యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే యువకుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. యువకుడికి మూడు రోజుల నుంచి హెల్త్ బాగోకపోయినా హాస్పిటల్ కి తీసుకు వెళ్లకుండా నిర్లక్ష్యం చేసిన తిమ్మాపూర్ విజ్ఞాన్ కాలేజ్ యాజమాన్యం. బంగారు భవిష్యత్తు ఉన్న యువకుడుని ఇలా చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదని వారు అర్ధనాళాలు పెడుతున్నారు. మూడు రోజుల నుంచి బాగోకపోతే స్కూలు యాజమాన్యం ఏం చేస్తుంది? వీళ్ళకి సెక్యూరిటీగా ఉన్న వార్డెన్ ఎందుకు నిర్లక్ష్యం వహించాడు. తల్లిదండ్రులకి చెప్పాల్సిన యాజమాన్యం ఎందుకు ఇంత గోప్యతగా ఉంచుతున్నారని వారన్నారు. ఈ విషయాన్ని బయటికి రాకుండా రాత్రికి రాత్రే అక్కడనుంచి ఆ మృతదేహాన్ని మార్చురీకి తరలించి ఎవరిని దగ్గరికి రాకుండా మేనేజ్ చేశారని వారు చెబుతున్నారు. స్కూల్ యాజమాన్యం పోలీసులతో కుమ్మక్కై ఈ విషయాన్ని బయటకి తెలియకుండా ఉంచారని వారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి యాజమాన్యం స్కూల్ లైసెన్స్ ని రద్దు చేసి ఇంత నిర్లక్ష్యం వహించిన యాజమాన్యంపై డీఈవో తక్షణ చర్యలు తీసుకుని వీళ్ళ లైసెన్సులు రద్దు చేయాలని మా కుమారుడికి జరిగిన అన్యాయం ఏ ఒక్కరికి జరగకూడదని మాకు పుత్ర శోకం కలిగించినవంటి యాజమాన్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆ యువకుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
visakhapatnam
విశాఖలో ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు సిద్ధమయ్యాయియ. ఈ మేరకు 35 శాఖల కార్యాలయాలకు భవనాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు భవనాలు కేటాయించారు. ఆంధ్రా వర్సిటీ, రుషికొండ, చినగదిలి సమీపంలో కొన్ని శాఖలకు భవనాలు కేటాయించారు. పలు శాఖలకు ఎండాడ, హనుమంత్వాక ప్రాంతాల్లో కేటాయించారు. జీఏడీ, ఆర్థిక, గ్రామవార్డు సచివాలయ, ఇంధన మినహా ఇతర శాఖలకు భవనాలు కేటాయించారు. 2.27 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్యాలయాలు, విడిది అవసరాలకు కూడా భవనాలను కేటాయించింది.
ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరగబోవు టి20 మ్యాచ్ కి విశాఖపట్నం వైయస్సార్ క్రికెట్ స్టేడియం ముస్తాబయింది. వెయ్యి మందితో స్టేడియం చుట్టూ ప్రహరకాస్తు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, బాంబ్ స్కాడ్ , ఆర్మ్డ్ డ్ రిజర్వ్ టీమ్స్ సంసిద్ధంగా ఉన్నాయి. క్రికెట్ అభిమానులందరూ ఎటువంటి తినుబండారాలు,వాటర్ బాటిల్స్ స్టేడియంలోకి తీసుకురాకూడదని, ట్రాఫిక్ పరంగా అన్ని విధాల డైవర్షన్స్ చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామంటున్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసరావు తో మా విశాఖపట్నం కరస్పాండెంట్ నందకుమార్ ఫేస్ టు ఫేస్…
విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్లో బోట్లు దగ్ధమైన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధితులను ఆదుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమాదంపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని సూచించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, తగిన విధంగా వారికి సహాయం చేయాలని వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు మంత్రి సీదిరి అప్పల రాజు. విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అగ్ని ప్రమాద ఘటన సందర్బంగా ఓ యూట్యూబర్ అక్కడ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, సదరు యూట్యూబర్‌పై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్టు తెలిపారు. రాత్రి ఫిషింగ్ హార్బర్లో పార్టీ ఏర్పాటు చేసిన యూట్యూబర్. పార్టీలో మద్యం మత్తులో గొడవ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, పరారీలో ఉన్న యూట్యూబర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Also..
Read Also..
విశాఖలో కలాసీల సొంత వాహనాల్లో సరుకు రవాణా చేస్తున్న వైనం. ఇంటర్సిటీ ట్రాన్స్పోర్ట్ కోసం ప్రైవేటు వ్యక్తుల వాహనాల్లో సరుకు తరలింపు. ప్రైవేట్ వాహనంపై యదేచ్చగా ఏపీఎస్ఆర్టీసీ బోర్డులు. ఇంత జరుగుతున్న చోద్యం చూస్తున్న ఆర్టీసీ ఉన్నతాధికారులు. ఇలా అయితే ఆర్టీసీ ఎప్పటికీ లాభాల్లోకొస్తాదని ఉద్యోగులు గుసగుసలు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా పట్టించుకోని విశాఖ ఆర్టీసీ ఉన్నతాధికారులు.
విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌పై నిర్మించిన శ్రీవారి ఆలయం ఒక అద్భుతమైన నిర్మాణం. ఈ ఆలయం శ్రీవారి దేవస్థానం ద్వారా నిర్మించబడింది మరియు 2021 ఆగస్టు 13న ప్రారంభించబడింది. ఈ ఆలయం 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది మరియు దాని ప్రాంగణంలో శ్రీవారి, శ్రీదేవి, భూదేవి ఆలయాలు ఉన్నాయి. శ్రీవారి విగ్రహం 15 అడుగుల ఎత్తులో ఉంది మరియు శ్రీదేవి, భూదేవి విగ్రహాలు 10 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఆలయం శిల్పకళా నైపుణ్యానికి అద్భుతమైన ఆలయం గోపురం 100 అడుగుల ఎత్తులో ఉంది మరియు దానిపై శిల్పాలు చెక్కబడ్డాయి. ఆలయ ప్రాంగణంలో అనేక చిన్న గుళ్లు మరియు కళాఖండాలు ఉన్నాయి. ఈ ఆలయం విశాఖపట్నంలో ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. భక్తులు ఈ ఆలయానికి వచ్చి శ్రీవారిని దర్శించడానికి ప్రత్యేకంగా వస్తుంటారు. ఆలయం యొక్క కొన్ని ప్రత్యేకతలు శ్రీవారి, శ్రీదేవి, భూదేవి విగ్రహాలు చాలా అందంగా మరియు శక్తివంతంగా ఉన్నాయి. ఆలయ ప్రాంగణం చాలా విస్తృతంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి మీరు ఖచ్చితంగా సమయాన్ని కేటాయించాలి.
Read Also..
Read Also..
విశాఖ నగర పరిధిలోని మధురవాడలో మద్యం లారీ బోల్తా పడింది. ఆనందపురం నుంచి విశాఖ నగరంవైపు వెళ్తున్న మద్యం లారీ మధురవాడ వద్దకు రాగానే బోల్తా పడింది. ఎదురుగా వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో లారీ డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న మద్యం సీసాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇది గమనించిన స్థానికులు, పలువురు వాహనదారులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఎవరికి నచ్చినట్లు వారు మద్యం బాటిళ్లను తీసుకెళ్లారు. ఘటన జరిగిన సమయంలో అక్కడే అందుబాటులో ఉన్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించారు. జనం గుమిగూడకుండా చర్యలు తీసుకున్నారు. వెంటనే మధురవాడ పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
ఆంద్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు విశాఖలోని రుషికొండ చుట్టూ తిరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వం విశాఖని పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటినుంచి రుషికొండ వివాదాలకొండగా మారిపోయింది. ప్రభుత్వం రుషికొండ చుట్టూ అక్రమ తవ్వకాలు చేపడుతుందని విపక్షాలు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై అప్పట్లో విచారణ చేపట్టిన న్యాయస్థానం పరిశీలన కోసంఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలపై ఓ నివేదిక ఇచ్చింది. అనుమతికి మించి నిర్మాణాలు ఉన్నాయని ఆ కమిటీ పేర్కొంది. అయితే, సీఎం జగన్ తాను విశాఖకు మకాం మార్చుతున్నానంటూ, ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం ప్రత్యేక కమిటీ వేశారు. రుషికొండపై నూతనంగా చేపట్టిన నిర్మాణం బాగుందంటూ ఈ కమిటీ నివేదిక ఇచ్చేందుకు సన్నద్ధమైంది. దాంతో, రుషికొండ ఉల్లంఘనలపై మొదట్లో పిటిషన్లు వేసిన వారు హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. తాజాగా, రుషికొండ నిర్మాణాలపై మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తాము నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికపై మరోసారి విచారణ చేపట్టాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శిని ఆదేశించింది. రుషికొండపై ఉన్న నిర్మాణాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాదు, దీనిపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో తదుపరి విచారణను నవంబరు 28కి వాయిదా వేసింది. రుషికొండపై 9.88 ఎకరాలకు అనుమతి ఇస్తే, 20 ఎకరాల్లో తవ్వకాలు చేపట్టారని అప్పట్లో పిటిషన్లు వేశారు. విచారణ సందర్భంగా అనుమతికి మించి 3 ఎకరాలు ఎక్కువ తవ్వకాలు చేపట్టినట్టు ప్రభుత్వం అంగీకరించింది. అయితే, అంతకంటే ఎక్కువే తవ్వకాలు చేపట్టారని పిటిషనర్ ఆరోపించడంతో, కేంద్ర ప్రభుత్వం సర్వే చేపట్టింది. ఇప్పుడు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో, రుషికొండలో కేంద్రం మరోసారి సర్వే చేపట్టే అవకాశాలున్నాయి.






Total views : 74838