మంచిర్యాల జిల్లా మందమర్రి బొగ్గు క్షేత్రల వేలం పాటను నిలిపివేసి, సింగరేణి పరిధిలోని బొగ్గు క్షేత్రాలను నామినేషన్ పద్ధతిలో సింగరేణికే కేటాయించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) బ్రాంచి కార్యదర్శి సాలేంద్ర సత్యం డిమాండ్ చేశారు మందమర్రి ఏరియా కెకె 5 గని పై ద్వారా సమావేశంలో ఆయన మాట్లాడుతూ……, నామినేషన్ పద్ధతిలో బొగ్గు బ్లాక్ లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ), ఏఐటియుసి, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.సింగరేణికి నామినేషన్ పద్ధతిలో బొగ్గు గనులు కేటాయించాలి. జూన్ 5న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లను ముట్టడించడం జరుగుతుందని, తెలిపారు జూన్ 8 నుండి సింగరేణి ప్రధాన కార్యాలయం, సింగరేణి వ్యాప్తంగా అన్ని జిఎం కార్యాలయాల ఎదుట వారం రోజులపాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 1945లో నిజాం నవాబ్ దక్కన్ కంపెనీని ఏఐటీయూసీ పోరాట ఫలితంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గా ప్రభుత్వ రంగ సంస్థగా ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ సమయంలోనే నిజాం నవాబు గోదావరి నది పరివాహక ప్రాంతంలోని బొగ్గు నిక్షేపాలు ఎక్కడ ఉన్న సింగరేణే వెలికి తీయాలని ఒప్పందంలో రాసి ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. అయినప్పటికీ కేంద్రంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 2015లో తీసుకు వచ్చిన ఎంఎండిఆర్ చట్టంలో బొగ్గు క్షేత్రాలను వేలంపాట ద్వారా ప్రైవేట్ పరం చేసే కుట్రలు చేసిందని ఆరోపించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- HPCL గ్యాస్ ప్లాంట్‌లోకి వరద నీరు.మహారాష్ట్రలో భారీ వర్షాలు తీవ్ర బీభత్సం సృష్టిస్తున్నాయి. రాయగఢ్ జిల్లా చవానే గ్రామంలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీరు స్థానిక HPCL గ్యాస్ ప్లాంట్‌లోకి చేరడంతో రీఫిల్లింగ్ కోసం నిల్వ ఉంచిన వందలాది ఖాళీ గ్యాస్…
- సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సిట్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ మేరకు హైకోర్టు విధించిన నిబంధనలను సడలించాలని సిట్ కోరింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం, సీఐ నాగరాజును ఒక రోజు…
- అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అర్చకులు…
- ఖమ్మం జిల్లా లచ్చగూడెంలో డిప్యూటీ సీఎం పర్యటన.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రైతాంగానికి అవసరమైన సహాయ సహకారాలు అన్ని విధాలుగా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెంలో డిప్యూటీ…
- ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్..ముంబై హాస్పిటల్‌లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 196687