వనపర్తి జిల్లా వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి మండలంలోని జగత్ పల్లి, మణిగిల్ల మోజెర్ల మద్దిగట్ల అమ్మపల్లి, అల్వాల, చిన్న మందడి, అనకాపల్లి తండా పెదమందడి పలు గ్రామాల్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. నా గెలుపు నాది కాదు శ్రమజీవులు, రైతన్నలు, ప్రజల గెలుపు సాగునీళ్లు తెచ్చి బతుకు దెరువుకు బాటలు వేశాను. నేను మాట్లాడే ప్రతి మాట, ప్రతి పని రేపటి భవిష్యత్తు, బతుకు దెరువు కోసమే కాలువలు తవ్వించి నియోజకవర్గానికి సాగునీళ్లు తీసుకుని వచ్చాను. రేపటి భవిష్యత్తు మొత్తం వ్యవసాయం రంగం మీదనే ఆధారపడి ఉంటుంది. ముందు చూపుతో వ్యవసాయ ఆదారిత పరిశ్రమలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. రైతులు పొలాలకు వెళ్లేందుకు కూడా బాటలు వేయడం జరిగింది. ఒక్కసారి ఎమ్మెల్యే గా గెలిపిస్తే సిఎం కెసిఆర్ నన్ను వ్యవసాయ శాఖ మంత్రిని చేయడంతో కష్టపడి పనిచేసి వ్యవసాయానికి వన్నె తెచ్చాను. వనపర్తి పేరును నిలబెట్టాను. ప్రజలకు, రైతులకు మంచి జరగాలి అనుకున్నవారందరు మన వెంబడి ఉన్నారు. అర్దకు అమురుతుందని అనుకున్న వాళ్లు పక్కకు వెళ్లారు. వాళ్ల గురించి మనకు అవసరం లేదు కాంగ్రెస్ పాలనలో దొంగలు ఉండే కరెంట్ ఎప్పుడు వస్తుందో అని రైతులు పాటలు పాడుకునేవాళ్లు. కాంగ్రెస్ వాళ్లు వాళ్ల హయాంలో రైతులకు ప్రజలకు కరెంట్ కష్టాలు మాత్రమే ఇచ్చారు, భవిష్యత్తు లో కూడా కాంగ్రెస్ వస్తే రాష్ట్రం పరిస్థితి, ప్రజల జీవితాల పరిస్థితి ఆగం అవుతుంది తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లందరికీ రైతు బీమా తరహాలో వాళ్లకు కెసిఆర్ భీమాను అమలు చేస్తాం. కాంగ్రెస్ ను నమ్ముకుంటే కష్ట కాలం తప్ప ఒరిగేది ఏమి లేదు సాగునీళ్లు ఇవ్వడం వల్ల రాష్టంలో 2.5 కోట్ల మందికి వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఉపాధి దొరుకుతుంది. ఎన్నికల సమయంలో రైతుబందు వేస్తే కెసిఆర్ కు ఓట్లు పడుతాయి అని కాంగ్రెస్ వాళ్లు లెటర్లు పెట్టారు. ఎన్నికలకు రైతు బంధు కు సంబంధం లేదని రైతులకు ఇబ్బందులు అవుతాయాని వివరణలు పెడితె స్పందించిన ఈసి రైతుబంధు ను వేయడానికి అనుమతులు వచ్చాయి. .ఏమవుతుందని 23 ఏండ్ల కింద తెలంగాణ జెండా పట్టుకుని తిరిగిన నేను ఎమ్మెల్యే, మంత్రిని అయితా అని జెండా పట్టలేదు రైతుల కష్టాలను చూసి జెండా పట్టుకుని తిరిగిన అందరి సహకారంతో రాష్ట్రాన్ని సాధించుకున్నాం. నేను గెలిస్తే మీరు గెలిచినట్లే ఓటు వేసే ముందు ఒకసారి మీరే ఆలోచించుకోవాలి ప్రభుత్వాన్ని, భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇవి. అందరు అలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన ఎన్నిక. సరైన నిర్ణయం తీసుకుంటే అభివృద్ధి ముందుకు సాగడానికి వీలుగా ఉంటుంది 56 సంవత్సరాలు ఆంధ్ర పాలనను చూసినాం. 9 ఏండ్ల నుండి కృష్ణనది నీటి వాటా తేలలేదు. ఈ విషయం పై కేంద్రం ఇంత వరకు ఏమి మాట్లాడలేదు. కాంగ్రెస్ వాళ్లు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. మన బీఆర్ఎస్ ఎంపీ లు మాత్రమే మాట్లాడుతున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ను మూడు సంవత్సరాలల్లో పూర్తి అయ్యేది. కానీ పని జరుగకుండా 1000 కోట్ల జరిమానాతో కోర్టులో కేసు వేశారు. అయినా మొండిగా పని చేసి 7.5 సంవత్సరాలలో పాలమూర్ రంగారెడ్డి పనులు పూర్తి చేసినం. 1కోటి 10 లక్షల ఎకరాల్లో యాసంగి, రబి సీజన్ లో వరి పంటను పండిస్తూ దేశానికి అన్నం పెట్టె పరిస్థితి కి వచ్చాము. గతంలో తినడానికి తిండి లేక పొట్ట చేతబట్టుకుని వలసలు వెళ్లేవాళ్లం స్వరాష్ట్ర పాలన ఏర్పడిన తరువాత వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడంతో చాలా వరకు వలసలు తగ్గి ఉన్నంత భూమిలో వ్యవసాయం చేసుకుంటు ప్రజలు సంతోషంగా ఉన్నారు మన ఆలోచన తీరు ఒకటి వాళ్ల ఆలోచన తీరు వేరు… కాంగ్రెస్ జాతీయ పార్టీ వాళ్లకు ఆంధ్ర తెలంగాణ కావాలి కాబట్టి నీటి వాటా పంచాయతీ తెంపదు. 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా, సంక్షేమ పథకాలు, కొనుగోలు కేంద్రాలు, గ్రామాలను బాగు చేసినందుకా ఇన్ని చేసిన సిఎం కేసిఆర్ బాగాలేడని వాళ్లు ఉన్న రాష్టాల్లో అమలు చేయరు కానీ ఇన్ని చేస్తున్న ప్రభుత్వం వద్దు అని కాంగ్రెస్ కు ఓటు వేయమని అడుక్కుకుంటున్నారు. వాళ్ళను 50 ఏండ్లు చూసినం, కెసిఆర్ ను రెండు సార్లు చూసినం ఒక సారి వాళ్ళను చూద్దాం అనుకుంటే మాత్రం 5 ఏండ్లు చూడడానికి ఏమి ఉండదు. ఈ రోజు అమలులో ఉన్న సంక్షేమ పథకాలు, వసతులు గతంలో ఉండేనా అని అలోచించుకోవాలి రైతులు అప్పుల పాలు కావద్దు అని తెలంగాణ ప్రభుత్వం అలోచించి రైతుబంధు ఇస్తున్నాము. కాంగ్రెస్ వాళ్లు మాత్రం రైతులు అప్పులపాలు కావాలని చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తగా 1 కోటి 37 లక్షల భూమి 5 ఎకరాల లోపు ఉన్నవారు, 5 ఎకరాల లోపు ఉన్నవాళ్లకు బ్యాంక్ వాళ్లు రెండు లక్షల లోన్ ఇస్తారా ఇవ్వరు కదా అప్పు ఇవ్వనప్పుడు రుణమాఫీ ఎట్లా చేస్తారు కాంగ్రెస్ వాళ్లు చెప్పే అబద్దాలను ప్రజలు గ్రహించాలి ఆయన అన్నారు
Mahabubnagar
అలంపూర్ తాలూకా బీఆర్ఎస్ పార్టీని నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే అబ్రహం. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి ఆలయాన్ని ఎమ్మెల్యే అబ్రహం దర్శించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అబ్రహం మీడియాతో మాట్లాడుతూ జరుగుతున్న ఎన్నికలు ఆధిపత్యం, ఆత్మగౌరవం మధ్య ఎన్నికల పోరాటం జరుగుతుంది. గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో అలంపూర్ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించా. సీఎం కేసీఆర్ నా పేరు ప్రకటించిన చివరకు బీఫామ్ ఇవ్వలేదు. నాకు టికెట్ రాకుండా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అడ్డుపడ్డాడు. ఎమ్మెల్యే అబ్రహం కు టికెట్ ఇస్తే చల్లా వెంకట్రామిరెడ్డి రాజీనామా చేస్తానని చెప్పడం జరిగింది. ఎమ్మెల్సీ చల్లా చాలామందికి టికెట్ ఇస్తానని ఆశ చూపి వెంట తిప్పించుకున్నాడు. మాజీ ఎంపీ మందా జగన్నాథం ను కూడా టికెట్ విషయంలో మోసం చేశారు. అల్లంపూర్ అభివృద్ధి చేయాలంటే అన్ని రంగాలపై పరిజ్ఞానం లేని వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. అల్లంపూర్ నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలంటే అసెంబ్లీలో కానీ, ఐఏఎస్ ఆఫీసర్లతో మాట్లాడగలిగే అర్హత ఉన్న వ్యక్తి నీ. పుల్లూరు గ్రామంలో చదువుకున్న వ్యక్తి లేరా. ఎస్సీ నియోజకవర్గంలో నీ పెత్తనం ఏంటి. ఈరోజు ఒక్కరోజే కాదు. 2014 సంవత్సరంలో కూడా ఇలానే చేశావు. సంపత్ కుమార్ మరియు నా విషయంలో కూడా ఇలానే చేశావు. ఏమిటి నీ ఆధిపత్యం. దానిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరా. అల్లంపూర్ ప్రజలారా చదువుకున్న వ్యక్తి కాబట్టి అవగాహన కలిగిన వ్యక్తి సంపత్ కుమార్ ను గుర్తించండి. ఎలాంటి పదవులు ఆశించకుండా. స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరి సంపత్ కుమార్ గెలుపుకు కృషి చేస్తాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. అన్ని కులాలను సమానంగా చూసా. ఎందుకంటే అలంపూరు లో ప్రశాంత వాతావరణ ని పెంపొందించా..
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు తన అనుచరులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ చేరుకొని పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. దీంతో కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాత్రి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఓ కారులో అక్రమంగా మద్యం తరలిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు సమాచారం ఇస్తే సమాచారాన్ని ఇచ్చిన వారిని కొల్లాపూర్ ఎస్సై, కొల్లాపూర్ మాజీ జెడ్పిటిసి హనుమంతు నాయక్ , ముక్కిడి గుండం మాజీ సర్పంచ్ లోకేష్ యాదవ్ ను అతి దారుణంగా కొట్టారని జూపల్లి ఆరోపించారు. పోలీసులు సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి డైరెక్షన్ లో పనిచేస్తున్నారని అన్నారు. పోలీసులు అధికార బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దౌర్జన్యాలకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో రాక్షస పాలన సాగుతోందని రాయలసీమ రౌడీల లాంటి ఎస్ఐలను కొల్లాపూర్ తీసుకొచ్చి పనిచేపిస్తున్నారని విమర్శించారు. తన కార్యకర్తలపై పోలీసులు బూటు కాళ్లతో తన్నారని బెల్టులతో కొట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణంపై సీఎం కేసీఆర్ కు కేటీఆర్ కు కవితకు హరీష్ రావుకు చెప్పిన పట్టించుకోలేదని ఆయన తెలిపారు. దీని కోసమేనా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది అని ప్రశ్నించారు.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో టిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. టిఆర్ఎస్ పార్టీకి చెందిన కొల్లాపూర్ ఎంపీపీ భోజ్యా నాయక్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎంపీపీ భోజ్యా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి జూపల్లి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీపీ భోజ్యా నాయక్ మాట్లాడుతూ తనకు ఎంపీపీ పదవి ఇచ్చారని కానీ తన కాళ్ళు చేతులు కట్టేసినట్లు విపరీతమైన టార్చర్ పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. పదవి ఇచ్చి పనులు అధికార పార్టీ నాయకులు చేసుకున్నారని అన్నారు. తనపై పెత్తనం చేసారని కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా అవమానించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక గిరిజన బిడ్డను కాబట్టే తనపై అలా ప్రవర్తించారని తెలిపారు. ఇన్ని రోజులు అన్ని భరించనని ఇక భరించలేక కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే బీరం.హర్షవర్ధన్ రెడ్డి బండారం బయటపెడతానని తనకు అన్ని తెలుసని అన్నారు. అన్ని తాండలు తిరిగి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు ను భారీ మెజార్టీతో గెలిపిస్తానని ఆయన శపథం చేశారు.
Read Also…
Read Also…
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో ప్రెస్స్ మీట్, కర్నె శిరీష బర్రెలక్కకు అండగా ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాసరావు. భారతదేశ ప్రముఖ న్యాయవాది కరణం రాజేష్ కుమార్ నాపై కేసులు పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన మరుసటి రోజు నుండి చాలా భయభ్రాంతులకు గురి చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన నా ప్రాణం పోయినా వెనుకడుగు వేసేది లేదు, నాకు సపోర్ట్ చేసేవాళ్లను కూడా చాలా భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. నా తమ్ముడుపై దాడి చేసిన వాళ్ళు ఎవరో నాకు తెలుసు కానీ నేను వారి పేరు, పార్టీ పేరు బయట పెట్టదల్చుకోలేదు. మాది చాలా పేద కుటుంబం మాపై ఎప్పుడు దాడి చేస్తారో తెలియకుండా భయం భయంగా ఉన్నాము. కొల్లాపూర్ లో ఏలాంటి అభివృద్ధి చేయలేదు. నా ప్రచారానికి మీరు సహకరించకపోయిన పర్లేదు కానీ అడ్డగించకండి దయచేసి కొల్లాపూర్ నిరుద్యోగులు ఎందుకు బయటకి రావడం లేదు, ఎందుకు భయపడుతున్నారు. నేను ఆడపిల్లను ధైర్యంగా ముందుకు వచ్చాను. మీరు రండి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి యువత ముందుకు రావాలి. నిరుద్యోగులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో నేను చూశాను. ఇప్పటికైన మన రాష్ట్ర యువత ముందుకు వచ్చి మీ సపోర్ట్ నాకు అందివ్వాలని కోరారు. అంతర్జాతీయ న్యాయవాది కావెటి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎక్కడో అమెరికాలో ఉన్న మాలాంటి వ్యక్తులను ఇక్కడికి రప్పించిన బరెలక్కను అభినందించాలి అని అన్నారు. ఈరోజున రాజకీయాల్లోకి రావాలంటే డబ్బు పలుకుబడి ఉండాలి. కానీ బరేలక్కకు ఇవేమీ లేకున్నా చాలా మంచి గట్టి పోరాటం చేస్తుంది, అందుకు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఈమే భద్రతకు సంబంధించి ఈరోజు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి బరేలక్కకు భద్రత కల్పించాలని, లేని పక్షంలో హై కోర్టు లో పిటిషన్ వేసి న్యాయస్థానంను కోరుతామని అన్నారు. ఎన్నికలు ముగిసే వరకు బరెలక్కకు మేం అంతా సపోర్టుగా అండగా వుంటాం.
Read Also…
Read Also…
నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో కారు గుర్తు ప్రచారం స్పీడ్ పెంచింది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డికి ప్రజలు బోనాలతో ఘన స్వాగతం పలుకుతున్నారు. నియోజకవర్గంలోని తిమ్మాజీపేట మండలంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి నేడు ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో గ్రామ ప్రజలు, బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆంజనేయస్వామి గుడి లేని ఊరు తెలంగాణ పల్లెలో లేదు అలాగే కెసిఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు కూడా ఈ తెలంగాణ పల్లెలో లేదు అంటూ మర్రి జనార్దన్ రెడ్డి ప్రచారంలో ప్రసంగించారు. 30వ తేదీన కారు గుర్తుకు ఓటు వేసి తనను మూడోసారి గెలిపించాలని ఓటర్లను మర్రి జనార్దన్ రెడ్డి కోరారు. పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేసే పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని మర్రి అన్నారు. ఇదిలా ఉంటే మర్రి జనార్దన్ రెడ్డి సతీమణి మర్రి జమున రాణి బిజినపల్లి మండలం మంగనూరు గ్రామంలో ఇల్లు ఇల్లు తిరుగుతూ ప్రచారం కొనసాగించారు. కారు గుర్తుకు ఓటు వేసి టిఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేయాలని ఓటర్లను ఆమె కోరారు. మూడోసారి మరి జనార్దన్ రెడ్డి గెలవడం, కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం, టిఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని వారు తెలిపారు.
కాంగ్రెస్ 50 ఏళ్లుకు పైగా పరిపాలించి మహబూబ్ నగర్ ను వలసల జిల్లాగా మార్చిందన్నారు కేసీఆర్. మహబూబ్ నగర్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ఈ విధంగా మాట్లాడారు. 2004లో గెలిచిన కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. తెలంగాణకు 33పార్టీలు మద్ధతిచ్చాయని.. ఇక కాంగ్రెస్ కు గతి లేక తెలంగాణ ఇచ్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ 15 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించిందని పేర్కొన్నారు. అంతే కాకుండా 3గంటలు కరెంట్ ఇస్తామని పీసీసీ చీఫ్ అంటున్నాడు. దీన్ని పరిగణలోకి తీసుకొని అయినా రాయేదో.. రత్నమేదో ప్రజలే గుర్తించాలన్నారు. అభ్యర్థి వెనకాల ఉన్న పార్టీ మంచిచెడులు తెలుసుకొని ఓటు వేయాలని సూచించారు. అధికారంలోకి రాగానే పెన్షన్ ను 5వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అలాగే కంటివెలుగు పథకం కింద 3కోట్ల మందికి పరీక్షలు చేయించామని తెలిపారు. ప్రజలు ఆత్మగౌరవంతో బ్రతకాలనే ఉద్ధేశంతోనే పెన్షన్లు ఇస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.
Read Also…
Read Also…
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎల్లేని సుధాకర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ…
తన సొంత ఏజెండా తో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. బిజెపి ఎమ్మెల్యేగా ఒక్కసారి నన్ను గెలిపించండి నేను చెప్పినవన్నీ ఒక్క సంవత్సరంలో నెరవేర్చకపోతే మీరు ఏ శిక్ష విధించిన నేను దానిని సంతోషంగా స్వీకరిస్తాను అన్నారు. ఒకే ఒక్కసారి నన్ను అధిక మెజార్టీతో గెలిపించి చూడండి 2018 గత ఎన్నికల్లో వర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుండి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు టిఆర్ఎస్ నుండి ఎన్నికల బరిలో నిలబడి కృష్ణారావు పై బీరం హర్షవర్ధన్ రెడ్డి గెలుపు పొందారు. 2019 అంటే మూడు నాలుగు నెలల లోపల టిఆర్ఎస్ పార్టీలో చేరారు ఇప్పుడు వారి ఇరువురు తాజా మాజీలు ఒకరి తర్వాత ఒకరు పార్టీలు మారి పోటీలో ఉన్నారు అని విమర్శించారు. జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉండి ఈ నియోజకవర్గానికి ఏమి ఒరగబెట్టింది లేదు అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి టిఆర్ఎస్ పార్టీలో కి పోయి ఎలాంటి అభివృద్ధి చేయకుండా తన స్వలాభములతో అభివృద్ధి చెందాడు ఇలాంటి వ్యక్తుల కు మళ్లీ ఎమ్మెల్యేగా పటం కట్టాలన్న ఒకే ఒక్కసారి బిజెపి అభ్యర్థన నాకు కమలం గుర్తుకు ఓటు వేసి నన్ను 50 వేల మెజార్టీతో గెలిపిస్తే అల్లంపూర్ నుండి కొల్లాపూర్ దేవరకొండ మీదుగా రైల్వే లైన్ అలాగే కృష్ణా నదిపై వెల్టూరు గుంది మల్ల బ్రిడ్జి అండ్ బ్యారేజ్ నిర్మాణం అక్కడి నుండి చిన్నంబాయి పెంట్లవెల్లి లింగాలు నుండి దేవరకొండ వరకు హైవే రోడ్డు తెస్తానని కొల్లాపూర్ నియోజక వర్గానికి 100 పరిశ్రమల కంపెనీలు తెస్తానని హామీ ఇస్తున్న అలా చేయలేని పక్షంలో ప్రజలారా మీరు ఏ శిక్ష విధించిన నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తాం ఒట్టేసి చెబుతున్న నేను వెల్లడించిన నా మేనిఫెస్టోను ఏ ఒక్కటి తప్పిన ప్రజలారా మీరు వేసే ఏ శిక్షకైనా నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తా తాజా మాజీలు ఇద్దరు దొంగలే ఇద్దరు ఒకరి పార్టీలోకి ఒకరు వచ్చారే తప్ప మళ్ళీ ఎవరికి గెలిచిన పార్టీలు మారే అవకాశాలు ఉన్నాయి నేను అలా చేయను నాకు ఈసారి ఒక్క అవకాశం కల్పించండి నేను ఇచ్చిన మాటను తూచా తప్పకుండా నెరవేరుస్తాను 2018 ఎన్నికల్లో సెంట్రల్ మినిస్టర్ నితిన్ ఘట్కారిని పిలిపించి సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం హైవే రోడ్డు కోసం హామీ ఇప్పించాను అని గుర్తు చేశారు.
Read Also..
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. పదేళ్లు కేసీఆర్కు అవకాశం ఇస్తే.. ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ కు మరోసారి అవకాశం ఇస్తే తెలంగాణ పరిస్థితిని ఊహించలేమన్నారు. వనపర్తిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.తెలంగాణ తీసుకొచ్చామని చెప్పిన వారికి పదేళ్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాదా? అని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఎంతో నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. మరి అలాంటి కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలపై లేదా? భారాసకు మరో అవకాశం ఇచ్చే విషయంలో ఈ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతాం’’ అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అచ్చంపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ కు టీపీపీసీ అధ్యక్షుడు ఏనుముల రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దొరల గడీ ల పాలన వల్ల మన నల్లమల ప్రజలకు ఏమాత్రం న్యాయం జరగలేదని.. నిరుద్యోగ సమస్య తో యువతకు అన్యాయం చేశారనీ, కాంగ్రెస్ పార్టీ వస్తె రైతుభందు అని కెసిఆర్ తప్పుడు కూతలు కూస్తున్నాడని ధ్వజమెత్తారు.గువ్వల బాలరాజు ను మా అచ్చంపేట బిడ్డలు ఒక్క ఖాన్ భైరీ కొడితే పోయి గోపాల్ పేటలో పడాలి బిడ్డా ..గుండాయిజం అంతం అవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ ను గెలిపించాలని కోరారు, ఈ ఒక్క నెల ఆగితే కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తుందని వృద్దలకు 4000 ఆసరా పించన్ , మహిళకు, 2500 రూపాయలు, కౌలురైతులకు 12000, రైతులకు 15000 రూపాయలు ఇస్తామని, తెలిపారు, చీమల దండు లాగా సభకు వస్తు మీ ఉత్సాహం చూస్తుంటే వంశీకృష్ణ కు యాభై వేయిల మెజారిటీ విజయఢంకా మోగించి ఆశీర్వదిస్తున్నరు అని అన్నారు, అదేవిధంగా డిసెంబర్ 9 తేదీన హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకారానికి నా అచ్చంపేట ప్రజలు ఇదే ఆహ్వానం గా అందుకుని రావాలని పిలపునిచ్చారు, ఇదే క్రమంలో ఇంటెలిజెన్స్ పోలీసులను ఈ భారీ బహిరంగ సభ వీడియో లను చిత్రీకరించి కేసిఆర్ కు పంపడని సూచించారు.





Total views : 194410