Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Main News ఏపీ ప్రెస్ అకాడమీని రామోజీ ప్రెస్ అకాడమీగా మార్చే ఆలోచనలోప్రభుత్వం?

ఏపీ ప్రెస్ అకాడమీని రామోజీ ప్రెస్ అకాడమీగా మార్చే ఆలోచనలోప్రభుత్వం?

by Rama
ఏపీ ప్రెస్ అకాడమీని రామోజీ ప్రెస్ అకాడమీగా మార్చే ఆలోచనలోప్రభుత్వం?

మీడియా మొఘల్, ఈనాడు సంస్థల అధినేత, రామోజీ ఫిలిం సిటీ రూపకర్త రామోజీరావుకు ఘన నివాళులు అర్పించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్దమైంది. ఈ నెల 27న ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా సంస్మరణ సభను ఏర్పాటు చేసింది. రామోజీరావు పుట్టిపెరిగిన కృష్ణాజిల్లాలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర సహా మరికొందరు సమన్వయం చేసుకుంటున్నారు.ఇక, రామోజీ సంస్మరణ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ సహా పాత్రికేయులు.. ఇతర రంగాల ప్రముఖులు.. ప్రజాప్రతినిధులు హాజరువుతున్నారు. అయితే ఇప్పటికే రామోజీ రావు జ్ఞాపకాలు తెలుగు వారితోనూ.. తెలుగు నేలతోనూ చిరస్థాయిగా గుర్తుండిపోయేలా ఏర్పాట్లు చేస్తామని.. సీఎం చంద్రబాబు ప్రకటించారు.ఏపీ ప్రెస్ అకాడమీని రామోజీ ప్రెస్ అకాడమీగా మార్చే ఆలోచనలోప్రభుత్వం?ఏపీ ప్రెస్ అకాడమీ పేరును ఆయన ‘రామోజీ ప్రెస్ అకాడమీ’గా మార్చే ఆలోచన చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా రాజధాని అమరావతి పేరును ఆయనే సూచించిన నేపథ్యంలో అమరావతి ప్రాంతంలోనూ రామోజీ విగ్రహానికి స్థలాన్ని కేటాయించే అవకాశం ఉందని తెలిసింది. దీనిపై చంద్రబాబు కూడా ఇప్పటికే ప్రకటన చేశారు. అమరావతిలో రామోజీ స్మారకం నిర్మిస్తామన్నారు. ఈ రెండు కార్యక్రమాలకు కూడా.. ఈ నెల 27న నిర్వహించే సంస్మరణ సభలో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
    ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
  • హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
    హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
  • జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
    ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
  • అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.
    అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
  • శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

019369
Total views : 90572

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.