Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Telangana రేవంత్‌రెడ్డి వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌

రేవంత్‌రెడ్డి వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌

by Satya
RSS

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌భగవత్‌ డైరెక్షన్‌లోనే కాంగ్రెస్‌ నడుస్తున్నదని, గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ వ్యవహరాలన్నీ నడిపించేది ఆర్‌ఎస్‌ఎస్సేనని ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ విమర్శించారు. వికారాబాద్‌లోని చిగుళ్లపల్లి గ్రౌండ్‌లో ఎంఐఎం ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అసదుద్దీన్‌ మా ట్లాడుతూ రేవంత్‌రెడ్డి బతికి ఉన్నంతవరకు ఆర్‌ఎస్‌ఎస్‌తోనే ఉంటారని, ఆయనను కాంగ్రెస్‌లోకి పంపింది ఆ సంస్థేనని అన్నా రు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఏజెంట్‌ అయిన రేవంత్‌ను కొడంగల్‌లో చిత్తుగా ఓడించాలని ఎంఐ ఎం శ్రేణులకు పిలుపునిచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించిన ప్రజలు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారని, పోటీ పరీక్షలకు బుర్ఖా ధరించి హాజరుకావద్దని కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకువచ్చిందని విమర్శించారు. ఈ తొమ్మిదన్నరేండ్లలో తెలంగాణలో బుర్ఖా ధరించి పరీక్షలకు వెళ్తే ఎవరైనా అడ్డుకున్నారా అనేది ఆలోచించాలని కోరారు. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని, రాష్ట్రం సస్యశ్యామలంగా, ప్రశాంతంగా ఉండాలంటే బీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతిచ్చి సీఎం కేసీఆర్‌ ప్రభుత్వాన్ని మూడోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. తొమ్మదిన్నరేండ్ల అభివృద్ధిని చూసి డిసెంబర్‌ 30న ఆలోచించి ఓటేయాలని సూచించారు. తొమ్మిదిన్నరేండ్లలో షాదీ ముబారక్‌ కింద 2 వేల 340 కోట్ల రూపాయల నిధులిచ్చారని, 205 మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేశారని తెలిపారు. 14 లక్షల మంది విద్యార్థులకు 474 కోట్ల రూపాయల పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. సీఎం ఓవర్సీస్‌ విద్యానిధి పథకం కింద 3 వేల 224 మంది ముస్ల్లింలకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసిందని వెల్లడించారు. గోషామహాల్‌లో బీజేపీకి మద్దతిస్తున్నది కాంగ్రెస్సేనని ఆరోపించారు. వయనాడ్‌లో రాహుల్‌గాంధీ పోటీ చేస్తే ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

039424
Total views : 196753

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: