తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య చిన్న చిన్న బేధాభిప్రాయాలు తప్ప రానున్న ఎన్నికలలో వైఎస్సార్సీపీ ని గద్దె దించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును మరోసారి సిఎం చేయాలనీ కృత నిశ్చయంతో తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారని రాయచోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మాజీ జడ్పి చైర్మన్, రాజంపేట పార్లమెంట్ కాబోయే అభ్యర్ధి సుగావాసి సుబ్రహ్మణ్యం అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి లో సుగవాసి సుబ్రహ్మణ్యం ను వారి పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. వారిని శాలువాతో సన్మానించి బొకే అందజేసి మీ యొక్క ఆశీస్సులు కావాలని కోరారు. మండిపల్లి సుగవాసి కుటుంబాల నాయకత్వం వర్దిల్లాలి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా గెలిపించాలంటూ బారి నినాదాలు చేశారు వారి అభిమానులు. ఈ సందర్బంగా వారిరువురు మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో వైసిపినీ గద్దె దించి తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు కార్యకర్తలు సిద్దంగా ఉన్నరున్నారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనే నాకు టికెట్ రాకపోయినా పార్టీ కోసం అందరితో కష్టపడే వాడినే తప్ప ఎలాంటి రాగద్వేషాలకు లోనయ్యేవాడిని కానన్నారు. వెనుక బడిన ప్రాంతం రాయచోటి అభివృద్ధి చేయడమే ధ్యేయంగా సుగావాసి, మండిపల్లి కుటుంబాలు పని చేస్తాయన్నారు. సుగవాసి కుటుంబం, మండిపల్లి రెండు కుటుంబాలు కూడా మంచి ఆప్యాయత ప్రజాదరణ పుష్కలంగా కలిగి ఉన్నాయని రానున్న ఎన్నికలలో అత్యధిక మేజార్టితో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పై నమ్మకం ఉంచి తమను రాయచోటి అభ్యర్థిగా ప్రకటించిన తెదేపా అధ్యక్షులు చంద్ర బాబునాయుడు,లోకేష్,పవన కళ్యాణ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు అందరం కలిసి పార్టీ జెండా రెప రెప లాడిస్తాం. మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ద్వారక నాధ రెడ్డి, అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి తో కలిసి పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకు తీరుతాం. నాయకులు కలుసి పోవాలని ప్రజలే ఆదేశించారని మా రెండు కుటుంబాల కలయిక నియోజకవర్గం అభ్యున్నతికి కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మా తండ్రి పాలకొండ రాయుడు ఒక సమూహానికి మండిపల్లి నాగిరెడ్డి నాయకులుగా వ్యవహరించారన్నారు. అప్పట్లో వారి కార్యకర్తల కార్యక్రమాలకు మేము మా కార్యకర్తల కార్యక్రమాలకు హాజరయ్యే వాళ్ళం కాదు అటువంటి రాజకీయాలకు ప్రజలు మార్పు తెచ్చారన్నారు. ప్రజల కోరిక మేరకే నాయకులందరూ కలిసి పొయ్యారు ఫ్యాక్షన్ లాంటి వాతావరణం ఉండదు కేవలం రాయచోటి అన్ని రంగాలలో అభివృద్ధికి మాత్రమే పాటు పడే విధంగా మా కలియిక ఉంటుందని వారి స్పష్టంగా తెలియజేశారు.
ysrcp
వైసీపీ పార్టీ (YCP Party):
కర్నూలు జిల్లా ఆలూరులో వైఎస్ఆర్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మంత్రి జయరాం సోదరుడు, మార్కెట్ యార్డ్ చైర్మన్ నారాయణ వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ఆర్ పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇంచార్జ్ విరుపాక్షి నియమించినప్పటి నుంచి మంత్రి జయరాం, ఆయన సోదరులు వైసీపీ పట్ల తీవ్ర సంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణ వైసీపీ నేతల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రసుత్త ఆలూరు ఇన్ఛార్జ్ విరూపాక్షి పై ఆయన విమర్శలు చేశారు. మంత్రి జయరాం దయతో చిప్పగిరి జడ్పిటిసిగా విరూపాక్షి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
జెడ్పిటిసి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన బీసీలు ఎంతోమంది ఉన్నారని.. వారికి ఆలూరు ఇన్‌ఛార్జ్‌గా తమకు ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదన్నారు. అలాగే వైసీపీ జిల్లా అధ్యక్షులు బివి రామయ్య ఆలూరులో జరిగే పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టారని ఆరోపించారు. ఆలూరు నియోజవర్గంలో రెడ్లకు సలాం కొట్టేవాళ్ళకే టికెట్ కేటాయించారని, వారి కింద మోచేతి నీరు తాగే అవసరం తమకు లేదన్నారు. తమ సోదరుడు మంత్రి గుమ్మనూరు జయరామ్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. వైసీపీ పార్టీ కంటే తమ సోదరుడే ముఖ్యమని చెప్పారు. త్వరలోనే భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తామని తెలిపారు. Read Also..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వైఎస్సార్సీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వారికీ మద్దతు ఇచ్చే అవకాశం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి. అన్నమయ్య జిల్లా గుట్టపల్లిలో రమేష్ కుమార్ రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రమేష్ కుమార్ రెడ్డి అభిమానులు శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్బంగా రమేష్ కుమార్ రెడ్డి వైసిపి పార్టీ నుండి చేరిన వారిపై జగన్ ప్రభుత్వం పై సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని కబ్జా చేసేందుకే వైసిపి పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ లో చేరరన్నారు. తెలుగు దేశం పార్టీ గెలుపు కోసం కృషి చేసి పార్టీ గెలిచిన తర్వాత వారికి ఎన్ని పదవులైన కట్టబెట్టండి అని విషయాన్ని కుడా ఆదిస్థానం కు తెలియజేయడం జరుగుతుందన్నారు. గతం లో వైఎస్సార్సీపీ వల్ల మనం పదేండ్లు నస్తాబోయమన్న విషయం మీకందరికి తెలిసిందే. వైసిపి పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వారిని మనం అదరించాల్సిన అవసరం ఉందా లేదేనేది అది మీరే ఆలోచించుకోవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇసుక మద్యం ఇసుక మట్టి అన్నింట్లో ను సిఎం జగన్ పాలనా అవినీతిమయం అంటూ ఆరోపించారు రమేష్ కుమార్ రెడ్డి. జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిలమ్మ రోడ్డు పైకి వచ్చి మాట్లాడుతుంది అంటే జగన్ ప్రభుత్వం యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉందో మీరే ఆలోచన చేసుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టిలో కొన్ని బాధలు వచ్చాయి. మీ అందరి సహకారంతో చంద్ర బాబు ప్రతిస్తాత్మకంగా తీసుకువచ్చిన బాదుడే బాదుడే, భవిష్యత్తుకు గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమాలను కుడా పాంప్లేంట్ లు చేతపట్టుకొని ప్రతి గడప గడపకు సందర్శించి వారిలో చైతన్యం త్యేచ్చేందుకు కష్టపడడం జరిగింది. సరైన సమాచారం ఆదిస్థానం కు చేరకుండా డబ్బులు కట్టలతో కుట్రలు చేసారని వారు ఆరోపించారు. అటువంటిని కుట్రలనన్నింటిని కుడా అదగమించి అధగామించి తెలుగుదేశం పార్టీ గెలిచే విదంగా పనిచేస్తామన్నారు. గతంలో టిడిపి పార్టీని పాలకొండ్రాయుడు బుజ స్కందల పై మోశారు. 2014 నుండి ఇప్పటి వరకు నేనే టిడిపి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నానన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నేనే అవుతా…ఒక అవకాశం ఇవ్వాలంటూ రమేష్ రెడ్డి ఆర్ ఆర్ కుటుంబ సభ్యులను కోరారు.
ఈ 40 సంవత్సరాల కాలంలో కుప్పం ప్రాంతానికి చంద్రబాబు నాయుడు చేసింది ఏం లేదని, విమర్శించారు. అనేక సంక్షేమ పథకాలు పేదలకు అందజేయాలనే ఉద్దేశంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తుంటే అన్నిటికీ ఆటంకాలు చంద్రబాబు నాయుడు కలిగిస్తున్నారని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప విమర్శలు చేశారు. హంద్రీనీవా ద్వారా కుప్పం ప్రాంతానికి నీళ్లు రాకుండా చేసిన ఘనత చంద్రబాబునాయుడునె, పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టకుండా చేసిన ఘనత కూడా చంద్రబాబునాయుడు అని విమర్శించారు.
రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, అందుకే మేమంతా కాంగ్రెస్ పార్టీని వీడి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ పార్టీలో చేరామని, కాంగ్రెస్ పార్టీకు అనేక సేవలు అందించిన వైయస్ రాజశేఖర్ రెడ్డి గారిని ఆయన చనిపోయిన తర్వాత అనేక నింధలు వేశారని, అలాంటి పార్టీలో చేరిన వైఎస్ షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డిని విమర్శనం సరికాదని అన్నారు. కేవలం వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి కూతురు కావడంతో, మేమంతా ఆమెను విమర్శించకుండా పోతున్నామని తెలిపారు.
YSRCP :
రాజకీయాల్లో మత్స్యకారుల తరుపు ప్రతినిధిగా కొనసాగుతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఏనాడూ ఆ వర్గం ప్రయోజనాలు కోసం పని చేసిన దాఖలాలు లేవని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి విమర్శించారు. అధికారం ఉన్నంతసేపూ తన స్వప్రయోజనాల కోసమే మత్స్యకారులను వాడుకున్నారని ధ్వజమెత్తారు. స్థానిక వైస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కుటుంబాన్ని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా వేదికగా వక్రీకరించి మత్స్యకార జాతిని అవమానించినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని ద్వారంపూడి మండిపడ్డారు. మత్స్యకార ప్రాంతాల నుంచి తనకు ఏనాడూ మెజార్టీ రాకపోయినా రాజకీయాలను పక్కన పెట్టి, వీరి అభ్యున్నతికి ఎంతో కృషి చేశానన్నారు. మత్స్యకార వర్గం నుంచి కర్రి పద్మశ్రీకి ఎమ్మెల్సీ, బందన హరికి అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్, చోడిపల్లి ప్రసాద్‌కు డిప్యూటీమేయర్ పదవి రావడానికి కృషి చేశానన్నారు. మత్స్యకార వర్గానికి చెందిన మల్లాడి సత్యలింగనాయకర్ విద్యాభివృద్ధి కోసం వేలాది ఎకరాలు దానంగా ఇస్తే తన హయాంలోనే ఆయన వర్థంతి, జయంతిలను అధికారికంగా చేయించేందుకు కౌన్సిల్లో తీర్మానాలు చేయించానన్నారు.మత్స్యకారులు నివశించే ఏటిమొగ ప్రాంతంలో డ్రైఫిష్ మార్కెట్ అభివృద్ధి, మల్లారమ్మగుడి వద్ద పార్కు సుందరీకరణ, ఏటిమొగ వద్ద కనెక్టింగ్ రహదారులు, బోటు ఓనర్ల సంఘ భవన నిర్మాణానికి తోడ్పాటు, గంగమ్మతల్లి ఆయానికి స్థలం కేటాయింపు వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేశానన్నారు. దుమ్ములపేటను దత్తత తీసుకున్న కొండబాబు ఆ ప్రాంతాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని, తన హయాంలో ఆ ప్రాంతాన్ని అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దానన్నారు. ముఖ్యంగా కొండబాబు అధికారంలో ఉన్నప్పుడు వేటకు వెళ్ళిన బోట్లు దగ్థమైతే బాధితులకు ఏ మాత్రం న్యాయం చేయలేకపోయారన్నారు. ఇటీవల బోట్లు దగ్థమైతే లక్షల రూపాయలను సీఎం సహాయనిధి నుంచి మంజూరు చేయించానన్నారు. రేవు కార్మికుల్లో 90 శాతం మంది మత్స్యకారులేనని, కనీసం వీరిని కూడా కొండబాబు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. తన హయాంలో మత్స్యకారులకు 9797 ఇళ్ళ స్థలాలు ఇచ్చామన్నారు. మరీ మఖ్యంగా నగర పరిధిలో ఉన్న స్థలాన్ని మత్స్యకారులకు కేటాయించేందుకు ప్రయత్నిస్తే దానిని కూడా కోర్టుకు వెళ్ళి అడ్డుకున్న ఘనత కొండబాబుదేనన్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
గంజాయి వ్యాపారంలో వనమాడి కుటుంబం :
కొండబాబు కుటుంబం గంజాయి వ్యాపారం చేస్తోందని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు, ఆ మేరకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే వీరిని పట్టిస్తానన్నారు. మత్స్యకార ప్రాంతాల్లోని యువతను గంజాయికి బానిసనను చేసి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారని ద్వారంపూడి ఆరోపించారు.
విజయవాడ, టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని, కేశినేని నాని (Kesineni nani) పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కేశినేని చిన్ని సంచలన కామెంట్స్ (Kesineni chinni) :
Follow us on : Facebook, Instagram & YouTube.
కేశినేని నాని ఊసరవెల్లి. టీడీపీ(TDP)లో ఉంటూ వైసీపీ కోసం కేశినేని నాని పని చేశాడు. ఢిల్లీలో లోకేష్ ఏయే లాయర్లను కలిశారు.. ఎవరెవరితో మాట్లాడుతున్నారనే విషయాన్ని వైసీపీకి చేరవేశారు. చంద్రబాబు కోసం పూజలు చేసిన కేశినేని నాని. ఇప్పుడు ఆయన్నే విమర్శిస్తున్నాడు. విజయవాడ వెస్టులో టిక్కెట్లు ఇప్పిస్తానని కేశినేని నాని ఇద్దరి దగ్గర నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారు. తామిచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయమని నానిపై ఒత్తిడి తెస్తున్నారు. కేశినేని నాని కాల్ రికార్డ్స్ ఉన్నాయి. కేశినేని నాని వసూలు రాజా. నన్ను పిట్టల దొర అంటున్న కేశినేని నాని విషయాన్ని త్వరలో ప్రజలే తేలుస్తారు. జగన్ వద్ద.. వైసీపీ ఇన్చార్జుల వద్ద కేశినేని నాని పాలేరు పని చేస్తున్నారు. కేశినేని నానిది సైకో మనస్తత్వం. విజయవాడ ఎంపీ టిక్కెట్ కేశినేని నానికి ఇవ్వడం జగనుకు ఇష్టం లేదు. అవినాష్, వెలంపల్లి వంటి వారికి కేశినేని నాని అసిస్టెంట్ లా పని చేస్తున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తిరుపతి (Tirupati) లోని వేలరామ్ థియేటర్ లో రాజధాని ఫైల్స్ సినిమా చుసామని తిరుపతి నియోజకవర్గ ఇంచార్జ్ సుగుణమ్మ తెలిపారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నగర నాయకులు కుటుంబ సభ్యులు అందరూ కలసి రాజధాని ఫైల్స్ సినిమా చుసామని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాజధాని రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు..
Follow us on : Facebook, Instagram & YouTube.
అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్ మోహన్ రెడ్డి పరదాలు కట్టుకుని రాష్ట్రమంతా తిరుగుతున్నారని, రాజధాని రైతులు నిరసన తెలియజేస్తున్న ప్రాంతం ముందు వెళ్తున్న కూడా కనీసం రాజధానికి భూములు ఇచ్చిన రైతులను కన్నెత్తి కూడా చూడకుండా వెళ్లిపోవడం సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారని ప్రజలందరూ సినిమాను చూడాలని పిలుపునిచ్చారు తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ముస్లిం మైనార్టీల పక్షపాతి వైసీపీ ప్రభుత్వమని అన్నమయ్య జిల్లా వైసీపీ విభాగం మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ ఫయాజూర్ రహ్మాన్ లు అన్నారు. 2015 లో జరిగిన బక్రీద్ అల్లర్ల కేసును కొట్టి వేసిన సందర్భంగా బాధితులతో కలిసి వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బక్రీద్ పర్వదినం సందర్భంగా సంప్రదాయ కుర్బాన్నిలో భాగంగా జరుపుకునే పండుగ పై కొంత మంది కుట్రలు పన్ని అల్లర్లు జరిగేలా ప్రేరేపించి పైశాచిక ఆనందం పొందారన్నారు. సున్నిత మైన విషయాల పై అబద్ధపు ప్రచారాలు చేస్తూ లేని వారిపై కేసులు బనాయించడం చాలా బాధాకరం. అటువంటి తరుణంలో ఇంతకాలం తర్వాత పూర్వపరాలో పరిశీలించిన న్యాయస్థానం తమకు ఎటువంటి సంబంధం లేదని తేల్చడం జరిగిందన్నారు. అన్ని సామాజిక వర్గాల ప్రజలకు అండగా ఉంటూ మత సామరస్యం పెంపొందెలా బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రజా నాయకులు కేవలం వరి స్వార్థ రాజకీయాల కోసం అక్రమంగా కేసులు బానాయించడం చాలా దుర్మార్గం అన్నారు. పార్టీలతో సంబంధం అక్రమ కేసును కొట్టి వేసేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి లకు అన్నమయ్య జిల్లా వైసీపీ మైనార్టీ విభాగం అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ రెహమాన్, కౌన్సిలర్ అన్నాసలీం బాధితులలో పాటు ఇతర మైనార్టీ నేతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాయచోటి ప్రాంతానికి చేనిద్న పలువురు ముస్లిం లకు ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసిసులతో ఎమ్మెల్యే,ఎంపి ల సహకారంతో ఎమ్మెల్సి, మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ లతో పాటు సామన్యాలను సైతం కౌన్సలర్లను చేయడం జరిగిందన్నారు .ముస్లిం అభున్నతి తో పాటు ఈద్ఘా, మసీదులు అభివృద్దికి ప్రభుత్వం నిధులు కుడా కేటాయించడం జరిగిందన్నారు .
బాపట్ల జిల్లా బాపట్ల పట్టణం లో పత్రికా విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ మాట్లాడుతూ….. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి అయితే 2019 ఎన్నికలలో బాపట్ల నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ కోన రఘుపతి గెలవడం జరిగింది. నేను గత సంవత్సరంన్నర క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజున బాపట్ల నియోజకవర్గం లో ఎమ్మెల్యే కోన రఘుపతి వల్ల జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, ఇసుక దందాలు గురించి పూర్తి ఆధారాలతో మాట్లాడటం జరిగింది. ఆయనలో ఏమైనా కొంచెం అయినా మార్పు వచ్చిందేమో అనుకుంటే ఏమాత్రం స్పందించలేదు. నేను ఎవరికీ భయపడను ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు వైసీపీకి సపోర్ట్ చేయకపోతే మీకు వచ్చే పథకాలు కట్ చేస్తామని వాలంటీర్లతో భయపెట్టే పరిస్థితులు ఉన్నాయని ప్రజలు భయపడుతున్నారు. రేపు జరగబోయే 2024 ఎన్నికలలో కోన రఘుపతిని ఇంటికి పంపించడమే నా ధ్యేయం ఎందుకంటే ఇంతటి దుర్మార్గుడు, నమ్మించి మోసం చేసే వ్యక్తి స్తుతి మెత్తనంగా మాట్లాడే వ్యక్తి అతను చేసే అరాచకాలు అన్ని ఇన్ని కావు వైసిపి పార్టీ మరల అతనినే అభ్యర్థిగా ప్రకటిస్తున్నారు. వైసిపి పార్టీ వారికి అతను చేసే తప్పులు చిన్నవిగా ఉన్నట్టున్నది అంటే వారు చేసే తప్పులుతో పోల్చుకుంటే ఇవి చిన్నవిగా ఉండి ఉంటాయి అని అన్నం అన్నారు. బాపట్ల ఎవరు ఏ ఇల్లు కట్టుకోవాలని ఇసుక తోలుకోవాలన్న ఏదైనా షాపు ఓపెన్ చేసుకోవాలన్న నా పర్మిషన్ ఉండాల్సిందే అని ప్రజలను బ్రాంతులకు గురి చేస్తున్న వ్యక్తి కోన రఘుపతి… పట్టణంలో ఇల్లు పగలగొట్టి నాలుగు రోడ్లు వేసి ఇదే అభివృద్ధి అంటావా… ఐదు సంవత్సరాలకు ఒకసారి మీ చేతికి ఒక ఆయుధం వస్తుంది ఆ ఆయుధమే ఓటు దానిని ఉపయోగించి 2024 ఎన్నికలలో కోన రఘుపతిని ఇంటికి పంపించటమే ధ్యేయంగా పెట్టుకోవాలని అన్నం నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పుట్టపర్తి వైసీపీలో వర్గ విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది రోజురోజుకూ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ని లక్ష్యంగా చేసుకుని ఆయన సొంత మండలంలో వైసీపీ కీలక నేతలు సమావేశం నిర్వహించడం నియోజక వర్గ వైసీపీలో కలకలం రేపుతోంది. ఈ అసమ్మతి నేతల సమావేశానికి వైసీపీ సీఈసీ సభ్యులు… కొత్తకోట సోమశేఖర్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయ భాస్కర్ రెడ్డి, ఎంపీటీసీ పాముదూర్తి, ఎంపీటీసీ ఇంద్రజిత్ రెడ్డి నాయకత్వం వహించడం కొస మెరుపుగా నిలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తే మూకుమ్మడిగా కలసి ఓడించి తీరతామని ప్రతిన బూనడం కొసమెరుపు జగనన్న ముద్దు…. దుద్దుకుంట వద్దు అన్న నినాదాలతో సమావేశంలో హోరెత్తించారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఎమ్మెల్యే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్యకర్తలను అస్సలు పట్టించుకోవడం లేదన్నారు. సొంత పార్టీ కార్యకర్తలనే ఎమ్మెల్యే ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. సమిష్టిగా అందరూ కలిసికట్టుగా గత ఎన్నికల్లో టిడిపి తరఫున బలమైన టిడిపి అభ్యర్థి రఘునాథరెడ్డిని ఓడించామని, ఇప్పుడు శ్రీధర్ రెడ్డికి మాత్రం టికెట్ ఇవ్వకూడదని అందరూ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఆయనకు టికెట్ ఇస్తే వైసీపీలో ఎవరు సహకరించే పరిస్థితిలో లేరన్నారు. స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తున్న ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకొని సీఎం జగన్ కు కానుకగా ఇస్తామన్నారు.
కొసమెరుపు :
అసమ్మతి నేతలందరూ నల్లమాడ మండల కేంద్రంలోని ఓ సమావేశ భవనంలో సభ నిర్వహిస్తుండగా పోలీసు అధికారులు రంగప్రవేశం చేసి ఇక్కడ ఎందుకు సమావేశం నిర్వహిస్తున్నారో కాస్త వివరణ ఇవ్వాలని అసమ్మతి నేతలను అడ్డుకున్నారు. పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదానికి దిగి సమావేశాన్ని యథాతథంగా నిర్వహించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.