Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Andhra Pradesh వైఎస్ఆర్ పార్టీకి భారీ షాక్..

వైఎస్ఆర్ పార్టీకి భారీ షాక్..

by Rama
Narayana

వైసీపీ పార్టీ (YCP Party):

కర్నూలు జిల్లా ఆలూరులో వైఎస్ఆర్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మంత్రి జయరాం సోదరుడు, మార్కెట్ యార్డ్ చైర్మన్ నారాయణ వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ఆర్ పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇంచార్జ్ విరుపాక్షి నియమించినప్పటి నుంచి మంత్రి జయరాం, ఆయన సోదరులు వైసీపీ పట్ల తీవ్ర సంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణ వైసీపీ నేతల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రసుత్త ఆలూరు ఇన్‌ఛార్జ్ విరూపాక్షి పై ఆయన విమర్శలు చేశారు. మంత్రి జయరాం దయతో చిప్పగిరి జడ్పిటిసిగా విరూపాక్షి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

జెడ్పిటిసి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన బీసీలు ఎంతోమంది ఉన్నారని.. వారికి ఆలూరు ఇన్‌ఛార్జ్‌గా తమకు ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదన్నారు. అలాగే వైసీపీ జిల్లా అధ్యక్షులు బివి రామయ్య ఆలూరులో జరిగే పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టారని ఆరోపించారు. ఆలూరు నియోజవర్గంలో రెడ్లకు సలాం కొట్టేవాళ్ళకే టికెట్ కేటాయించారని, వారి కింద మోచేతి నీరు తాగే అవసరం తమకు లేదన్నారు. తమ సోదరుడు మంత్రి గుమ్మనూరు జయరామ్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. వైసీపీ పార్టీ కంటే తమ సోదరుడే ముఖ్యమని చెప్పారు. త్వరలోనే భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తామని తెలిపారు. Read Also..


నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు …
మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.
బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ …
ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.
ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: