి ఎల్ జనార్ధన్.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడలో పర్యటించారు. మైనారిటీస్ వెల్ఫేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. మైనార్టీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని.. గతానికి, ఇప్పటికి మధ్య తేడాలు గమనించాలన్నారు జగన్. గత ప్రభుత్వంలో మైనార్టీలను టీడీపీ గాలికొదిలేసిందన్నారు. డిప్యూటీ సీఎం హోదాతో మైనార్టీలను ఈ ప్రభుత్వం గౌరవిస్తోందన్నారు. ముస్లింలలో పేదలందరికి వైఎస్సార్.. రిజర్వేషన్లు అమలు చేశారని సీఎం జగన్ గుర్తు చేశారు. నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నామన్నారు. మైనార్టీలకు మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించామని సీఎం జగన్ చెప్పారు.
Read Also..
Read Also..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి ఉత్సవాల్లో సీఎం పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరుతారు. అజాద్ జయంతి సందర్భంగా మైనారిటీస్ వెల్ఫేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే నిర్వహిస్తున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. జగన్ పర్యటన సందర్భంగా విజయవాడలో భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఓ బస్సు ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. దీంతో పది నెలల చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బస్టాండ్ లోని పన్నెండో నెంబర్ ప్లాట్ ఫాంపై బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళ, చిన్నారితో పాటు గుంటూరు 2 డిపోకు చెందిన కండక్టర్ వీరయ్య చనిపోయారు. మరికొందరు ప్రయాణికులకు గాయాలయినట్లు సమాచారం.
విజయవాడలోని ఆటోనగర్ డిపోకు చెందిన బస్సు గుంటూరుకు వెళ్లాల్సి ఉండగా.. ఫ్లాట్ ఫాంపైకి తీసుకువచ్చే క్రమంలో బ్రేకులు ఫెయిలయ్యాయి. రివర్స్ గేర్ బదులుగా డ్రైవర్ ఫస్ట్ గేర్ వేయడంతో బస్సు ప్లాట్ ఫాంపై ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి వెళ్లింది. దీంతో బస్సు చక్రాల కింద నలిగి ముగ్గురు చనిపోయారని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వెల్లడించారు. కాగా, ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.