Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home National 40 మంది మత్సకారులతో వెళ్తున్న బోటు గల్లంతు..!

40 మంది మత్సకారులతో వెళ్తున్న బోటు గల్లంతు..!

by Satya
Boat sinking

అరేబియా సముద్రంలో 40 మంది మత్సకారులతో వెళ్తున్న బోటు గల్లంతైన ఘటన కర్నాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లా కర్వార్‌లో జరిగింది. ఈ బోటు గోవాలోని పనాజీ నుంచి బయలుదేరిందనీ, ఉత్తర కన్నడ జిల్లా అంకోలాలోని బెలికేరి సమీపంలో చివరి జీపీఎస్ సిగ్నల్ నమోదైందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బోటులో మొత్తం 40 మంది ఉన్నారు. గోవాలో రిజిస్టర్ అయిన ఈ బోటు ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తి బలమైన గాలులకు కొట్టుకుపోయినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గల్లంతైన బోటు ఆచూకీ కోసం కోస్టల్ గార్డులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: