Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Latest News సీఎం రేవంత్ రెడ్డితో సీపీఎం ప్రతినిధి బృందం కీలక భేటీ..

సీఎం రేవంత్ రెడ్డితో సీపీఎం ప్రతినిధి బృందం కీలక భేటీ..

by CVR NEWS
సీఎం రేవంత్ రెడ్డితో సీపీఎం ప్రతినిధి బృందం కీలక భేటీ

తెలంగాణ సెక్రటేరియట్ వేదికగా ఇవాళ అత్యంత ప్రాధాన్యత కలిగిన రాజకీయ భేటీ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి నేతృత్వంలోని సీపీఎం ఉన్నత స్థాయి బృందం కలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కనీస వేతనాల సవరణ చట్టంపై ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా సీపీఎం నేతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అయితే, ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై, విపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రం మద్దతు ధరలు ప్రకటిస్తోందే తప్ప.. పండిన పంటలో 30 శాతం కూడా సేకరించడం లేదని, ఈ విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించాలని సీపీఎం నేతలకు సూచించారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజనూ తామే కొంటున్నామని.. రూ.500 బోనస్ ఇచ్చి సన్న వడ్లు కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

019548
Total views : 91057

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.