Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home National మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస

మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస

by Rama
మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస

మళ్లీ మణిపూర్ భగ్గుమంటోంది. మరోసారి హింసాత్మక మంటల్లో కాలిపోతోంది. ఇక్కడ ఆందోళనకారులు ఆగ్రహంతో ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ వ్యక్తిగత నివాసంపై దాడి చేశారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను కూడా ప్రయోగించాల్సి వచ్చింది. ఘటన సమయంలో సీఎం బీరేన్ సింగ్ ఆ ఇంట్లో లేరని సంబంధిత వర్గాలు తెలిపాయి. సీఎం తన కార్యాలయంలో ఉన్నారని, పూర్తిగా క్షేమంగా ఉన్నారని తెలిసింది. రాజధాని ఇంఫాల్‌లో మణిపూర్ ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన తరుణంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ముగ్గురి హత్య తర్వాత చెలరేగిన నిరసనల దృష్ట్యా ఆరు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అంతకుముందు, ఇంఫాల్‌లోని ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లపై నిరసనకారులు దాడి చేశారు. ఆ తర్వాత నిరసన హింసాత్మకంగా మారింది. మణిపూర్ లో హింసపై అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ శాంతి భద్రతల పునరుద్ధరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మణిపూర్‌లో మోహరించిన అన్ని భద్రతా బలగాలను పరిస్థితిని కంట్రోల్ చేయమని సూచించింది

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
    ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్‌ కల్యాణ్‌..ముంబై హాస్పిటల్‌లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
  • హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.
    అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్‌పోనాలు…
  • అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
  • భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.
    భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్‌తో కలిసి ఇరు దేశాల ప్రముఖ సీఈఓలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల…
  • చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు.
    తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్‌ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్‌..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

039348
Total views : 196432

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: