Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh విద్యార్థులకు స్కూల్ కిట్స్ పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్

విద్యార్థులకు స్కూల్ కిట్స్ పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్

by Rama
విద్యార్థులకు స్కూల్ కిట్స్ పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన విద్యార్థులకు స్కూల్ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ ముఖ్యఅతిథిగా విచ్చేసి బ్యాగులు, పుస్తకాలు సంబంధిత స్కూల్ కిట్స్ ను విద్యార్థులకు అందజేశారు.అనంతరం కళాశాల ప్రాంగణంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు సెంట్రల్ ప్రెసిడెంట్ బొల్లా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో లక్ష రూపాయలతో నూతనంగా నిర్మించబడిన స్టేజ్ ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు,ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తల్లితండ్రులను, ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకొని చిన్నతనం నుండి క్రమశిక్షణను అలవర్చుకోవాలని, ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేలా కృషి చేయాలని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ తాను ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థానములో ఉండేందుకు పాఠశాల విద్య ఎంతో తోడ్పాటు నిస్తుందన్నారు. ప్రైవేటు పాఠశాలలో లేనన్ని సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి.
    సీఎం రేవంత్‌రెడ్డిని MCHRD బోధి పెవిలియన్‌లో గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి, గోద్రేజ్ అగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగతో నియోగి కలిశారు. గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీ ఆధ్వ‌ర్యంలో ఆయిల్ పామ్ సాగు విస్తర‌ణ‌పైన ముఖ్యమంత్రికి నివేదిక అంద‌జేశారు…
  • అంగరంగవైభవంగా కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌ డ్రామా ‘డ్యూ డేట్‌’ చిత్రం ప్రారంభం.
    పీఆర్‌ఓగా, జర్నలిస్ట్‌గా తెలుగు సినీ పరిశ్రమలో అందరికి సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతూ, మరో నిర్మాత పవన్‌ తరిగోపులతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘డ్యూ డేట్‌’ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో…
  • త్వరలో విడుదల కానున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ.
    టాలీవుడ్ తెరపైకి మరో ఆసక్తికరమైన కథ రాబోతుంది. రమేష్ బాబు చెరుకూరు దర్శకత్వంలో బాల బ్రహ్మచారి, శివ బ్రహ్మిణి సమర్పణలో, శివబ్రహ్మేంద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత సావిత్రమ్మ నిర్మిస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి…
  • తెలంగాణలో ఉచిత పథకాలపై హైకోర్టు ఫైర్.
    తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చట్టబద్ధతపై హైకోర్టు తీవ్ర సందేహాలను వ్యక్తం చేసింది. శాసనసభ ఆమోదం లేకుండా కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఈ పథకాలను ఏ విధంగా అమలు చేస్తారని ప్రశ్నించింది.…
  • మమతా బెనర్జీ పార్టీకి ఈడీ షాక్.
    పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కు ఈడీ గట్టి షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆ పార్టీకి చెందిన మూడు బ్యాంకు ఖాతాలను ఈడీ అధికారులు స్తంభింపజేశారు. ఈ ఖాతాల్లో సుమారు 440.42 కోట్ల నిధులు ఉన్నట్లు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

039120
Total views : 194338

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: