Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Telangana బాల్క సుమన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

బాల్క సుమన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

by CVR NEWS

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల వేళ క్యాతన్‌పల్లి లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలు మంత్రి వివేక్ ఇంటి వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. రౌడీయిజం, గూండాయిజాన్ని అడ్డుపెట్టుకుని మంత్రి వివేక్ క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బాల్క సుమన్ ఆరోపించారు.
ఈ క్రమంలోనే సుమన్ చేసిన ఆరోపణలకు మంత్రి వివేక్ వెంకటస్వామి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని ఆయన అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో మర్చిపోయారా అని ప్రశ్నించారు. బాల్క సుమన్ డ్రామా క్రియేట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. నిన్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉండటంతో మేము ఉదయం 11 గంటలకే కౌన్సిల్ హాలుకు చేరుకున్నామని అన్నారు. కానీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు మధ్యాహ్నం 12 గంటలకు రావడంతో కోరం లేనందున ఎన్నిక వాయిదా పడిందని మంత్రి వివరించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చెన్నూరు, క్యాతన్‌పల్లిలో ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని ఆరోపించారు. అప్పట్లో నామినేషన్లు వేసిన వారిని బాల్క సుమన్ వేధించి, బలవంతంగా విత్‌డ్రా చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు తాము ప్రజాస్వామ్య పద్ధతిలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సిద్ధంగా ఉన్నా సుమన్ ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని వివేక్ ధ్వజమెత్తారు

Advertisements

You may also like

Our Visitor

038972
Total views : 193848

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: