కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి నిరసనసగా ఎదురయింది ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని రైతులు మరియు 98జీఓ శ్రీశైలం ముంపు నిర్వాసితులు అడ్డుకున్నారు.తమ గ్రామంలోకి రావద్దంటూ రైతులు మరియు 98 జీఓ నిర్వాసితులు నినాదాలు చేశారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెల్టూరు గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రచారం నిర్వహించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డికి రైతుల నుండి నిరసన సెగ ఎదురయ్యింది.సాగునీరు అందక తమ పంట పొలాలు దాదాపు 5000వేల ఎకరాల పంటలు ఎండిపోయాయని ఎన్నిసార్లు చెప్పిన ఎమ్మెల్యే పట్టించుకోలేదని ఆగ్రహ వ్యక్తం చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వచ్చిన ఎమ్మెల్యేను రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రైతులు అడ్డుకుంటున్నారన్న నేపథంతో రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రత వాతావరణం నెలకొంది.దీనికి తోడు 98 జీఓ శ్రీశైలం ముంపు నిర్వాసితులు ఎమ్మెల్యే ప్రచారాన్ని అడ్డుకున్నారు. గత ఎన్నికల్లో తనను గెలిపిస్తే 98 జీఓ ద్వార ముంపు నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం అందరికి ఇపిస్తానని చెప్పి ఎమ్మెల్యే బిరం.హర్షవర్ధన్ రెడ్డి తమను మోసం చేశారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే ను అడ్డుకున్నారు.
Mahabubnagar
ముదిరాజుల సన్నాహక సమావేశం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో జిల్లా మత్స్య శాఖ అధ్యక్షుడు సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ మాట్లాడుతూ కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముదిరాజులకు ఉచిత చేప పిల్లలు, చేపల వలలు, లునాలు ఇవ్వడం జరిగిందన్నారు. కొన్ని కారణాల వలన ముదిరాజులకు ఎమ్మెల్యే టికెట్ లు ఇవ్వడం సాధ్యం కాలేదని, భవిష్యత్తులో ముదిరాజులకు సుముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. దేవరకద్ర నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. కావున ముదిరాజులందరూ కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. నవంబర్ 27న దేవరకద్ర నియోజకవర్గ ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి నియోజకవర్గంలోని ముదిరాజులందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం ఇస్రంపల్లి, పుట్టపల్లి, రాజోలి గ్రామాలలో కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ 9 సంవత్సరాలు ఎమ్మెల్యే గా ఉన్న ఆల వెంకటేశ్వర్ రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ, అక్రమంగా ఇసుక మట్టిని దోచుకోవడం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి దేవరకద్ర గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంటు వస్తుందని, సంక్షేమ పథకాలు ఆగిపోతాయాని బిఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కావున ప్రజలు ఎవరు అలాంటివి నమ్మవద్దని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలతో పాటు 1 తులం బంగారం ఇస్తామని, 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తామని, రైతులకు 2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు, పేదవారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే సిలిండర్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేస్తుందని తెలియజేశారు. బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఓటమి భయం పట్టుకున్నది. కావున డబ్బుల తో ఓట్లు కొనాలని బిఆర్ఎస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని, బిఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసిన చేసిన దేవరకద్ర నియోజకవర్గంలో 30 వెల మెజార్టీతో గెలవబోతున్నానని మధుసూదన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇస్రంపల్లి, పుట్టపల్లి, రాజోలి గ్రామాలకు బిఆర్ఎస్ చెందిన కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Read Also..
నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి ప్రచారం జోరందుకుంది. తెలకపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి షాప్ షాపు తిరుగుతూ కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. మరి జనార్దన్ రెడ్డి వెంట బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిందని అందుకే ప్రజల తరఫునుంచి కారు గుర్తుకే ఓటేస్తామని తనను మూడోసారి గెలిపిస్తామని ప్రజలు మద్దతు తెలుపుతున్నట్లు మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. బ్యాలెట్ లో మూడో నెంబర్ గుర్తుపై నొక్కి తనను గెలిపించాలని బ్యాలెట్ నమూనాను ఓటర్లకు చూపిస్తూ మర్రి జనార్దన్ రెడ్డి ప్రచారం కొనసాగించారు. తన ప్రచారంలో ప్రజలు ఇస్తున్న మద్దతుకు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బిఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గ భారత కమ్యునిస్టు సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాజీ పార్లమెంట్ సభ్యులు మల్లురవి కేతురు వెంకటేష్ సిపిఐ జిల్లా కార్యదర్శి బాల నరసింహ ఫయాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుగోడు ఎన్నికల అనేది సాధారణంగా జరిగిన ఎన్నికలు కావని బిజెపి పార్టీ తన స్వలాభం కోసమే కుత్రిమంగా ఏర్పాటు చేసిన ఎన్నికలని అక్కడ బీజేపి నీ వ్యతిరేకించడానికి టిఆర్ఎస్ తో జతకట్టడం జరిగిందని కమ్యూనిస్టు పార్టీఅనేది ఈదేశ ప్రజలను కాపాడాలని ఉద్దేశంతో ఉన్నటువంటి మద్దతుగా నిలబడే పార్టీ అనే మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి చేసిన కుట్రలను తిప్పికొట్టేందుకే ఆ రోజుల్లో టిఆర్ఎస్ కి మద్దతు పలకడం జరిగిందని ప్రస్తుతం రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకున్న నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ పార్టీ కి మద్దతుగా నిలబడిందని అన్నారు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి కేసీఆర్ లిక్కర్స్ స్కాంలో తన కూతురు కవితను కాపాడుకునే ప్రయత్నంలో బిజెపితో జతకట్టారనే విషయం తెలవడంతో ఆ పార్టీ నుంచి తాము విడిపోవడం జరిగిందని ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టు పార్టీ మద్దతు తెలుపుతున్నామని కొల్లాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి జూపల్లి కృష్ణారావు గెలుపుకు కమ్యూనిస్టు పార్టీ పూర్తి మద్దతు ఉండి వారి గెలుపు కృషి చేస్తామని మరి కాంగ్రెస్ నాయకులు జూపల్లి గారు కూడా గెలిచిన అనంతరం అన్ని సందర్భాల్లో కమ్యూనిస్టు పార్టీ నాయకులను కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని నడవాలని ఈ సందర్భంగా కోరారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాది పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజల హక్కుల కోసం అనేక దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న గొప్ప పార్టీని ఆయా ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీ ప్రభావం తక్కువ ఉన్నప్పటికీ ఆ పార్టీ నాయకులు నిరంతరం ప్రజాసేవకే అంకితం అయి ఉంటారని నిరంతరం ప్రజల కోసమే పోరాటాలు నిర్వహిస్తారని మరి అలాంటి పార్టీ తమకు మద్దతు తెలపడం చాలా సంతోషకరమైన విషయమని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన అనంతరం కమ్యూనిస్టు పార్టీని నాయకులను కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని అన్ని సందర్భాల్లో వారిని ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చింతలపల్లి జగదీశ్వరరావు పగడాల శ్రీనివాస్ రెడ్డి ఏఐసిసి నాయకులు కేతురు వెంకటేష్, పలువురు సిపిఐ నాయకులు పాల్గొన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగే సకల జనుల విజయ సంకల్ప సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.సభ ఏర్పాట్లను బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ పరిశీలించారు. ఈ సందర్భంగా డికె అరుణ మాట్లాడుతూ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సకలజనుల విజయ సంకల్ప సభకు అమిత్ షా తో పాటు కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరికొంతమంది ప్రముఖులు హాజరు అవుతున్నట్టు డికె అరుణ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి మేనిఫెస్టో ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించి గద్వాలలో జరిగే బహిరంగ సభలో మేనిఫెస్టో గురించి వివరిస్తారని, తెలంగాణ లో బిజెపి అధికారం వచ్చే విధంగా పార్టీ కృషి చేస్తుందని, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా మేనిఫెస్టో రూపొందిస్తారని అరుణ అన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల తో కలిసి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ మహిళలు మరియు ఓటరులను కలుస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని హస్తం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేసారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కోరికను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి బహుమతిగా ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్న ఆరు గ్యారంటీ పథకాలపై ప్రజలను వివరిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అనంతరం మీడియాతో జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, డిసెంబర్ 3న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని సృష్టించ బోతుంది అని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందన్నారు. సీఎం కేసీఆర్ మాట మనిషి కాదని మాటల మనిషి అని,మాటల పిట్ట అని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఏ ఒక్క స్కీమ్ అమలు కాలేదని అమలు చేయలేదని అన్నారు. కొల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బీరం. హర్షవర్ధన్ రెడ్డి ని ప్రజలు విపరీతంగా అసహ్యించుకుంటున్నారని అన్నారు. గెలిచిన మూడు నెలలకే పార్టీ మరి అమ్ముడు పోయిన వ్యక్తి ఎమ్మెల్యే బీరం. హర్షవర్ధన్ రెడ్డి అని అన్నారు. పంహౌస్ కేస్ లో 15 రోజులు కట్టేసిన వ్యక్తి కొల్లాపూర్ ఎమ్మెల్యే అని హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. గ్రామాలలో ప్రచారం లో తనకు పెద్ద ఎత్తున అనూహ్య స్పందన వస్తోందన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అరాచక పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని వివిధ గ్రామాలలో ప్రచారం చేసిన బహుజన్ సమాజ్ వాది పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బసిరెడ్డి సంతోష్ రెడ్డి.. ఇంటింటికి వెళ్లి ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బహుజన సమాజ్ వాది పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య వైద్యం కల్పిస్తామన్నారు.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీ లకు ఓటు వేస్తే బహుజనుల బతుకులు మారవన్నారు. పేద ప్రజలకు న్యాయం జరగాలన్న, బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారం రావాలన్న బహుజన సమాజ్‌వాది పార్టీతోనే సాధ్యమన్నారు. కావున దేవరకద్ర నియోజకవర్గ ప్రజలందరూ నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బసిరెడ్డి సంతోష్ ప్రజలకు పిలుపునిచ్చారు..
Read Also..
తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారంపై ఎన్నికల కమిషన్ గట్టి నిఘా పెట్టింది. ఒక వైపు డేగ కన్నుతో పరిశీలిస్తోంది. మరోవైపు ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా కోట్లాది రూపాయలను సీజ్ చేస్తోంది. అభ్యర్థులు హద్దులు దాటకుండా మార్గదర్శకాలు విడుదల చేసింది. పాపం మంత్రి సత్యవతి రాథోడ్ ఈ డేగ కన్నుకు చిక్కుకున్నారు. ఎన్నికల మార్గదర్శకాలకు తిలోదకాలు ఇచ్చారు. ఆమె ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ ఎఫ్ఎస్ టీ టీమ్ ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్‌నాయక్ తరఫున ప్రచారం కోసం ఇటీవల కొంగరగిద్దకు సత్యవతి వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు ఆమెకు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఈక్రమంలో సత్యవతి రాథోడ్ హారతి పళ్లెంలో నాలుగు వేల రూపాయలు వేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకే డబ్బులిచ్చారని ఎఫ్ఎస్టీ బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంత్రి సత్యవతి రాథోడ్‌పై మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
Read Also..
Read Also..
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఈ నెల 19న తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు బీఆర్ఏస్ అధినేత కేసిఆర్ రానున్నట్లు ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్ యాదవ్ తెలిపారు.. ఈ రోజు బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈనెల 19న ఆదివారం లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని కల్వకుర్తి నియోజకవర్గం లోని ఎనిమిది మండలాలు, రెండు మున్సిపాలిటీ లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని కెసిఆర్ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యడ్మ సత్యం, బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also..




Total views : 194233