Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Latest News ఆ రెండు గ్యారంటీలు అమలు లోకి…..

ఆ రెండు గ్యారంటీలు అమలు లోకి…..

by Prakash
Minister Sridhar Babu

తెలంగాణ రాష్ట్ర తొలి కేబినెట్‌లో చర్చించిన అంశాలను మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014 నుంచి 2023 వరకు ప్రభుత్వ ఖర్చులపై చర్చించినట్లు తెలిపారు. ఆరు గ్యారంటీల అమలుపైనా సుదీర్ఘ చర్చ జరిగినట్లు వెల్లడించారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు తెలియాలని అభిప్రాయపడ్డారు. అందుకే అన్ని అంశాలను తెలపాలని అధికారులను కోరినట్లు తెలిపారు. ఆదాయ-వ్యయాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ముందుగా రెండు గ్యారంటీలను అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని అన్నారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రెండు గ్యారంటీలను అమలు చేయబోతున్నట్లు తెలిపారు. అందుకోసం ఈ నెల 9వ తేదీన ఆ రెండు గ్యారంటీలను అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. అందులో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు ఉందని తెలిపారు. మిగిలిన నాలుగు గ్యారంటీలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అంతకుముందు తమకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు కృతజ్ఞతలు చెప్పారు.

Advertisements

You may also like

Our Visitor

039780
Total views : 200816

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: