Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Telangana రెండో రోజులుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు

రెండో రోజులుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు

by Satya
IT searches

నల్లగొండ జిల్లాలో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 40 మంది అధికారులతో బృందాలుగా రైస్ మిల్లర్స్ , బీఆర్ఎస్ అభ్యర్థి అనుచరుల ఇళ్లల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. నిన్న తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. మిర్యాలగూడలోని పలు రైస్‌ మిల్లుల యజమానులతోపాటు ఓ కాంట్రాక్టర్‌ ఇంట్లోనూ సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక కాంట్రాక్టర్‌ ఇంజమూరి శ్రీధర్‌ ఇంటితోపాటు రైస్‌ మిల్లు యజమానులు రంగా రంజిత్‌, రంగా శ్రీధర్‌, బండారు కుశలయ్య, రేపాల అంతయ్య ఇండ్లు, మిల్లుల్లో గురువారం ఉదయం 4 నుంచి అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. త్రిపురారం మండలం ముకుందాపురంలోని వెంకటసాయి సాల్వెంట్‌ ఆయిల్‌ మిల్లులోనూ సోదాలు చేపట్టినట్టు సమాచారం.

Advertisements

You may also like

Our Visitor

012452
Total views : 75188

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.