2019 ఎన్నికలలో మహిళలను మభ్యపెట్టి సంపూర్ణ మధ్యపాన నిషేధం ప్రకటిస్తానని అని గెలిచి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 2024లో సంపూర్ణ మద్యాన్ని నిషేధం చేస్తే తప్ప ఓట్లు అడగని అన్న పెద్దమనిషి ఏ ముఖం పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్నారని ప్రశ్నించారు టిడిపి తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు నాయకులు నరసింహ యాదవ్. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలతో నిర్వహిస్తున్నారని, ఆర్జీవి లాంటి సెక్స్ సినిమాలు తీసే డైరెక్టర్ తో నందమూరి కుటుంబాన్ని అవమానించే విధంగా సినిమాలు తీయించి ప్రదర్శిస్తే ఊరుకోమని దీనిని నందమూరి అభిమానులంతా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలను తీసుకొచ్చి గెలిపించాలంటూ ప్రజల ముందు పెట్టడం తోనే జగన్మోహన్ రెడ్డి పతనం ప్రారంభమైందని అన్నారు. అలాగే రాష్ట్రంలో అవినీతి అక్రమాలు మితిమీరిపోయాయని అనేక చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ముఖ్యమంత్రి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని రాష్ట్రంలో గత 15 రోజులుగా అంగన్వాడీలు నిరసన దీక్షలు కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వారికి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయాలని ఆలోచనలు ముఖ్యమంత్రి లేరని ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో క్రికెట్ ఆడుకుంటూ ప్రజలను గాలికి వదిలేసారని ఆరోపించారు తిరుపతి ఇంచార్జ్ మాజి ఎమ్మెల్యే సుగుణమ్మ.
జగన్ పతనం మొదలయ్యింది- టీడీపీ నరసింహ యాదవ్
76
previous post