అమరావతి, గుంటూరు – విజయవాడ వారధిపై హిట్ అండ్ రన్. స్కూటీ పై వెళ్తున్న మహిళలను ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం. గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదంలో ఇద్దరు మహిళలు స్పాట్ డెడ్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కృష్ణ లంక పోలీసులు. గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన మహిళలుగా గుర్తింపు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు. గుంటూరు నుండి విజయవాడ వస్తుండగా ప్రమాదం. ఢీ కొట్టిన వాహనం కోసం సీసి కెమెరాలను జల్లెడ పడుతున్న పోలీసులు.
vijayawada
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ ఎంపీ కేశినేని నాని కి రాబోయే ఎన్నికల్లో సీటు లేదంటూ స్పష్టం చేసిన టీడీపీ అధిష్ఠానం. నిన్న సాయంత్రం నాని నీ కలిసిన మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టం రఘురాం, కృష్ణాజిల్లా టిడిపి అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు. 7వ తేదీ చంద్రబాబు తిరువూరు సభకు కేశినేని నాని నీ దూరం పెట్టిన పార్టీ. తిరువూరు లో జరిగే సభకు వేరే వారిని ఇంచార్జీ గా నియమించనున్న చంద్రబాబు.
జగ్గయ్యపేట జాతీయ రహదారి భీమవరం టోల్ ప్లాజా వద్ద అంగన్వాడీలను అడ్డుకుంటున్న పోలీసులు. విజయవాడ కలెక్టరేట్ వద్ద బైటాయింపు కార్యక్రమానికి వెళ్తున్న అంగన్వాడి మహిళలను నిలిపివేస్తున్న పోలీసులు. మా హక్కుల సాధన కోసo వెళ్తుంటే ఆపడం ఏంటని అడుగుతున్న అంగన్ వాడీలు. మహిళలని చూడకుండా పోలీసులు అసభ్యంగా మాట్లాడుతున్నారని అంగన్వాడి సభ్యులు మండిపడుతున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన భవానీ దీక్షా విరమణలు. ఐదు రోజులపాటు కొనసాగనున్న భవానీ దీక్షా విరమణ కార్యక్రమం. నాలుగు హోమగుండాలని వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేసిన ఆలయ అధికారులు అర్చక స్వాములు. నేతి టెంకాయలను సమర్పించి భవానీ దీక్షలను విరమణ చేస్తున్న భవానీ భక్తులు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో మారుమోగుతున్న ఇంద్రకీలాద్రి. కనుచూపుమేరకు ఎర్రని దుస్తులతో ఇంద్రకీలాద్రి ఆలయానికి పోటెత్తిన భవానీ భక్తులు. ప్రత్యేక కౌంటర్లలో ఇరుముడులను సమర్పిస్తున్న భవానీలు. మూడు షిఫ్ట్ లలో 300 మంది గురు భవానీలు. కేశఖండనశాలలో 850 మంది క్షురకులను ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. 20 లక్షల లడ్డూలను భవానీలకు అందుబాటులో ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. గిరి ప్రదక్షణలో భవానీ భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు.
విజయవాడలో మలబార్ గోల్డ్ మోసాలు బట్టబయలయ్యాయి. బంగారం పేరుతో మలబార్ యాజమాన్యం మోసాలకు పాల్పడుతుంది. అయ్యితే విషయం తెలుసుకున్న CVR న్యూస్ మలబార్ గోల్డ్ మోసాలపై నిఘా పెట్టి మలబార్ మోసాలు బయటపెట్టి బట్టబయలయ్యాయి చేసింది. కల్తీ బంగారంతో కస్టమర్స్ కి కుచ్చుటోపీ పెడుతుండటంతో, ఇక ఇక్కడ బంగారం కొంటే ప్రజలు మోసపోయినట్టే అని అర్థమవుతుంది. బంగారం రంగు మారుద్ది అంటు మలబార్ గోల్డ్ యాజమాన్యం సమర్థించుకుంటోంది.
విజయవాడ, శివరామ క్షేత్రం రామకోటి నుండి ఘనంగా ప్రారంభమైన కలశ జ్యోతులు. అమ్మవారి రథానికి కొబ్బరికాయ కొట్టి ఊరేగింపుగా దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తుల రథాన్ని ప్రారంభం చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రతి ఏడాది దుర్గా మల్లేశ్వర దేవస్థానం శివరామ క్షేత్రం నుండి కళశజ్యోతులు ప్రారంభం. కళశజ్యోతులు తీసుకొని జై దుర్గా జై జై దుర్గా అంటూ భవానీలు నినాదాలు. బి ఆర్ టి ఎస్ రోడ్డు శివరామ క్షేత్రం రామకోటి నుండి ఊరేగింపు ప్రారంభమై గాంధీనగర్, , అలంకార్ థియేటర్, లెనిన్ సెంటర్, దుర్గగుడి ఫ్లైఓవర్ మీదగా అమ్మవారి గుడికి చేరుకోనున్న కలశజ్యోతులు. కనుచూపుమేరకు ఎర్రని దుస్తుల్లో కళశ జ్యోతులతో భవానీలు.
విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాకాని వెంకటరత్నం వర్ధంతి సందర్భంగా వేదిక వద్దకు వచ్చిన విజయవాడ కాకాని తరుణ్ ను మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి అనుచరులు అడ్డుకున్నారు. బెంజ్ సర్కిల్ విగ్రహం తొలగిస్తున్నప్పుడు పోరాడిన వాళ్ళని పక్కనపెట్టి రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేడీ లక్ష్మీనారాయణ సమక్షంలోనే రచ్చ రచ్చ చేశారు.
పోలి స్వర్గస్నానం చేసేందుకు విజయవాడలో కృష్ణా నదికి భక్తులు పోటెత్తారు. ఇంద్రకీలాద్రి వద్దకు కుటుంబాల సమేతంగా తరలివచ్చారు. దుర్గా ఘాట్ భక్తులతో కిటకిటలాడింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెల్లవారు జాము మూడు గంటల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు పోలి స్నానం ఆచరించి కార్తీక దీపాలు వదిలారు.
Read Also..
Read Also..
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ ధర్నాచౌక్ వద్ద సమాన పనికి సమనవేతనo ఇవ్వాలి. ఉద్యోగాలు పెర్మిమినెంట్ చేయాలి. మీ పాలనలోదలరివ్యవస్థ ఉందని చెప్పారు. ఇంజినీరింగ్ కార్మికులహల్త్ రిస్క్ ఆన్లైన్లో చేల్లించాలి. జీఓ30నిసవరించికార్మిక శాఖ రికమండషన్ అమలు చేయాలి. విలీన గ్రామాల కరోన వరదలు కొత్తగా తీసుకొన మున్సిపల్ కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలి. ఈనెల21న కేబినెట్ మీటింగ్ లో ప్రకటించాలి లేని పక్షంలో మా కార్యచరణ ఉదృతం చేస్తాం అని హెచ్చరించారు.
టాలీవుడ్ హీరో వెంకటేష్ ప్రస్తుతం సైంథవ్ సినిమాతో రాబోతున్నారు. ఈ మూవీ సంక్రాంతికి రానుంది. అందులో భాగంగా చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమాల జోరు పెంచారు. ఇప్పటికే టీజర్, మొదటి పాట కూడా వచ్చింది. ఈనేపథ్యంలో ఇప్పుడు రెండో పాటని విడుదల చేస్తున్నారు. విజయవాడలో ఈ మేరకు ఈ రోజు ఉదయం ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్‌కి వెళ్లిన సైంథవ్ టీమ్ విజయవాడ కనకదుర్గ టెంపుల్ని సందర్శించుకున్నారు. కనకదుర్గమ్మకి టీమ్‌తో కలిసి వెంకటేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.





Total views : 140811