Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Latest News తెలంగాణ భవిష్యత్తు బీజేపీదే -బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నితిన్ నబీన్.

తెలంగాణ భవిష్యత్తు బీజేపీదే -బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నితిన్ నబీన్.

by CVR NEWS
తెలంగాణ భవిష్యత్తు బీజేపీదే -బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నితిన్ నబీన్

తెలంగాణ భవిష్యత్తు బీజేపీదేనని, రాష్ట్రంలో మార్పు తీసుకురావాలంటే ప్రజల గొంతుకగా మారాలని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నితిన్ నబీన్ అన్నారు. ఘట్కేసర్ సర్కిల్ అంక్షాపూర్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ప్రజలు కన్న కలలను సాకారం చేసే దిశగా బీజేపీ పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ‘ఆర్ఆర్ పన్ను’ ద్వారా ఢిల్లీ దర్బార్‌కు నిధులు తరలిస్తోందని ఆరోపించారు. వీధుల నుంచి శాసనసభ వరకు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, ఈ ప్రభుత్వ పతనానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలే బీఆర్ఎస్ పతనానికి కారణమయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే సంప్రదాయాలను కొనసాగిస్తోందని విమర్శించారు. ముసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి వేదికగా మార్చిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల డబ్బును ఢిల్లీకి తరలిస్తున్నారని విమర్శించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: