కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే, బిజెపి పార్టీతోనే సాధ్యమని, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిజెపి పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ తెలిపారు.
బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ను, శ్రీ గణేష్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. వివిధ బస్తీలలో, వార్డులలో శ్రీ గణేష్ బిజెపి నాయకులతో కలిసి, బిజెపి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ, ఇంటింటి ప్రచారంలో నిమగ్నమయ్యారు.
శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గ ప్రజలకు ఎంతో దగ్గర అయిన శ్రీ గణేష్ విజయం ఖాయం అని, నియోజకవర్గ ప్రజలు శ్రీ గణేష్ వెంట ఉంటామని ఉన్నామని, స్థానిక ప్రజలు శ్రీ గణేష్ కు భరోసా ఇస్తున్నారు.ఈ సందర్భంగా కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని, కాలనీ ప్రజలను కోరారు.
Hyderabad
ఎన్నికల ప్రచారంలో భాగంగా శేరిలింగంపల్లి హాఫిజ్ పెట్ డివిజన్ శాంతినగర్ చందానగర్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల తో కలిసి ఇంటింటి ప్రచారం చేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరెకపూడి గాంధీ.. ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని శేరిలింగంపల్లిలో భారీ మెజారి విజయం సాధిస్తామని నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు..
హైదరాబాద్, నాంపల్లి అగ్ని ప్రమాదంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని సీఎస్‌కు గవర్నర్ తమిళిసై సూచించారు. ఈ ప్రమాద ఘటనకు గల కారణాలు, తీసుకున్న చర్యలపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లోని ఓ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగి, నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ఘటనలో నాలుగు రోజుల పసికందు, ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకెన్నో రోజులు లేవు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్ లో ఐటీ దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి. నగరంలోని పలు చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 15 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సారి దాడుల్లో ఫార్మా కంపెనీలను ఐటీ అధికారులు టార్గెట్ చేశారు. నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంపై కూడా ఐటీ దాడులు జరిగాయి. వారం క్రితం తుమ్మల నాగేశ్వరరావు, జానారెడ్డి, పారిజాత నరసింహారెడ్డి, కేఎల్ఆర్ నివాసాలపై కూడా ఐటీ దాడులు జరిగాయి. తాజాగా సబిత బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు జరగడం కలకలం రేపుతున్నాయి.
కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్‌ను ఇప్పటివరకు ఎందుకు బయట పెట్టలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దాడి విషయంలో మంత్రి హరీష్ రావు నటనకు తెలంగాణ యువకులు భావోద్వేగానికి లోనయ్యారని ఎద్దేవా చేశారు. నిందితుడు రాజు రిమాండ్ రిపోర్టు బయటపెట్టలేదని ఆయన అన్నారు. కుట్రలు జరగబోతున్నాయని కేటీఆర్ అన్నారని, ఆయన మాటలను సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించాలని రేవంత్ డిమాండ్ చేశారు.అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడి ఘటనపై స్పందిస్తూ.. అదంతా డ్రామా అని రేవంత్ కొట్టిపారేశారు.
హైదరాబాద్ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లి బజార్‌ఘాట్‌లోని ఓ భవనంలో మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దట్టమైన పొగ తీవ్రతతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, చిన్నారి ఉన్నారు. నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. నిచ్చెనల సహాయంతో భవనంలోని మహిళలు, చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్యారేజ్ ఉండటంతో కారు రిపేర్ చేస్తుండగా మంటలు వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అదే సమయంలో అక్కడ డీజిల్, కెమికల్ డ్రమ్ములు ఉండటం.. వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. దీంతో పక్కనే అపార్ట్మెంట్లలో ఉంటున్నవారు భయాందోళనకు గురయ్యారు. గ్యారేజ్‌లో ఉన్న మిగతా కెమికల్ డబ్బాలను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ప్రమాదంతో గ్యారేజ్‌లో ఉన్న పలు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి.
షహలిబండ లోని గోమతి ఎలక్ట్రానిక్స్ పక్కన గల బజాజ్ ఎలక్ట్రానిక్స్ వద్ద ఈ తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే అగ్నిమాపక సిబ్బంది సహాయం తో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసారు. ఈ ఘటన పై పోలీసులు విచారణ జరుపుతున్నారు మరిన్ని వివరాలు ఇంకా తెలియల్సి ఉంది.
ఇబ్రహీంపట్నం govt హాస్పటల్ కి చికిత్స కోసం వేచి గంటల తరాపడ్డి వేచి చూసిన పలించని ప్రాణం .. చనిపోయిన వ్యక్తి యాట నరేష్ ఇబ్రహీంపట్నం నివాసి … ఉదయం 10 గంటలకు govt హాస్పిటల్ కి వెళ్లి చూసిన డాక్టర్లు లేక చూసే దిక్కు లేక .. డ్యూటి లో ఉన్న నర్సు ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుని కూర్చున్న 10 నిమిషాలకే చనిపోయాడు ..పట్టించుకోని నర్సులు ….ఇది ఇబ్రహీంపట్నం govt హాస్పిటల్ దుస్థితి …ఈ మారాని అధికారుల తీరు ….ఇబ్రహీంపట్నం mla గారు మంచి రెడ్డి కిషన్ రెడ్డి గారు ఈ హాస్పిటల్ చైర్మన్ … ఐన కూడా మారని పరిస్థితులు….
పండగపూట విషాదం చోటుచేసుకుంది. కాజీపేట దర్గా లోని బంధం చెరువులో దూకి తల్లి (40)కూతురు (14) ఆత్మహత్యకి పాల్పడ్డారు. అది తెలుసుకొని వృద్ధురాలైన అత్త గుండెపోటుతో మృతి చెందింది. మృతులు దర్గాకు చెందిన వారు. ఒకే ఇంట్లో మూడు మృతదేహాలు పోస్టుమార్టం కోసం మృతదేహాలను పోలీసులు ఎంజీఎంకు తరలించారు. ఎసిపి డేవిడ్ రాజు కాజీపేట ఇన్స్పెక్టర్ రాజు… సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరించారు.
మంచిపై చెడుకు ప్రతీక దీపావళి. చిమ్మ చీకట్లను చీల్చుతూ వెలుగులు పంచే ఈ వేడుక.. జీవితంలోనూ కొత్త వెలుగులు నింపుతుందని , నగరవాసులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిఒకొక్క దీపం వెలిగిస్తూ చీకట్లని పారద్రోలినట్లు..ఒకొక్క మార్పు సాధించుకుంటూ గొప్ప జీవితాన్ని నిర్మించుకోవాలి అన్నారు.చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’.. విజయానికి ప్రతీక దీపావళి, దీపావళి మీకు అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు, సరికొత్త వెలుగులతో అందరి జీవితం ప్రకాశించాలని ఆకాక్షించారు.





Total views : 201207